Stree 2 Box Office Collection: యానిమల్ రికార్డు కూడా బ్రేక్ చేసిన హారర్ కామెడీ మూవీ.. నెక్ట్స్ టార్గెట్ జవాన్
Stree 2 Box Office Collection: హారర్ కామెడీ మూవీ స్త్రీ2 ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లలో యానిమల్ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రికార్డుపై కన్నేసింది.
Stree 2 Box Office Collection: స్త్రీ2 మూవీ మరో రికార్డును సొంతం చేసుకుంది. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, అపర్ శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్త్రీ 2 ఇప్పుడు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ మూవీగా నిలిచింది. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం, థియేటర్లలో ఐదో సోమవారానికి ఈ సినిమా ఇండియా కలెక్షన్లు రూ.583.35 కోట్లకు చేరుకున్నాయి.
స్త్రీ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు
స్త్రీ 2 మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజైంది. ఐదు వారాలు గడిచినా ఈ హారర్ కామెడీ మూవీ జోరు తగ్గలేదు. ఈ సినిమా ఇండియాలోనే రూ.600 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ మూవీగా నిలవడానికి దగ్గరలో ఉందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. గతంలో జవాన్ మూవీ ఈ మార్క్ దాటినా.. అది పాన్ ఇండియా సినిమా.
గత శుక్రవారం (సెప్టెంబర్ 13) స్త్రీ2 మూవీ రూ.3.60 కోట్లు, శనివారం రూ.5.55 కోట్లు, ఆదివారం రూ.6.85 కోట్లు, సోమవారం రూ.3.17 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఇప్పటి వరకూ ఇండియాలో రూ.583.35 కోట్ల బిజినెస్ చేసిందని తరణ్ వెల్లడించాడు.
యానిమల్ రికార్డు బ్రేక్
2023లో షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. Sacnilk.com రిపోర్టు ప్రకారం ఈ యాక్షన్ సినిమా లైఫ్‌టైమ్ ఇండియా కలెక్షన్లు రూ.640.25 కోట్లుగా ఉంది.
రణబీర్ కపూర్ నటించిన యానిమల్ ఇండియా కలెక్షన్లను 'స్త్రీ 2' ఇప్పుడు అధిగమించింది. Sacnilk.com ప్రకారం, సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ.. ఇండియాలో మొత్తం రూ.553.87 కోట్లు వసూలు చేసింది. రణబీర్ తో పాటు రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రీ కీలక పాత్రలు పోషించారు.
స్త్రీ 2 ఓటీటీ రిలీజ్ డేట్
ఇక ఇప్పుడు వచ్చిన స్త్రీ2 మూవీ.. 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్. అయితే ఇది తొలి భాగం కంటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సీక్వెల్లో కొత్తగా సర్కటా అనే దెయ్యాన్ని చూపించారు. నవ్విస్తూనే భయపెడుతున్న ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు.
ఇక థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్నా.. స్త్రీ2 మూవీ త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుందని భావిస్తున్నారు. అయితే ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలో మూవీ వచ్చే అవకాశం ఉంది.