IPL 2024 sixes : మ్యాచ్‌కు 18 సిక్స్‌లు.. బ్యాటర్ల బాదుడుకు రికార్డులు బ్రేక్!
IPL 2024 sixes record : ఐపీఎల్ 2024లో సిక్సర్ల విషయంలో రికార్డుల మోత మోగిపోతోంది! ఐపీఎల్ చరిత్రలో.. కనీవినీ ఎరుగని రీతిలో బ్యాటర్లు దంచికోడుతుండటంతో.. చాలా రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఆ వివరాలు..
Sixes in IPL 2024 : ఐపీఎల్ 2024లో కనిపిస్తున్న పరుగుల ప్రవాహానికి.. రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. బ్యాటర్లు రోజుకో కొత్త మైలురాయిని సృష్టిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టి, అటు ఫ్యాన్స్‌ని అలరించడంతో పాటు, పాత రికార్డులను చెరిపేస్తున్నారు. ఇక 1000 సిక్సర్ల మార్కు అందడానికి ఈ సీజన్లో కేవలం 57 మ్యాచ్‌లే పట్టింది! ఇది కూడా ఒక రికార్డే. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాము..
సిక్సర్ల మోత- రికార్డుల వేట..
ఐపీఎల్ 2018లో మొత్తం 872 సిక్స్‌లు నమోదయ్యాయి. రెండు కొత్త టీమ్స్ యాడ్ అవ్వడంతో.. ఐపీఎల్ 2022లో మ్యాచ్‌ల సంఖ్య 74కి పెరిగింది. అదే రేంజ్లో.. నాటి సీజన్లో 1062 సిక్స్‌లు నమోదయ్యాయి. ఇక ఆ రికార్డ్‌ని ఐపీఎల్ 2023లో చెరిపేశారు. గత సీజన్లో 1124 సిక్సర్లు నమోదయ్యాయి. ఐపీఎల్ 2024ని చూస్తుంటే.. ఈ రికార్డు కూడా బ్రేక్ అయ్యేడట్టే ఉంది!
పైగా.. 1000 సిక్స్‌ల మార్క్‌ని దాటడనికి ఈ సీజన్లో చాలా తక్కువ సమయం పట్టింది. 2022లో 1000 సిక్సర్ల మార్క్ 70వ మ్యాచ్‌లో నమోదైంది. 2023లో అది 67గా ఉంది. ఇక ఈ సీజన్లో అది 57 మ్యాచ్‌లకు చేరడం విశేషం.
ఇక ఐపీఎల్ 2022లో.. 1000 సిక్స్‌ల మార్క్‌ను అందుకునేందుకు 16,269 బాల్స్ ఆడాల్సి వచ్చింది. 2023లో అది 15,391గా ఉంది. ఐపీఎల్ 2024లో అయితే.. కేవలం 13,079 బాల్స్‌కే రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
IPL 2024 stats in Telugu : ఐపీఎల్ 2024లో ఇంకా 15కుపైగా మ్యాచ్‌లు ఉన్నాయి. అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా చాలా దగ్గరగానే ఉంది. అందుకే.. ఈసారి ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అందరు భావిస్తున్నారు. అంతెందుకు.. అసలు ఈ వారం చివరికే ఈ కొత్త రికార్డు నమోదవుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు.
ఐపీఎల్ 2024 మొదటి 57 మ్యాచ్‌లలో 1015 సిక్సర్లు బాదేశారు బ్యాటరలు. ఒక్క మ్యాచ్‌కి సిక్సర్ల సగటు 17.81గా ఉంది. ఏ ఐపీఎల్లో అయినా ఇదే బెస్ట్! సగటున ప్రతి 13.01 బాల్కి ఒక సిక్స్ పడుతోంది! 2023లో అది 15.34గా ఉండేది.
ఈ సీజన్లో స్కోరింగ్ రేట్ ఎక్కువ ఉండటానికి కూడా ఈ సిక్సర్ల మోతే కారణం. 57 మ్యాచ్‌ల తర్వాత.. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 15.125గా ఉంది. ఏ సీజన్లోనైనా ఇదే అత్యధికం. దీని కన్నా ముందు రికార్డు.. 141.71 (ఐపీఎల్2023)గా ఉండేది. 2024తో పోల్చుకుంటే.. 100 బాల్స్‌కి దాదాపు 10 పరుగులు తక్కువ!
IPL 2024 updates : ఇక ఈ ఐపీఎల్ 2024లో బ్యాటర్లు సాధించిన మొత్తం రన్స్‌లో సిక్సర్ల వాటా 30.48శాతం. ఏ ఐపీఎల్‌లోనైనా ఇదే అత్యధికం! 2022లో అది 27.64శాతంగా ఉండేది.
2018లో అఫ్ఘానిస్థాన్ ప్రీమియర్ లీగ్, 2019లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో.. ఒకే మ్యాచ్‌లో 37 సిక్సర్లు బాదారు. ఇది రికార్డ్. కానీ దీనిని ఈ ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ బ్రేక్ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 38 సిక్సర్లు బాదేశారు.
సంబంధిత కథనం