Bigg Boss 6 First Episode: ఫస్ట్ డే రేవంత్, మరీనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ - ఫైమాకు శ్రీసత్య స్వీట్ వార్నింగ్
Bigg Boss 6 First Episode: బిగ్‌బాస్ తొలిరోజు గేమ్ లో రేవంత్, మరీనా హైలైట్ గా నిలిచారు. హౌజ్ లో అడుగుపెట్టడమే ఆలస్యం అందరితో కలిసిపోయి సరదాగా కనిపించారు. తొలిరోజు ఫైమాకు శ్రీసత్య సున్నితంగా వార్నింగ్ ఇస్తూ కనిపించింది.
Bigg Boss 6 First Episode: బిగ్‌బాస్ హౌజ్‌లో తొలిరోజు కంటెస్టెంట్స్ అందరూ ఉత్సాహంగా కనిపించారు. హౌజ్‌కు అలవాటుపడటానికి ఆదిరెడ్డి, ఫైమాతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ ఇబ్బందులు పడ్డారు. కానీ రేవంత్, మరీనా మాత్రం హౌజ్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం అందరితో కలిసిపోయారు. ముఖ్యంగా రేవంత్ మాత్రం ప్రతి ఒక్కరితో కలివిడిగా కనిపించారు.
తొలిరోజు వంట బాధ్యతను రేవంత్, మరీనా తీసుకున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరూ సాయం చేయలేకపోయినా వారు మాత్రం తమ వంట పనులను ఆపలేదు. వంట పూర్తయ్యే తరుణంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరికి బిర్యానీ పంపించి సర్‌ప్రైజ్ చేశారు. కంటెస్టెంట్స్ అందరూ తమ లగేజీ, బెడ్‌లను సర్ధుకుంటూ కనిపిస్తే ఆదిరెడ్డి మాత్రం చాలా సమయం పాటు సైలెంట్‌గానే కూర్చొని కనిపించాడు. అతడిని రేవంత్ రెండు, మూడు సార్లు పలకరించాడు.
సెకండ్ డే నుంచి గేమ్ మొదలుపెడతానని, తానంటే ఏమిటో చూపిస్తానంటూ బిగ్‌బాస్ కెమెరాతో ఆదిరెడ్డి ముచ్చటించాడు. అదే విషయాన్ని రేవంత్‌తో చెప్పాడు. తిథి, ముహుర్తాలు చూసుకొని మొదలుపెడతావా అంటూ అతడిపై రేవంత్ సెటైర్స్ వేయడం నవ్వులను పూయించింది. మొదటిరోజు ఎలాంటి గొడవలు లేకుండా బిగ్‌బాస్ హౌజ్ ప్రశాంతంగా గడిచిపోయింది. శ్రీసత్యను ఫైమా అక్కా అని పిలిచింది. తనను పేరు పెట్టి పిలవాలని, అక్కా అంటూ పిలిచి పెద్దదాన్ని చేయోద్దంటూ ఫైమాను శ్రీసత్య సున్నితంగా హెచ్చరించింది.