తెలుగు న్యూస్ / ఫోటో /
Smriti Mandhana: సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- Smriti Mandhana - INDW vs NZW: న్యూజిలాండ్‍తో మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. సిరీస్ కైవసం చేసుకుంది. సెంచరీ చేసిన స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఆ వివరాలివే..
- Smriti Mandhana - INDW vs NZW: న్యూజిలాండ్‍తో మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. సిరీస్ కైవసం చేసుకుంది. సెంచరీ చేసిన స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఆ వివరాలివే..
(1 / 5)
న్యూజిలాండ్‍తో వన్డే సిరీస్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. నేడు (అక్టోబర్ 29) అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో కివీస్‍పై టీమిండియా విజయం సాధించింది. 2-1తో హర్మన్‍ప్రీత్ కౌర్ సేన మూడు వన్డేల సిరీస్‍ను దక్కించుకుంది.
(2 / 5)
ఈ మూడో వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన 122 బంతుల్లో 100 పరుగులు చేశారు. శకతంతో అదరగొట్టారు. దీంతో వన్డేల్లో ఎనిమిదో శతకం పూర్తి చేసుకున్నారు. ఓ హిస్టరీ క్రియేట్ చేశారు. (BCCI)
(3 / 5)
భారత మహిళల జట్టు తరఫున అత్యంత వన్డే శతకాలు (8) చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 232 (211 ఇన్నింగ్స్) వన్డేల్లో ఏడు శతకాలు చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును స్మృతి బద్దలుకొట్టారు. 88 వన్డేల్లోనే ఎనిమిది సెంచరీలు చేసి.. అత్యధిక వన్డే శతకాలు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డును కైవసం చేసుకున్నారు.
(4 / 5)
ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్ హల్లీడే (88) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు, ప్రియా మిశ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు. రేణుక సింగ్, సైమా థాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇతర గ్యాలరీలు