Best Sedan car : టయోటా నుంచి సూపర్​ స్టైలిష్​ సెడాన్​- సరికొత్తగా లాంచ్​ అవుతోంది!-new toyota camry india launch on december 11 likely to be assembled locally ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Sedan Car : టయోటా నుంచి సూపర్​ స్టైలిష్​ సెడాన్​- సరికొత్తగా లాంచ్​ అవుతోంది!

Best Sedan car : టయోటా నుంచి సూపర్​ స్టైలిష్​ సెడాన్​- సరికొత్తగా లాంచ్​ అవుతోంది!

Sharath Chitturi HT Telugu
Nov 18, 2024 01:37 PM IST

Toyota Camry : కొత్త తరం టయోటా కామ్రీ సెడాన్ భారతదేశంలో లాంచ్​కు రెడీ అవుతోంది. పైగా ఈ మోడల్​ని స్థానికంగా అసెంబుల్ చేయనుంది సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆల్​ న్యూ టయోటా కామ్రీ..
ఆల్​ న్యూ టయోటా కామ్రీ..

నెక్ట్స్ జనరేషన్ టయోటా కామ్రీ సెడాన్ డిసెంబర్ 11 న భారతదేశంలో లాంచ్ కానుంది. తొమ్మిదొవ తరం టయోటా కామ్రీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇక ఈ మోడల్​ ఇండియాలోనే అసెంబుల్​ అవుతుందని తెలుస్తోంది. ఫలితంగా ఈ సెడాన్​ మరింత పోటీ ధరకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సెడాన్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఆల్​ న్యూ టయోటా కామ్రీ విశేషాలు..

11ఏళ్ల క్రితం తొలిసారి టయోటా కామ్రీ సెడాన్​ ఇండియాలో అడుగుపెట్టింది. త్వరలో లాంచ్​ కానున్న టయోటా కామ్రీ ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న మోడల్ నుంచి పూర్తిగా భిన్నంగా ఉంటుంది! ప్రస్తుత మోడల్​తో పోలిస్తే ఇది విశాలమైన ఫ్రంట్ గ్రిల్, షార్ప్​ హెడ్​ల్యాంప్​లను పొందుతుంది. అయితే వెనుక ప్రొఫైల్ లెక్సస్ డిజైన్ ప్రభావంతో వస్తుంది.

సెడాన్ వెలుపలి భాగం చాలా భిన్నంగా కనిపించినప్పటికీ, క్యాబిన్ కూడా కొత్త డిజైన్​తో వస్తుంది. క్యాబిన్ ప్రామాణిక టయోటా ధర, సుపరిచితమైన డ్యూయెల్-డిజిటల్ డిస్​ప్లేలు, టయోటా స్టీరింగ్ వీల్ అలాగే సెంటర్ కన్సోల్ లేఅవుట్. వ్యక్తిగత క్లైమేట్ జోన్లు, సీట్ బ్యాక్ స్క్రీన్లు, యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్టులు, కర్టెన్లు, జేబీఎల్ సౌండ్ సిస్టం, కారు భారీ వీల్​బేస్​ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

హైబ్రిడ్ ఇంజిన్​..

కొత్త టయోటా కామ్రీ సెడాన్​ పూర్తి హైబ్రిడ్ మోడల్. ఇది 222 బీహెచ్​పీ పవఱ్​ని జనరేట్​ చేసే 2.5-లీటర్ 4 సిలిండర్​ ఇంజిన్​తో పనిచేస్తుంది. ముందు చక్రాలకు శక్తినిచ్చే ఇసీవీటీతో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఏడబ్ల్యూడీ వెర్షన్ కూడా ఉంది! కానీ భారతదేశం ఎల్లప్పుడూ ఎఫ్​డబ్ల్యూడీ వెర్షన్​ని కలిగి ఉంది. ఈ కొత్త తరానికి అది మారుతుందని అంచనాలు లేవు. ప్రస్తుత కారు లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని కలిగి ఉంది. ఇది మరింత ఎక్కువగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

కామ్రీ ధర ఎంత?

టయోటా కామ్రీకి రెండు సెడాన్ ప్రత్యర్థులు ఉన్నాయి. మొదటిది వచ్చే ఏడాది లాంచ్ కానున్న కొత్త స్కోడా సూపర్బ్. రెండోది ఈవీ అయిన బీవైడీ సీల్. వోక్స్​వ్యాగన్ టిగువాన్, కొత్త స్కోడా కొడియాక్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్, హ్యుందాయ్ టక్సన్, హ్యుందాయ్ అయోనిక్ 5 ఈవీ ఎస్​యూవీలు ప్రత్యర్థులు.

టయోటా కామ్రీ లాంచ్​ ఈవెంట్​, ఇతర ఫీచర్స్​, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. లాంచ్​ టైమ్​కి ఒక క్లారిటీ వస్తుందని అంచనాలు ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం