1996 calendars for 2024: 1996 కేలండర్స్ కు 2024 లో ఫుల్ డిమాండ్; ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్
1996 calendars for 2024: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. 2023 నుంచి 2024 లోకి అడుగుపెట్టాం. సాధారణంగా, 2024 సంవత్సరానికి సంబంధించిన కొత్త కేలండర్ ను ఓపెన్ చేస్తాం. కానీ, చాలామంది 2024 కేలండర్ కు బదులుగా 1996 కేలండర్ ను వాడుతున్నారు.
1996 calendars for 2024: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. కొత్త సంవత్సరం సందర్భంగా 2024 కేలండర్ ను కాకుండా, ఎప్పుడో దాదాపు 3 దశాబ్దాల క్రితం నాటి 1996 కేలండర్ ను కొత్తగా తీసి గోడలకు తగిలిస్తున్నారు. ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
1996, 2024..సేమ్ డేట్స్..
1996, 2024 సంవత్సరాల కేలండర్స్ ఒకే విధంగా ఉంటాయి. ఈ రెండు సంవత్సరాల్లో జనవరి 1వ తేదీ సోమవారం ప్రారంభమవుతోంది. అంతేకాదు, ఈ రెండు సంవత్సరాలు కూడా లీప్ ఈయర్స్. దాంతో, యాజిటీజ్ గా 2024 లో 1996 కేలండర్ ను వాడుకోవచ్చు. దాంతో, చాలామంది జాగ్రత్తగా దాచి పెట్టుకున్న పాత 1996 కేలండర్స్ ను దుమ్ము దులిపి, గోడలకు తగిలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్ గా మారింది.
స్టార్ వార్స్, బార్బీ థీమ్స్..
ఇలాంటి ఒక టిక్ టాక్ వీడియోను 15 లక్షల మంది చూశారు. దాంతో, అనేక ఈ కామర్స్ సంస్థలు 1996 లో వివిధ కవర్ ఫొటోలతో ప్రింట్ అయిన కేలండర్స్ ను మళ్లీ అమ్మకానికి పెడ్తున్నాయి. ముఖ్యంగా, నాటి స్టార్ వార్స్, బార్బీ థీమ్స్ తో ఉన్న కేలండర్స్ ను, పమేలా అండర్సన్ ఫొటోతో ఉన్న కేలండర్స్ ను ఈ సెకండ్ హ్యాండ్ సైట్స్ లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర 50 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు ఉంటోంది. 1996 లో చైల్డ్ స్టార్ గా ఉన్న జోనాథన్ టేలర్ థామస్ (Jonathan Taylor Thomas) కవర్ ఫొటోతో ఉన్న కేలండర్ కు మంచి డిమాండ్ ఉంది. జోనాథన్ టేలర్ థామస్ వయస్సు ఇప్పుడు 42 ఏళ్లు.
ఒలింపిక్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా..
1996, 2024 ను తేదీల పరంగానే కాకుండా చాలా పోలికలు ఉన్నాయి. ఇవి రెండూ లీప్ ఈయర్స్. 1996 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. 2024 లోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇవి రెండూ ఒకే తేదీన, నవంబర్ 5న, జరగనుండడం మరో విశేషం. అలాగే, 1996 లో ఒలింపిక్స్ క్రీడల పోటీలు జరిగాయి. 2024 లో కూడా ఒలింపిక్స్ జరగనున్నాయి.