Deeparadha with coconut oil: కొబ్బరినూనెతో దీపారాధన వలన కలిగే ఫలితములు - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ-deeparadha with coconut oil benefits and what changs take place if we do deeparadhana with coconut oil and why we should ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Deeparadha With Coconut Oil: కొబ్బరినూనెతో దీపారాధన వలన కలిగే ఫలితములు - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Deeparadha with coconut oil: కొబ్బరినూనెతో దీపారాధన వలన కలిగే ఫలితములు - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk HT Telugu
Dec 22, 2024 07:00 AM IST

Deeparadha with coconut oil: ఎవరైతే ప్రతి రోజూ క్రమం తప్పకుండా మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో, కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా పెడతారో వారింట్లో అతిత్వరలో శుభకార్యాలు జరుగుతాయట.

Deeparadha with coconut oil: కొబ్బరినూనెతో దీపారాధన వలన కలిగే ఫలితములు
Deeparadha with coconut oil: కొబ్బరినూనెతో దీపారాధన వలన కలిగే ఫలితములు (Shutterstock)

కొబ్బరినూనెతో దేవతలకు ఆరాధన చేయడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. రావిచెట్టు క్రింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య జీవితం సుఖంగానూ, సంతోషంగానూ ఉంటుందని సెలవిచ్చారు.

అంతేకాకుండా కుజదోషం ఉన్నవారు మంగళ, శుక్రవారాలలో కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి, శెనగపప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11మంది ముత్తైదువులకు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం జరుగుతుందని చిలకమర్తి తెలిపారు.

మహాలక్ష్మీదేవికి కొబ్బరినూనెతో దీపం పెట్టి మండలం పాటు అంటే 40 రోజుల పాటు ఆరాధిస్తూ అప్పుల బాకీలు త్వరగా వసూలు అవుతాయట. ఎవరైతే ప్రతి రోజూ క్రమం తప్పకుండా మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో, కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా పెడతారో వారింట్లో అతిత్వరలో శుభకార్యాలు జరుగుతాయట.

అంతేకాకుండా పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలోనూ కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్థాయని చిలకమర్తి తెలిపారు. ప్రతిశనివారం రోజున శ్రీ వెంకటేశ్వరస్వామి కోసం కొబ్బరినూనెతో దీపారాధన చేసి, తులసీ దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

దీపారాధన హిందూ సంప్రదాయంలో ఒక విశిష్టమైన ఆచారం. దీపం వెలిగించడం ద్వారా ఆత్మశుద్ధి, మనసు నెమ్మదించడం, మరియు దైవత్వానికి సంబంధించిన శ్రద్ధను పెంచుతుంది. దీపంలో వాడే నూనె తత్వానికి, శక్తికి సంబంధించిన ప్రతిఫలాలను కలిగిస్తుంది. ఇందులో కొబ్బరి నూనె ప్రాముఖ్యత చాలా ఎక్కువ.

కొబ్బరి నూనె శుభ్రత, పవిత్రతకు ప్రతీక. దీపారాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించడం వలన పలు ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి అని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

1. పవిత్రతను కలిగిస్తుంది

కొబ్బరి నూనె స్వచ్ఛమైనది, ప్రాకృతికమైనది. దీపంలో కొబ్బరి నూనెను వాడటం ద్వారా ఆవరించి ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి శుభశక్తులు ఆవహిస్తాయని నమ్మకం.

2. ఆధ్యాత్మిక శక్తి

కొబ్బరి నూనెతో వెలిగించిన దీపం సమీప ప్రదేశానికి శాంతిని, భక్తిని తీసుకువస్తుంది. దీపం వెలిగించడం వలన దైవానికి అర్పణ చేసినట్లు భావిస్తారు.

3. శక్తివంతమైన ప్రకృతి శక్తుల ఆహ్వానం

కొబ్బరి నూనెతో వెలిగించిన దీపం స్థిరంగా ఎక్కువ సమయం వెలుగుతుందని, ఇది మంచి శక్తులను ఆహ్వానిస్తుందని ధార్మికులు విశ్వసిస్తారు.

4. ఆరోగ్యప్రధం

కొబ్బరి నూనె ధూమం వలన వాతావరణం శుభ్రమవుతుంది. ఇది శ్వాసకోశానికి మేలు చేస్తుంది. అలాగే మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణంలో శుద్ధి కలుగుతుంది.

5. పాప పరిహారం

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. మన శరీరానికి సంబంధించిన తత్వాల్ని నియంత్రించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది.

కొబ్బరి నూనెతో దీపారాధన చేయాల్సిన విధానం

1. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకుని దీపం కోసం సిద్ధం చేయాలి.

2. దీపబత్తి (వత్తి) శుద్ధమైన దారంతో తయారు చేయాలి.

3. ఇంట్లో లేదా పూజా గృహంలో దక్షిణ దిశగా దీపాన్ని వెలిగించడం శుభప్రదం.

4. పూజ సమయంలో భక్తితో “ఓం దీపజ్యోతిర్నమః” వంటి మంత్రాలు చదవాలి.

దీపారాధన ఫలితాలు

1. శాంతి మరియు సంతోషం: కొబ్బరి నూనెతో వెలిగించిన దీపం మనసుకు ప్రశాంతిని అందిస్తుంది.

2. వాస్తు దోష నివారణ: పూజ గృహంలో దీపం వెలిగించడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

3. సంసార సాఫల్యం: కుటుంబంలో ఏకతా, ఆనందం నెలకొల్పడానికి కొబ్బరి నూనెతో దీపారాధన ఉపకరిస్తుంది.

4. సకల ఐశ్వర్యాలు: దీపారాధన దైవ కృపను ప్రసాదించి, ఇంట్లో ఐశ్వర్యానికి దారి తీస్తుంది అని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner

సంబంధిత కథనం