Ananya Nagalla: ఓల్డ్ వైన్ లాంటి సినిమా.. మాతృదేవో భవ మూవీకి లాగా కనెక్ట్ అవుతారు.. హీరోయిన్ అనన్య నాగళ్ల కామెంట్స్
Ananya Nagalla Comments In Pottel Success Meet: వకీల్ సాబ్ బ్యూటి అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ పొట్టేల్. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇవాళ (అక్టోబర్ 26) పొట్టెల్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అనన్య నాగళ్ల.
Ananya Nagalla Pottel Success Meet: మల్లేషం, వకీల్ సాబ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య నాగళ్ల తాజాగా నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ పొట్టేల్. అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యువ చంద్ర హీరోగా యాక్ట్ చేశాడు.
ప్రశంసలు అందుకుంటూ
సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్ 'పొట్టేల్' చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్‌లో అదరగొట్టారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, విమర్శకులు ప్రశంసలు అందుకుంటోంది.
అలాగే, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న పొట్టేల్ మూవీ ఘన విజయాన్ని సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ టీమ్ పొట్టేల్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. పొట్టేల్ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ అనన్య నాగళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
వంద శాతం ఫిల్
"పొట్టేల్ సినిమాకి ప్రేక్షకులు నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. మేము ఊహించిన దాని కంటే చాలా గొప్పగా రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్, ఫస్ట్ డేకి ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్ ఆడియన్స్. థియేటర్స్ 100% ఫిల్ అయ్యాయి" అని హీరోయిన్ అనన్య నాగళ్ల తెలిపింది.
"ఒక చిన్న సినిమాకి ఈ మధ్య కాలంలో ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు. సాహిత్ ఒక అద్భుతమైన కథని చాలా గొప్పగా మలిచాడు. చూసినకొద్ది చూడాలనిపిస్తుంది. ఇది ఒక ఓల్డ్ వైన్ లాగా. చూస్తున్నకొద్ది నచ్చుతుంది. నా రోల్ గురించి చాలా మంది ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ బుజ్జమ్మ అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని అనన్య నాగళ్ల పేర్కొంది.
ఫ్యామిలీ ఆడియెన్స్
"నిర్మాతలు చాలా పాషన్‌తో ఈ సినిమా చేశారు. యువ చాలా అద్భుతంగా నటించారు. అందరికీ థాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా రావాలి. మాతృదేవో భవ సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యారో ఈ సినిమాకి కూడా అలానే కనెక్ట్ అవుతారు. అందరూ వచ్చి ఈ సినిమాని థియేటర్స్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి" అని అనన్య నాగళ్ల తన స్పీచ్ ముగించింది.
అలాగే, డైరెక్టర్ సాహిత్ మోత్ఖూరి మాట్లాడుతూ.. "సినిమాకి 80 శాతం రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివిటీ ఏ సినిమాకి రాలేదు. అందరూ హానెస్ట్ సినిమా అని చెబుతున్నారు. యువ, అనన్య, అజయ్, నోయల్ అందరి పెర్ఫార్మెన్స్‌లకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది" అని తెలిపారు.
చాలా గొప్పగా ఉంది
"ప్రతి థియేటర్‌లో పొట్టేల్ సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది. ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్ యూ. అజయ్ అన్న కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. యువని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అనన్య పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా చేసినందుకు చాలా గొప్పగా ఫీలౌతున్నాను" అని డైరెక్టర్ సాహిత్ తన స్పీచ్ ముగించారు.