Bigg Boss 6 Telugu: తన తండ్రి మరణం గురించి షాకింగ్‌ విషయాలు చెప్పిన సింగర్‌ రేవంత్‌-bigg boss 6 telugu season starts as singer revant reveals about his fathers death ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu: తన తండ్రి మరణం గురించి షాకింగ్‌ విషయాలు చెప్పిన సింగర్‌ రేవంత్‌

Bigg Boss 6 Telugu: తన తండ్రి మరణం గురించి షాకింగ్‌ విషయాలు చెప్పిన సింగర్‌ రేవంత్‌

HT Telugu Desk HT Telugu
Sep 06, 2022 04:15 PM IST

Bigg Boss 6 Telugu: తన తండ్రి మరణం గురించి షాకింగ్‌ విషయాలు చెప్పాడు సింగర్‌ రేవంత్‌. బిగ్‌ బాస్‌ సీజన్‌ 6లో పార్టిసిపేట్‌ చేస్తున్న అతడు.. హౌజ్‌మేట్స్‌తో చెప్పిన ఈ విషయం షాక్‌కు గురి చేసింది.

<p>బిగ్ బాస్ హౌజ్ లో సింగర్ రేవంత్</p>
బిగ్ బాస్ హౌజ్ లో సింగర్ రేవంత్

Bigg Boss 6 Telugu: బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 ప్రారంభమైన విషయం తెలుసు కదా. ఈ రియాల్టీ షో అంటే వివాదాలు, విమర్శలు. ఇందులో పాల్గొనే వాళ్లు హౌజ్‌లో టీమ్‌ మేట్స్‌తో వ్యవహరించే తీరు, వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి చెప్పే కొన్ని విషయాలు షాక్‌కు గురి చేస్తాయి. తాజాగా బిగ్‌ బాస్‌ 6 రెండో రోజే సింగర్‌ రేవంత్‌ అలాంటి విషయం ఒకటి చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఈసారి బిగ్‌ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్‌ను మూడు గ్రూపులుగా విడదీసిన విషయం తెలుసు కదా. క్లాస్‌, ట్రాష్‌, మాస్‌ అంటూ మూడుగా విడదీశారు. వీళ్లలో క్లాస్‌ కంటెస్టెంట్లు తొలి వారం రోజులు వీఐపీ బాల్కనీని ఎంజాయ్‌ చేయడం, హాయిగా ఎంజాయ్‌ చేయడం చేస్తారు. ఇక ట్రాష్‌లో ఉన్న వాళ్లు క్లాస్‌లో ఉన్న వాళ్లకు సేవలు చేస్తుంటారు. వీళ్లు గార్డెన్‌ ఏరియాలోనే ఉంటారు. అక్కడే వంట, తినడం, పడుకోవడం. వీళ్లను తొలి వారం నేరుగా ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయొచ్చు.

ఈ ట్రాష్‌ కేటగిరీలోనే సింగర్‌ రేవంత్‌ ఉన్నాడు. అతనితోపాటు గీతూ, ఇనాయా కూడా ఇందులోనే ఉన్నారు. వీళ్లతో రేవంత్‌ మాట్లాడుతూ.. తన తండ్రి మరణం గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. తాను ఆరో తరగతి పూర్తి చేసే వరకూ తన తండ్రి చనిపోయిన విషయం తనకు తెలియదని రేవంత్ చెప్పడం గమనార్హం. అప్పటి వరకూ తాను తన తండ్రి యూఎస్‌లో ఉండేవాడని అనుకున్నట్లు చెప్పాడు.

తన తల్లి ఎప్పుడూ అదే చెప్పేదని, తాను బాగా చదువుకుంటే ఆయన అమెరికా నుంచి వచ్చేస్తాడని ఆమె అనేదని రేవంత్ గుర్తు చేసుకున్నాడు. ఈ విషయం కంటెస్టెంట్లతోపాటు ప్రేక్షకులను కూడా షాక్‌కు గురి చేసింది. అంతేకాదు తాను ఎప్పుడూ అమెరికాకు వెళ్లాలని అనుకునే వాడినని, అలా అయితే తన తండ్రిని చూసే అవకాశం వచ్చేదని తాను అనుకున్నట్లు రేవంత్‌ చెప్పాడు.

Whats_app_banner