ఆసియా కప్ 2023 వేదికలు, Asia Cup 2023 Venues in Telugu - HT Telugu
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఓవర్ వ్యూ  /  ఆసియా కప్ వేదికలు

ఆసియా కప్ 2023 వేదికలు


ఆసియా కప్ 2023 రెండు దేశాల్లో జరగనుంది. నిజానికి ఈ ఏడాది ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కు దక్కాయి. దీంతో ఆ దేశంలోనే టోర్నీ జరగాల్సింది. అయితే ఆ దేశంలో ఇండియా సంబంధాలు అంత బాగా లేకపోవడంతోపాటు దశాబ్దకాలంగా క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ కు జట్టును పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ పద్ధతిలో తమ దేశంతోపాటు శ్రీలంకలోనూ మ్యాచ్ లను నిర్వహించాలని ప్రతిపాదించింది. దానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. దీని ప్రకారం టోర్నీలో మొత్తం 13 మ్యాచ్ లు జరగనుండగా.. అందులో నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ లో, 9 మ్యాచ్ లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇండియా ఆడబోయే మ్యాచ్ లన్నీ శ్రీలంకలోనే ఉంటాయి. పాకిస్థాన్ లో మూడు లీగ్ మ్యాచ్ లు, ఒక సూపర్ 4 మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ సహా మిగిలిన మ్యాచ్ లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. గతేడాది శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సిన ఆసియా కప్.. ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఏఈలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఈ రూపంలో ఆ దేశానికి ఆసియా కప్ నిర్వహించే అవకాశం దక్కింది.

ఆసియా కప్ 2023 పాకిస్థాన్, శ్రీలంకలోని మొత్తం ఆరు వేదికల్లో జరగనుంది. పాకిస్థాన్ లోని ముల్తాన్, లాహోర్.. శ్రీలంకలోని పల్లెకెలె, కొలంబోల్లో ఆసియా కప్ 2023 మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ ఆగస్ట్ 30న పాకిస్థాన్, నేపాల్ మధ్య ముల్తాన్ లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఫైనల్ శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సెప్టెంబర్ 17న జరుగుతుంది. ఇండియా తన మ్యాచ్ లన్నింటినీ పల్లెకెలె, కొలంబోల్లో ఆడుతుంది. లీగ్ స్టేజ్ లోని రెండు మ్యాచ్ లు పల్లెకెలెలో.. సూపర్ 4 మ్యాచ్ లు కొలంబోలో ఇండియా ఆడుతుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 2న పల్లెకెలెలో లీగ్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ 2023లో ఇండియా ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే. ఇక రెండో లీగ్ మ్యాచ్ నేపాల్ తో సెప్టెంబర్ 4న కూడా పల్లెకెలెలోనే ఆడుతుంది. మరోవైపు సెప్టెంబర్ 10న సూపర్ 4లో భాగంగా కూడా ఈ రెండు దేశాల మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. పాకిస్థాన్ లోని ముల్తాన్ లో ఒక మ్యాచ్ జరగనుండగా.. అక్కడ జరగాల్సిన మిగతా మూడు మ్యాచ్ లూ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఉంటాయి. శ్రీలంకలో జరగబోయే 9 మ్యాచ్ లలో మూడు పల్లెకెలెలో, ఆరు కొలంబోలో జరుగుతాయి. శ్రీలంకలో జరగబోయే మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.
The Gaddafi Cricket Stadium

The Gaddafi Cricket Stadium

Lahore, Pakistan
గడాఫీ క్రికెట్ స్టేడియం చారిత్రక లాహోర్ నగరంలో ఉంది. ఇక్కడి స్టేడియానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్టేడియాన్ని ప్రముఖ ఆర్కిటెక్ట్ నయ్యర్ అలీ డాబా డిజైన్ చేశారు. మొఘల్ ఆర్కిటెక్చర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ గడాఫీ స్టేడియాన్ని డిజైన్ చేశారు. ఇక్కడి ఇటుకల నిర్మాణం ఈ స్టేడియానికి ప్రత్యేక లుక్ ఇస్తోంది. లిబియాకు చెందిన కల్నల్ గడాఫీ పేరు మీదుగా ఈ స్టేడియానికి ఆ పేరు పెట్టారు. ఈ స్టేడియం 1959లో తన తొలి టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. 1996 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఈ స్టేడియంలోనే జరిగింది. ఆ సమయంలోనే ఈ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు. పాకిస్థాన్‌లోని అతిపెద్ద స్టేడియం ఇది. అంతకుముందు కాంక్రీట్ బెంచీలను తీసేసి పూర్తి ప్లాస్టిక్ చెయిర్లను వేశారు. ఈ స్టేడియంలో 60 వేల మంది కూర్చొని మ్యాచ్ చూసే వీలుంది. 1996 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక, ఆస్ట్రేలియా ఇక్కడ తలపడగా.. శ్రీలంక విజేతగా నిలిచింది. మొదట్లో దీనిని లాహోర్ స్టేడియంగా పిలిచినా.. 1974లో గడాఫీ స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియంలో పాకిస్థాన్ జట్టుకు మంచి రికార్డు ఉంది. ఈ స్టేడియంలోనే 1976లో న్యూజిలాండ్ పై ఐదో వికెట్ కు జావెద్ మియందాద్, ఆసిఫ్ ఇక్బాల్ రికార్డు 281 రన్స్ జోడించారు. ఇక ఇంజమాముల్ హక్ ట్రిపుల్ సెంచరీ కూడా ఇదే స్టేడియంలో నమోదైంది. అది న్యూజిలాండ్ పైనే కావడం విశేషం.
…read more

MATCHES WON

Batting First34 Won
Bowling First31 Won
50.75%49.25%
Avg 1st Innings253
Avg 2nd Innings218
PACE
69.89%

Percentage of wickets
taken by pacers

SPIN
30.11%

Percentage of wickets
taken by spinners

Pace Friendly

Team-wise Asia Cup performance at Gaddafi Stadium, Lahore

TeamsMatchesWonLostTieWin %
553419062
14104071
725029
642067
10100
The Multan Cricket Stadium

The Multan Cricket Stadium

Multan, Pakistan
ముల్తాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియం పాకిస్థాన్ లోని అతిపెద్ద, ఫేమస్ క్రికెట్ స్టేడియాల్లో ఒకటి. ఈ స్టేడియంలో క్రికెట్ తోపాటు ఫుట్‌బాల్ కూడా ఆడతారు. ఇందులో 30 వేల మంది మ్యాచ్ చూసే వీలుంది. మంచి పచ్చికతో ఈ గ్రౌండ్ చాలా అందంగా ఉంటుంది. పాకిస్థాన్ లోని అందమైన స్టేడియంగా ఈ ముల్తాన్ స్టేడియానికి పేరుంది. ఈ మధ్యే స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటుచేశారు. 2001లో ఈ స్టేడియం ప్రారంభమైంది. ముల్తాన్ లోని ఓల్డ్ ఖాసిం బాగ్ స్టేడియాన్ని తీసేసి ఈ కొత్త స్టేడియాన్ని నిర్మించారు. 2001లోనే తొలి టెస్ట్ మ్యాచ్ ఇక్కడ జరిగింది. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్.. బంగ్లాదేశ్ ను ఇన్నింగ్స్ 264 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఇదే స్టేడియంలో మన వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ చేయడం విశేషం. 2003 నుంచి వన్డేలు కూడా జరుగుతున్నాయి. తొలి వన్డే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగగా.. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ సులువుగా గెలిచింది.
…read more

MATCHES WON

Batting First6 Won
Bowling First5 Won
54.55%45.45%
Avg 1st Innings263
Avg 2nd Innings197
PACE
63.16%

Percentage of wickets
taken by pacers

SPIN
36.84%

Percentage of wickets
taken by spinners

Pace Friendly

Team-wise Asia Cup performance at Multan Cricket Stadium, Multan

TeamsMatchesWonLostTieWin %
1183073
20200
1100100
10100
R Premadasa Stadium

R Premadasa Stadium

Colombo, SriLanka
శ్రీలంక రాజధాని కొలంబోలని ఆర్ ప్రేమదాస స్టేడియం చాలా పాతది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న స్టేడియం. ఆ దేశ మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస పేరు మీదుగా ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఖెట్టరామా ఆలయం పక్కనే ఈ స్టేడియం ఉంటుంది. శ్రీలంకలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది. మొదట్లో ఖెట్టరామా స్టేడియంగానే పిలిచినా.. తర్వాత పేరు మార్చారు. శ్రీలంకలో వరల్డ్ కప్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన మూడు స్టేడియాల్లో ఇదీ ఒకటి. ఇండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో శ్రీలంక ఒక ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 952 పరుగులు చేసింది ఈ స్టేడియంలోనే. ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మధ్య కాలంలో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ లు జరగలేదు. ఇప్పుడు ఆసియా కప్ 2023 ఫైనల్ ఈ స్టేడియంలోనే జరగబోతోంది
…read more

MATCHES WON

Batting First80 Won
Bowling First59 Won
54.05%45.95%
Avg 1st Innings236
Avg 2nd Innings194
PACE
54.64%

Percentage of wickets
taken by pacers

SPIN
45.36%

Percentage of wickets
taken by spinners

Pace Friendly

Team-wise Asia Cup performance at R.Premadasa Stadium, Colombo

TeamsMatchesWonLostTieWin %
1277841061
502620052
261410054
1311208
10100
Pallekele International Stadium

Pallekele International Stadium

Kandy, SriLanka
శ్రీలంకలోని క్యాండీలో ఉన్న పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియాన్ని 2009లో నిర్మించారు. 35 వేల మంది కూర్చొని మ్యాచ్ చూసే అవకాశం ఉంది. శ్రీలంకలోని కొత్త స్టేడియాల్లో ఇదీ ఒకటి. ఇక్కడే 1983 నుంచి 2007 వరకూ టెస్టు మ్యాచ్ లకు వేదికైన అస్గిరియా స్టేడియానికి బదులు ఈ పల్లెకెలె స్టేడియాన్ని నిర్మించారు. 2010లో శ్రీలంక, పాకిస్థాన్ మధ్య తొలి టెస్ట్ జరిగింది. 2011 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ కూడా మ్యాచ్ లు జరిగాయి. స్థానిక కండురాట దేశవాళీ జట్టుకు కూడా ఇది సొంత స్టేడియంగా ఉంది. 2012లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ పలు మ్యాచ్ లు ఈ స్టేడియంలో జరిగాయి. కొత్త వేదికలో టెస్ట్ క్రికెట్ తొలి బంతికే వికెట్ తీసిన ఘనతను సురంగ లక్మల్ ఇదే స్టేడియంలో అందుకున్నాడు. ఈ క్రమంలో కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ ల సరసన అతడు నిలిచాడు.
…read more

MATCHES WON

Batting First16 Won
Bowling First21 Won
41.03%58.97%
Avg 1st Innings257
Avg 2nd Innings205
PACE
60.08%

Percentage of wickets
taken by pacers

SPIN
39.92%

Percentage of wickets
taken by spinners

Pace Friendly

Team-wise Asia Cup performance at Pallekele International Cricket Stadium, Kandy

TeamsMatchesWonLostTieWin %
351915054
623033
614017
540080
211050
10100

వార్తలు

FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)

ఆసియా కప్ 2023 జరిగే వేదికలు ఏవి?

ఆసియా కప్ 2023 పాకిస్థాన్, శ్రీలంకల్లోని నాలుగు వేదికల్లో జరగనున్నాయి. పాకిస్థాన్ లోని ముల్తాన్, లాహోర్.. శ్రీలంకలోని పల్లెకెలె, కొలంబోలు ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి.

ఆసియా కప్ 2023లో ఇండియా ఆడే మ్యాచ్ వేదికలు ఏవి?

ఆసియా కప్ 2023లో ఇండియా తన మ్యాచ్ లన్నీ శ్రీలంకలోనే ఆడుతుంది. లీగ్ స్టేజ్ లో పాకిస్థాన్, నేపాల్ లతో పల్లెకెలె స్టేడియంలో, సూపర్ 4, ఫైనల్ మ్యాచ్ లు కొలంబోలో జరుగుతాయి

ఆసియా కప్ 2023లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎక్కడ జరగనుంది?

ఆసియా కప్ 2023లో ఇండియా, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ సెప్టెంబర్ 2న పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. ఇక ఈ రెండు జట్లూ సూపర్ 4 చేరితే సెప్టెంబర్ 10న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో, ఫైనల్ చేరితే సెప్టెంబర్ 17న అదే ప్రేమదాస స్టేడియంలో ఆడతాయి