RCB: విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన లేడీ క్రికెటర్ సడన్‌గా ఆర్సీబీ టీమ్‌లో ప్రత్యక్షం, 7 ఏళ్ల నుంచి రిప్లై ఇవ్వని కోహ్లీ-england player danni wyatt roped in by rcb via trade ahead of wpl 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb: విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన లేడీ క్రికెటర్ సడన్‌గా ఆర్సీబీ టీమ్‌లో ప్రత్యక్షం, 7 ఏళ్ల నుంచి రిప్లై ఇవ్వని కోహ్లీ

RCB: విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన లేడీ క్రికెటర్ సడన్‌గా ఆర్సీబీ టీమ్‌లో ప్రత్యక్షం, 7 ఏళ్ల నుంచి రిప్లై ఇవ్వని కోహ్లీ

Galeti Rajendra HT Telugu
Oct 31, 2024 06:00 AM IST

Danni Wyatt RCB: విరాట్ కోహ్లీకి ఏడేళ్ల క్రితం అర్ధరాత్రి ప్రపోజ్ చేసిన ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ ప్లేయర్ డేనియల్ వ్యాట్ ఆర్సీబీ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది ఒక లెస్బియన్‌‌ని డేనియల్ పెళ్లి చేసుకోవడం గమనార్హం.

డేనియల్ వ్యాట్
డేనియల్ వ్యాట్ (X)

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ స్టార్ క్రికెటర్ డేనియల్ వ్యాట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళల జట్టులోకి ప్రవేశించింది. భారత్‌లో ఏటా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆర్సీబీ తరఫున ఇక డేనియల్ వ్యాట్ ఆడనుంది.

విరాట్ కోహ్లీకి ప్రపోజ్

వాస్తవానికి యూపీ వారియర్స్ తరఫున ఇప్పటి వరకు డేనియల్ వ్యాట్ ఆడింది. కానీ.. ఇప్పుడు సడన్‌గా ఆర్సీబీలోకి ఎంట్రీ ఇచ్చింది. 33 ఏళ్ల వ్యాట్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఏడేళ్ల క్రితం.. అంటే 2014లో విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసి అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కానీ ఆ ప్రపోజల్‌పై విరాట్ కోహ్లీ స్పందించలేదు.

‘‘ఇంగ్లాండ్ బ్యాటర్ డేనియల్ వ్యాట్ మహిళల ప్రీమియర్ లీగ్- 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడనుంది’’ అని డబ్ల్యూపీఎల్ ఒక ప్రకటనని విడుదల చేసింది. యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ వేలంలో రూ. 30 లక్షలకు అప్పట్లో వ్యాట్‌ని కొనుగోలు చేయగా.. ఆమె అదే ఫీజుతో ఆర్సీబీలోకి రావడం గమనార్హం.

వ్యాట్‌కి అపార అనుభవం

ఇంగ్లాండ్ తరుపున రెండు టెస్టులు, 112 వన్డేలు, 167 టీ20లు ఆడిన డేనియల్ వ్యాట్.. మెరుగైన ఆఫ్ స్పిన్‌‌ను కూడా బౌలింగ్ చేయగలదు. దాంతో ఆర్సీబీ టీమ్ బలం మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. డబ్ల్యూపీఎల్- 2024 టైటిల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే.

డేనియల్ వ్యాట్ ఎంట్రీపై ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ ‘‘డేనియల్ గేమ్ ఛేంజర్, గొప్ప బ్యాటర్. ఆమె నైపుణ్యాలు, పోరాట స్ఫూర్తి ఆర్సీబీ విజన్‌కు చక్కగా సరిపోతాయి. ఆర్సీబీ టీమ్‌లోకి డేనియల్ వ్యాట్‌ను ఆహ్వానిస్తున్నాం. అలానే వ్యాట్‌తో కలిసి ఆడటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’’ అని మంధాన చెప్పుకొచ్చింది.

పెరిగిన ఆర్సీబీ టీమ్ బలం

ఆర్సీబీ మహిళా జట్టు హెడ్ కోచ్ ల్యూక్ విలియమ్స్ కూడా డేనియల్ వ్యాట్ రాకపై స్పందించారు. ‘‘అద్భుతమైన బ్యాటింగ్, ఫీల్డింగ్‌కి డేనియల్ వ్యాట్ పెట్టింది పేరు. ఆర్సీబీకి అనుభవంతో పాటు ప్రతిభను కూడా జోడించినట్లయ్యింది. అంతర్జాతీయ క్రికెట్లో డేనియల్ వ్యాట్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కాబట్టి రాబోయే సీజన్‌లో ఆర్సీబీ మరింత బలంగా ఆధిపత్యం చెలాయిస్తుంది’’ అని ల్యూక్ విలియమ్స్ ధీమా వ్యక్తం చేశారు.

కోహ్లికి ప్రపోజ్.. లెస్బియన్‌తో పెళ్లి

విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన డేనియల్ వెయిట్ అనూహ్యంగా ఈ ఏడాది అగస్టులో లండన్‌లోని కాబేస్ ఫుట్‌బాల్ క్లబ్ హెడ్ జార్జ్ హాడ్జ్‌ అనే లెస్బియన్‌ను పెళ్లి చేసుకుంది. విరాట్ కోహ్లీ 2017, డిసెంబరులో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Whats_app_banner