Krithi Shetty: 30 భాషల్లో సబ్ టైటిల్స్, 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్.. కృతి శెట్టి క్యారెక్టర్‌పై మలయాళ హీరో కామెంట్స్
Tovino Thomas About Krithi Shetty In Arm Movie: ఆర్మ్ మూవీలో బేబమ్మ కృతి శెట్టి క్యారెక్టర్ ఎలా ఉండనుందనే ప్రశ్నపై సింపుల్ ఆన్సర్ ఇచ్చాడు మలయాళ హీరో టొవినో థామస్. అలాగే ఆర్మ్ సినిమాను 30 భాషల్లో సబ్ టైటిల్స్‌తో రిలీజ్ చేయనున్నట్లు ఆర్మ్ సినిమా ప్రమోషన్స్‌లో టొవినో థామస్ చెప్పాడు.
Tovino Thomas About Krithi Shetty: ఉప్పెన ఫేమ్ బేబమ్ కృతి శెట్టి గత కొంతకాలంగా నటించిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, మనమే సినిమాలు ప్లాప్‌గా నిలిచాయి. దీంతో తెలుగులో కృతిశెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి.
కానీ, మలయాళ సినిమాలో మాత్రం హీరోయిన్స్‌లో ఒకరిగా కృతి శెట్టి ఛాన్స్ కొట్టేసింది. కృతిశెట్టి నటించిన మలయాళ పాన్ ఇండియా సినిమా ఆర్మ్. మాలీవుడ్ స్టార్ హీరో టొవినో థామస్ కథానాయకుడిగా నటించిన అడ్వెంచర్ ఫాంటసీ మూవీ ఆర్మ్‌లో కృతిశెట్టితోపాటు ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ హీరోయిన్స్‌గా చేశారు.
జితిన్ లాల్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఆర్మ్ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో టొవినో థామస్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆర్మ్ సినిమాలో కృతి శెట్టి క్యారెక్టర్‌పై టొవినో థామస్ చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చాడు.
మీరు ఆరు నెలల్లో కళరి ఫైట్ నేర్చుకున్నారా?
-ఆరు నెలల్లో కళరి నేర్చుకోవడం అనేది పెద్ద మాట. ఆరు నెలలు కళరి ఫైట్ ప్రాక్టీస్ చేశాను. కొన్ని బేసిక్స్‌పై అవగాహన వచ్చింది.
మూవీని త్రీడీలో రిలీజ్ చేయడంపై?
-ఈ సినిమాకి ఇమాజినరీ ఫిక్షనల్ వరల్డ్‌ని క్రియేట్ చేశాం. అందరినీ కథలో లీనం చేయడం కోసం త్రీడీ చాల హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ స్పానిష్ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. దాదాపు ముప్పై భాషల్లో సబ్ టైటిల్స్ వేస్తున్నాం. యూనివర్శల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా.
ARM టైటిల్ గురించి ?
-ARM.. 'అజాయంతే రందం మోషణం'. అంటే అజయన్ రెండో దొంగతనం అని దీని అర్ధం. మిగతా భాషల వారికి ఈ పేరు పలకడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అందరూ పలికే విధంగా ARM గా వ్యవహరిస్తున్నాం.
ఆర్మ్ మ్యూజిక్ గురించి ?
-ధిబు నినాన్ తమిళ్‌లో పాపులర్ మ్యూజిక్ చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ చేయడంతో పాటు బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు.
ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడంపై?
- నడిగర్' సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తో అసోషియేట్ అయ్యాను. వారితో నాకు జర్నీ ఉంది. మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యుటర్స్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది.
ఎలాంటి కథలు ఎంచుకుకోవడానికి ఇష్టపడతారు?
-ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండే కథ, పాత్ర చేయాలనే నా ప్రయత్నం. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ప్రతి సినిమా నుంచి నేర్చుకుంటూ ముందుకువెళుతున్నాను.
కృతి శెట్టి క్యారెక్టర్ ఎలా ఉండనుంది?
- ఆర్మ్ ట్రైలర్‌లో మూడు డిఫరెంట్ లవ్ స్టొరీస్ కనిపించాయి. ఈ ప్రేమకథల్లో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి అంతా అద్భుతంగా నటించారు.
మిన్నల్ మురళికి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ కాంబినేషన్‌లో సీక్వెల్ రావచ్చా?
-మిన్నల్ మురళి డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నారు. సీక్వెల్ చేస్తే గనుక మిన్నల్ మురళి కంటే బెటర్‌గా ఉండే కథ కుదిరినప్పుడే చేయాలి.