VJ Sunny Comments on Bigg Boss: బిగ్‌బాస్‌పై వీజే సన్నీ షాకింగ్ కామెంట్లు.. విన్నర్ అని చెప్పుకోవడం మానేశానని స్పష్టం!
Vj Sunny About Bigg Boss: బిగ్‌బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ ఆ షో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను ఆ షో విన్నర్ అని చెప్పుకోవడం మానేశానని స్పష్టం చేశాడు. చాలా మంది ఈ షో ఏంటని ప్రశ్నిస్తున్నారని తెలిపాడు.
VJ Sunny Shocking Comments on Bigg Boss Show: బిగ్‌బాస్ షో పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోని చాలా భాషల్లో ఇప్పటికే ఈ షో ప్రారంభమై మంచి విజయవంతమైంది. తెలుగులో అయితే ఇప్పటి వరకు బుల్లితెరపై ఐదు సీజన్లు, ఓటీటీ వేదికగా ఓ సీజన్ ప్రసారమయ్యాయి. ఇందులో గెలిచిన వారికి రెమ్యూనరేషన్‌తో పాటు ప్రైజ్ మనీ కూడా ఉంది. వీటన్నంటికి కంటే ఫుల్ పాపులారిటీ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు తెలుగులో బిగ్‌బాస్ విన్నర్లుగా నిలిచిన వారికి ఒక్కరి కెరీర్ కూడా ఉన్నత స్థాయికి చేరలేదు. తాజాగా ఈ విషయంపై బిగ్‌బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అతడి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
"బిగ్‌బాస్ షో వల్ల ఏం మారలేదు. నేను బిగ్‌బాస్ షో విన్నర్ అని చెప్పినప్పుడు.. చాలా మంది ఆ షో అర్థమేంటని తిరిగి ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ షో వల్ల నాకు ఫేమ్, పాపులారిటీ వచ్చిన మాట వాస్తవమే. కానీ చాలా మందికి నేను తెలియదు. షో వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్నారు. అంతెందుకు ఓ ఫేమస్ డైరెక్టర్ కూడా బిగ్‌బాస్ షో అంటే ఏంటి? అని ప్రశ్నించాడు. దీంతో నేను బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పడం మానేసి కెరీర్‌పై ఫొకస్ పెట్టాను. ప్రస్తుతం సీరియల్స్, మూవీస్‌లో నటిస్తున్నాను." అని వీజే సన్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బిగ్‌బాస్ షో వల్ల చాలా మంది కెరీర్ ఊపందుకున్నదనే విషయం వాస్తవం. అంతేకాకుండా చాలా మంది ప్రముఖులు ఆర్థికంగా స్థిరపడ్డారు. కొంతమేరు నెగిటివిటీ వచ్చినప్పటికీ షో వల్ల ప్రయోజనం అందుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.
తాజాగా సన్నీ చేసిన కామెంట్లపై నెటిజిన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అతడి వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 6 నడుస్తున్న తరుణంలో ఈ సీజన్ విజేత ఎవరు అనే దానిపై చర్చ కొనసాగిస్తున్నారు.
సంబంధిత కథనం