SSC recruitment: సీబీఎన్, సీబీఐసీ ల్లో హవల్దార్, ఎంటీఎస్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
సీబీఎన్ (CBN), సీబీఐసీ (CBIC) ల్లో హవల్దార్, ఎంటీఎస్ పోస్ట్ ల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ssc.nic.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (CBN) ల్లో మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్ట్ లను, హవల్దార్ పోస్ట్ లను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ssc.nic.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జులై 21. జులై 26 నుంచి జులై 28 వరకు అభ్యర్థులు తమ అప్లకేషన్ ఫామ్స్ ను ఎడిట్ చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష సెప్టెంబర్ నెలలో జరుగుతుంది.
వేకెన్సీ వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా 1198 నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్ట్ లను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (CBN) ల్లో 360 హవల్దార్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. సీబీఎన్ లో ఎంటీఎస్ పోస్ట్ లకు 18 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారు, సీబీఐసీ లో హవల్దార్ పోస్ట్ లకు 18 నుంచి 27 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు దారులు రూ. 100 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
How to apply: అప్లై చేయడం ఎలా?
- ముందుగా ssc.nic.in. వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- లాగిన్ లింక్ ను క్లిక్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.