తెలుగు న్యూస్ / ఫోటో /
Sai Sudarshan Record: సచిన్ ఐపీఎల్ రికార్డు బ్రేక్ చేసిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్
- Sai Sudarshan Record: గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ చేయడం ద్వారా అతడు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
- Sai Sudarshan Record: గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీ చేయడం ద్వారా అతడు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
(1 / 5)
Sai Sudarshan Record: గుజరాత్ టైటన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో తొలి సెంచరీ చేశాడు. అతడు కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 రన్స్ చేయడం విశేషం. ఈ సెంచరీ ద్వారా ఇన్నాళ్లూ సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు.
(2 / 5)
Sai Sudarshan Record: చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. 25 ఇన్నింగ్స్ లోనే అతడు 1034 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇన్నింగ్స్ పరంగా చూస్తే ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా సుదర్శన్ నిలిచాడు.
(3 / 5)
Sai Sudarshan Record: గతంలో సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ 31 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేశారు. అయితే సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. తిలక్ వర్మ 34 ఇన్నింగ్స్ లో 1000 రన్స్ అందుకొని మూడో స్థానంలో ఉన్నాడు.
(4 / 5)
Sai Sudarshan Record: ఇక మొత్తం ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 రన్స్ చేసిన వాళ్లలో సాయి సుదర్శన్ మూడో స్థానంలో ఉన్నాడు. లెండిల్ సిమన్స్ 23 ఇన్నింగ్స్ లో, షాన్ మార్ష్ 21 ఇన్నింగ్స్ లో 1000 రన్స్ చేశారు. హేడెన్, సుదర్శన్ ఇద్దరూ 25 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిని అందుకున్నారు.
ఇతర గ్యాలరీలు