Sai Sudharsan IPL 2024 : సాయి సుదర్శన్ విధ్వంసంతో సచిన్ టెండుల్కర్ రికార్డ్ బ్రేక్!
చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్.. సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అదేంటంటే..
GT vs CSK IPL 2024 : ఐపీఎల్ 2024లో మరో అద్భుతం! చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన విధ్వంస బ్యాటింగ్‌తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన గుజరాట్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్.. ఐపీఎల్ కెరీర్లో తొలి శతకం బాదాడు. అంతేకాదు.. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బ్రేక్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
ధనాధన్ సుదర్శన్..
గుజరాత్ తరఫున ఈ ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ సాయి సుదర్శన్. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో ఓపెనింగ్‌కి వచ్చిన అతను.. మొదటి 7 బంతుల్లో 4 డాట్స్ చేశాడు. కానీ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే 6 కొట్టడంతో అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతే! అక్కడి నుంచి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి.. కేవలం 50 బంతుల్లో సెంచరీ చేశాడు.
ఐపీఎల్ 2024లో జరిగిన ఈ మ్యాచ్‌లోనే సచిన్ టెండుల్కర్ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు సాయి సుదర్శన్. కేవలం 25 మ్యాచ్‌ల్లో 1000 పరుగులు దాటేశాడు సుదర్శన్. సచిన్ టెండుల్కర్‌కు అందుకోసం 33 మ్యాచ్‌లు పట్టింది! ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 100 పరుగుల మార్క్‌ని దాటేందుకు 33 మ్యాచ్‌లు తీసుకున్నాడు.
Sai Sudharsan IPL 2024 : అయితే.. ఈ లిస్ట్‌లో సాయి సుదర్శన్ నాలుగో స్థానంలో ఉన్నాడు! ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ లిస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ షాన్ మార్ష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 21 ఇన్నింగ్స్‌లలో అతను 1000 పరుగుల మర్క్ని దాటేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో.. వెస్టిండీస్ ఓపెనర్ లెండీ సిమన్స్ (23), మాథ్యూ హేడెన్ (25)లు ఉన్నారు. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాడ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (26)ని సాయి సుదర్శన్.. ఈ ఐపీఎల్ 2024లో వెనక్కి నెట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కి ముందు.. 1000 పరుగుల మార్క్‌కి 69 రన్స్ దూరంలో నిలిచాడు సుదర్శన్. సీజన్లో తొలిసారిగా ఓపెనింగ్‌కి వచ్చి.. దుమ్మురేపాడు. 32 బల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సెంచరీ బాది.. సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
అంతేకాదు.. ఈ ఐపీఎల్ 2024లో 500 రన్స్ మార్క్‌ని దాటిన నాలుగో ప్లేయర్ సాయి సుదర్శన్. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, గైక్వాడ్, ట్రావిస్ హెడ్లు.. ఇప్పటికే 500 రన్స్ దాటేశారు. ఇక 12 మ్యాచ్‌ల్లో 527 రన్స్‌తో నెంబర్.4లో నిలిచాడు సాయి సుదర్శన్.
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్..
Sai Sudharsan IPL 2024 runs : ఇక శుక్రవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ విషయానికొస్తే.. గిల్- సుదర్శన్ 210 పరుగుల భాగస్వామ్యంతో.. గుజరాత్ జట్టు 231 రన్స్ చేసింది. కానీ.. ఛేజింగ్‌లో సీఎస్కే చతికిలపడింది. ధోనీ పోరాటం వృథా అయ్యింది. చివరికి.. 196 రన్స్ చేసి ఓటమి పాలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ దుమ్మురేపింది. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో ఆ జట్టు ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లను వెనకేసుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. సీఎస్కే జట్టు 4వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌కి.. 12 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్స్ వచ్చాయి.
సంబంధిత కథనం