Bigg Boss 6 Full Contestants List: బిగ్‌బాస్ సీజ‌న్ 6 ఫుల్ కంటెస్టెంట్స్ వీళ్లే-bigg boss telugu season 6 final contestants list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Full Contestants List: బిగ్‌బాస్ సీజ‌న్ 6 ఫుల్ కంటెస్టెంట్స్ వీళ్లే

Bigg Boss 6 Full Contestants List: బిగ్‌బాస్ సీజ‌న్ 6 ఫుల్ కంటెస్టెంట్స్ వీళ్లే

HT Telugu Desk HT Telugu

Bigg Boss 6 Full Contestants List: బిగ్‌బాస్ సందడి తిరిగి మొదలైంది. మొత్తం ఇరవై మంది కంటెస్టెంట్స్ ను నాగార్జున ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే...

సింగ‌ర్ రేవంత్ (twitter)

Bigg Boss 6 Full Contestants List: బుల్లితెర ప్రేక్షకుల్నిఆకట్టుకోవడానికి బిగ్‌బాస్ మరోమారు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం మొదలైంది. సీజన్ 3 నుంచి బిగ్ బాస్ షోకు హోస్ట్ గా అభిమానులను ఆకట్టుకుంటున్న నాగార్జున సీజన్ 6 కు కూడా మరోసారి ఆ బాధ్యతల్ని స్వీకరించారు. బంగార్రాజు పాటతో స్టైలిష్ గా స్టేజ్ పైకి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత నాగార్జున ఒక్కో హౌజ్‌మేట్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానిస్తూ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి మొత్తం ఇర‌వై మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. మొద‌ట‌గా హౌజ్‌లోకి కీర్తిభ‌ట్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె త‌ర్వాత సుదీప‌, శ్రీహాన్ వచ్చారు. అనంతరం చలాకీ చంటి, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ వచ్చారు. కపుల్ జోడీగా రోహిత్ మరీనా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలాదిత్య, వాసంతి, షానీ సల్మాన్, ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి వచ్చారు.

చివ‌ర‌గా సింగ‌ర్ రేవంత్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. మొత్తం వంద రోజుల పాటు బిగ్‌బాస్ సీజ‌న్ 6 కొన‌సాగుతుంద‌ని నాగార్జున చెప్పాడు. కంటెస్టెంట్స్ అందరికి ఇంట్యూషన్స్ కార్డ్స్ తో పాటు పలు టాస్క్ లు ఇచ్చాడు. ఇరవై నాలుగు గంటల పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ 6 ప్రసారం అవుతుందని చెప్పాడు.