Singer Smitha on Bigg Boss: బిగ్ బాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ స్మిత
Singer Smitha on Bigg Boss: బిగ్ బాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది సింగర్ స్మిత. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 6 షో నడుస్తున్న సమయంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Singer Smitha on Bigg Boss: బిగ్ బాస్ షో చాలా పాపులర్. మొదట హిందీలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తర్వాత తెలుగు, తమిళం, కన్నడల్లోకి వచ్చింది. ఓ సీజన్ ముగియగానే మరో సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎన్నో రోజుల ముందు నుంచే ఈ షోలో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్లు ఎవరు? ఈసారి షో ఎలా ఉండబోతోంది అన్న చర్చ మొదలవుతుంది.
ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభానికి ముందు కూడా ఇలాంటి చర్చే జరిగింది. ఈ సందర్భంగా ఈ షోలోకి సింగర్ స్మిత రాబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అలాంటి స్మిత ఇప్పుడీ షోపై సంచలన కామెంట్స్ చేసింది. తాను చచ్చినా ఈ షోకు వెళ్లనని, ఇది తనకు అసలు నచ్చదని ఆమె అనడం విశేషం. ఈ షోకు వెళ్తే డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుందని చాలా మంది భావిస్తారు.
కానీ స్మిత వెర్షన్ మాత్రం మరోలా ఉంది. తాను ఈ షోకు వెళ్లనని, తన సన్నిహితులు ఎవరైనా వెళ్తా అన్నా కూడా తాను వద్దని చెబుతానని స్మిత అంటోంది. ఈ షో తనకు అస్సలు నచ్చదని కూడా స్పష్టం చేసింది. ఈ షో కోసం కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఓ ఇంట్లో అందరినీ ఉంచి, వాళ్ల మధ్య గొడవలు పెట్టడమేంటో తనకు అర్థం కాదని స్మిత అంటోంది.
ఈ బిగ్ బాస్ షోలో పాల్గొనే వాళ్లను తాను విమర్శించడం లేదని, అయితే తనకు మాత్రం ఈ షోకు వెళ్లడం ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ 6లో 20 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.