ఆసియా కప్ విన్నర్స్ లిస్ట్, Asia Cup Winners List in Telugu - HT Telugu
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆసియా కప్  /  విన్నర్స్ లిస్ట్

ఆసియా కప్ విన్నర్స్ లిస్ట్


ఆసియాకప్‌ 2023 ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. అయితే 2022 వరకూ మొత్తం 15 సార్లు ఆసియా కప్ జరిగింది. అందులో అత్యధికంగా ఏడుసార్లు ఇండియా, ఆరుసార్లు శ్రీలంక, రెండుసార్లు పాకిస్థాన్ విజయం సాధించాయి. భారత ఉపఖండంలో జరిగే ఈ అతిపెద్ద టోర్నీలో ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 1984లో జరిగిన తొలి ఆసియా కప్ ను గెలవడంతోపాటు చివరిసారి 2018లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా తన ఏడో టైటిల్ సాధించింది. వరల్డ్ క్రికెట్ లోని టాప్ టీమ్స్ లో ఒకటైన పాకిస్థాన్ మాత్రం ఆసియా కప్ విషయానికి వచ్చేసరికి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే టైటిల్ గెలిచింది. 2022లో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక.. ఏకంగా కప్పు గెలిచి సంచలనం సృష్టించింది. ఆ జట్టు ఆసియా కప్ గెలవడం అది ఆరోసారి. 2023లోనూ ఇండియా, పాకిస్థాన్ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈసారి టోర్నీ పాకిస్థాన్ తోపాటు శ్రీలంకలోనూ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో స్వదేశంలో లంకను తక్కువ అంచనా వేయలేం.

ఆసియా కప్ 1984లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 2022 వరకు ఏ ఏడాది ఎవరు విజేతగా నిలిచారు ఒకసారి చూద్దాం. 1984లో జరిగిన తొలి ఆసియా కప్ లో పాకిస్థాన్, శ్రీలంకలను వెనక్కి నెట్టి ఇండియా విజేతగా నిలిచింది. అంతకుముందు ఏడాదే వరల్డ్ కప్ గెలిచిన ఊపులో ఆసియాలోనూ ఇండియా ఆధిపత్యం చెలాయించింది. 1986 ఆసియా కప్ లో ఇండియా ఆడలేదు. శ్రీలంకలో ఈ టోర్నీ జరగడంతో ఆ దేశంతో క్రికెట్ సంబంధాలు అంత బాగా లేకపోవడంతో బాయ్‌కాట్ చేసింది. దీంతో ఆ ఏడాది పాక్ ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది.1988లో ఇండియా మరోసారి టైటిల్ గెలిచింది. బంగ్లాదేశ్ లో జరిగిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై ఇండియన్ టీమ్ విజయం సాధించింది. 1990లో జరిగిన ఆసియాకప్ లోనూ ఇండియానే విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఆడలేదు. ఫైనల్లో శ్రీలంకను ఓడించి ఇండియా విజేతగా నిలిచింది. 1995లో జరిగిన టోర్నీలో ఇండియా నాలుగోసారి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఈసారి కూడా ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలిచింది. 1997లో మరోసారి శ్రీలంక చేతికి ఆసియా కప్ వెళ్లింది. అంతకుముందు ఏడాదే వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక.. ఫైనల్లో ఇండియాను ఓడించి రెండోసారి టైటిల్ గెలిచింది. 2000లో జరిగిన ఆసియా కప్ లో తొలిసారి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఆ ఏడాదే తొలిసారి ఇండియా ఫైనల్ చేరడంలో విఫలం కాగా.. శ్రీలంకను ఓడించి పాక్ టైటిల్ గెలిచింది. 2004లో స్వదేశంలో జరిగిన ఆసియా కప్ ను శ్రీలంక మూడోసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇండియాను 25 పరుగుల తేడాతో ఓడించింది. 2008లోనూ శ్రీలంకనే ఆసియా కప్ వరించింది. జయసూర్య, అజంత మెండిస్ మాయతో ఫైనల్లో ఇండియాను ఓడించి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. 2010లో ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్ సొంతం చేసుకుంది. శ్రీలంకను ఫైనల్లో చిత్తు చేసి ఐదోసారి టైటిల్ సాధించింది. 2012లో పాకిస్థాన్ రెండోసారి ఆసియా కప్ గెలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి టైటిల్ సొంతం చేసుకుంది. 2014లో టైటిల్ మరోసారి శ్రీలంక సొంతమైంది. ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించి ఐదోసారి ఆసియా కప్ గెలిచింది. 2016లో మరోసారి ధోనీ కెప్టెన్సీలోనే గెలిచిన ఇండియా ఆరో ఆసియాకప్ సాధించింది. ఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. 2018లో రోహిత్ కెప్టెన్సీలోని ఇండియా ఏడోసారి ఆసియాకప్ గెలిచింది. ఈసారి కూడా ఫైనల్లో బంగ్లాదేశ్ పైనే విజయం సాధించింది. 2022లో జరిగిన ఆసియా కప్ లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ఆరోసారి ఆసియాకప్ గెలిచి ఆశ్చర్యపరిచింది. టీ20 ఫార్మాట్ లో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్లో పాకిస్థాన్ ను చిత్తు చేసింది.

YearWinnerRunner UpPlayer of the SeriesVenue
2022RunnerUp LogoSri LankaSL170/6RunnerUp LogoPakistanPAK140/10Bhanuka Rajapaksa (Sri Lanka)Dubai
2018RunnerUp LogoIndiaIND223/7RunnerUp LogoBangladeshBAN222/10Shikhar Dhawan (India)Dubai
2016RunnerUp LogoIndiaIND122/2RunnerUp LogoBangladeshBAN120/10Sabbir Rahman (Bangladesh)Dhaka
2014RunnerUp LogoSri LankaSL261/5RunnerUp LogoPakistanPAK260/10Lahiru Thirimanne (Sri Lanka)Dhaka
2012RunnerUp LogoPakistanPAK236/9RunnerUp LogoBangladeshBAN234/8Shakib Al Hasan(Bangladesh)Dhaka
2010RunnerUp LogoIndiaIND268/6RunnerUp LogoSri LankaSL187/10Shahid Afridi (Pakistan)Dambulla
2008RunnerUp LogoSri LankaSL273/7RunnerUp LogoIndiaIND173/10Ajantha Mendis (Sri Lanka)Karachi
2004RunnerUp LogoSri LankaSL228/9RunnerUp LogoIndiaIND203/9Sanath Jayasuriya (Sri Lanka)Colombo
2000RunnerUp LogoPakistanPAK277/4RunnerUp LogoSri LankaSL238/10Mohammad Yousuf (Pakistan)Dhaka
1997RunnerUp LogoSri LankaSL240/2RunnerUp LogoIndiaIND239/7Arjuna Ranatunga (Sri Lanka)Colombo
1995RunnerUp LogoIndiaIND233/2RunnerUp LogoSri LankaSL230/7Navjot Sidhu (India)Sharjah
1990-91RunnerUp LogoIndiaIND205/3RunnerUp LogoSri LankaSL204/9N/AKolkata
1988RunnerUp LogoIndiaIND180/4RunnerUp LogoSri LankaSL176/10Navjot Sidhu (India)Dhaka
1986RunnerUp LogoSri LankaSL195/5RunnerUp LogoPakistanPAK191/9Arjuna Ranatunga (Pakistan)Colombo
1984RunnerUp LogoIndiaIND97/0RunnerUp LogoSri LankaSL96/10Surinder Khanna (India)Sharjah

వార్తలు

FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)

ఆసియా కప్ అత్యధికసార్లు గెలిచిన జట్టు ఏది?

ఆసియా కప్ అత్యధికసార్లు గెలిచిన జట్టు ఇండియా. ఇప్పటి వరకూ ఏడుసార్లు గెలిచింది.

ఆసియా కప్ ను ఇండియా ఎన్నిసార్లు గెలిచింది?

ఆసియా కప్ ను ఇండియా ఇప్పటి వరకూ ఏడుసార్లు గెలిచింది. 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018లలో ఈ ట్రోఫీ ఇండియా సొంతమైంది.

ఆసియా కప్ ఇప్పటి వరకూ ఎన్నిసార్లు జరిగింది?

ఆసియా కప్ ఇప్పటి వరకూ 15సార్లు జరిగింది. 2023లో 16వసారి టోర్నీ జరగబోతోంది. ఇందులో ఇండియా 7, శ్రీలంక 6, పాకిస్థాన్ 2 టైటిల్స్ గెలిచాయి.