మీరు పుట్టిన తేదీ ప్రకారం మిమ్మల్ని నిరంతరం రక్షించే దేవుడు ఎవరో తెలుసా ?-do you know who is the god who will always protect you according to your date of birth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మీరు పుట్టిన తేదీ ప్రకారం మిమ్మల్ని నిరంతరం రక్షించే దేవుడు ఎవరో తెలుసా ?

మీరు పుట్టిన తేదీ ప్రకారం మిమ్మల్ని నిరంతరం రక్షించే దేవుడు ఎవరో తెలుసా ?

Gunti Soundarya HT Telugu
Nov 12, 2024 01:27 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో పుట్టిన తేదీకి అనుగుణంగా జాతకం చెప్తారు. న్యూమరాలజీ ప్రకారం ఒక్కో తేదీకి ఒక్కో దేవుడు పాలిస్తాడు. అలా మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఏ దేవుడు రక్షణగా నిలుస్తున్నాడో తెలుసా?

న్యూమరాలజీ
న్యూమరాలజీ (pixabay)

మనం పుట్టినప్పుడే మనకు జోడీ ఎవరు అనేది ఆ భగవంతుడు రాసి పెడతాడు అనే మాట చాలా మంది నోటి నుంచి వింటూనే ఉంటారు. అలాగే మనం పుట్టిన తేదీని బట్టి మనల్ని దేవుడు సంరక్షిస్తూ ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, నక్షత్రం, సమయం బట్టి జాతకాన్ని అంచనా వేస్తారు. అదే విధంగా న్యూమరాలజీ ప్రకారం కూడా వ్యక్తి గుణగుణాలు చెప్తారు.

హిందూ మతంలో ప్రతి తేదీని ఒక దేవుడు లేదా దేవత పాలిస్తుందని నమ్ముతారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు ఒక్కో దేవత/ దేవుడు ఉంటారు. ఆయా తేదీల్లో జన్మించిన వారి విధి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి అనే దాని గురించి న్యూమరాలజీ స్పష్టంగా వెల్లడిస్తుంది. ఏ తేదీలో జన్మించిన వారికి ఎవరి ఆశీర్వాదం లభిస్తుందో తెలుసుకుందాం.

1

1, 10, 19, 28 తేదీల్లో జన్మించి వ్యక్తులకు వచ్చేది ఒకటి. వీళ్ళు మహా విష్ణువు మార్గదర్శకంలో జీవిస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి తారులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. మానవాళికి సహాయం చేసేందుకు విష్ణువు వివిధ అవతారాలు ఎత్తినట్టుగా వీళ్ళు కూడా ఇతరులకు సహాయం చేసేందుకు ఎంత దూరమైన వెళతారు. సహనం, జ్ఞానం వీరికి ఉన్న ప్రత్యేక లక్షణాలు.

2

2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు శివుని మార్గదర్శకత్వంలో ఉంటాయి. తమ చుట్టూ ఉన్న వారి పట్ల ఎక్కువ సానుభూతి కలిగి ఉంటారు. చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులను అర్థం చేసుకోవడంలో వీరి తర్వాతే ఎవరైనా.

3

3, 12, 21, 30.. న్యూమరాలజీ ప్రకారం 3 కూడా విష్ణువుకు సంబంధించినది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రతిభా పాటవాలు అధికంగానే ఉంటాయి. శక్తివంతమైన ప్రకాశం కలిగి ఉంటారు. ఇతరుల పట్ల చాలా నమ్మకంగా వ్యవహరిస్తారు. జీవితంలో సవాళ్ళు ఎదుర్కోవడంలో వీళ్ళు అవలంభించే విధానం అందరినీ కట్టి పడేస్తుంది.

4

4, 13, 22, 31 విభిన్న నమ్మకాల ప్రకారం 4 అనేది విఘ్నాలు తొలగించే వినాయకుడికి సంబంధించినదిగా చెప్తారు. అడ్డంకులు అధిగమనించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఆచారణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంటారు. మంచి మాటలు వీరి సొంతం. ఆటంకాలకు అసలు భయపడరు.

5

5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళను ఇద్దరు దేవళ్లు సంరక్షిస్తారట. ఒకరు వినాయకుడు అయితే మరొకరు శ్రీరాముడు. వీరికి విజయం సాధించే లక్షణాలు ఎక్కువ. రాముడిలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే అడ్డంకుల నుంచి ఎలా తప్పించుకోవలో కూడా తెలుసు.

6

5, 15, 24 న్యూమరాలజీ ప్రకారం ఆరు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఆరోగ్యం, సంపదను ఇచ్చే లక్ష్మీదేవి వీరికి సంరక్షకురాలిగా ఉంటుంది. జీవితంలో సమృద్ధి ఉంటుంది. ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు.

7

7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి వినాయకుడు సారధ్యం వహిస్తాడు. సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యలు పరిష్కరించడంలో నేర్పరులు. ఇతరులతో కలిసి ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.

8

8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి శని దేవుడు మార్గదర్శి. క్రమశిక్షణ బాగుంటుంది. బాధ్యతాయుతంగా ఉంటాయి. కష్టాలను ఎదుర్కొంటూ విజయం వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు.

9

9, 18, 27 తేదీల్లో పుట్టిన వారిని హనుమంతుడు రక్షిస్తూ ఉంటారు. వీరికి దృఢ సంకల్పం ఎక్కువ. ధైర్యవంతులుగా ఉంటారు. విశ్వాసానికి విధేయులు, అంకితభావంతో పనులు చేస్తారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner