Coconut Oil Health Benefits । కొబ్బరినూనెతో కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Coconut Oil Health Benefits: కొబ్బరినూనె ఎంతో ఆరోగ్యకరమైనది, ఇతర నూనెలకు బదులుగా ప్రతిరోజూ కొబ్బరినూనె తీసుకుంటే కలిగే ప్రయోజనాలను న్యూట్రిషనిస్టులు వివరించారు. అవేంటో చూడండి.
Coconut Oil Health Benefits: కొబ్బరినూనె కేవలం జుట్టు పెరుగుదలకే కాదు, చర్మ సంరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరిని తరచుగా ఆరోగ్యానికి జీవితరేఖగా అభివర్ణిస్తారు. ఎందుకంటే కొబ్బరిని నేరుగా తినవచ్చు, కొబ్బరినీళ్లను తాగవచ్చు, కొబ్బరినూనెను వంటలకు వాడవచ్చు, అలాగే తలకు నూనెగా వాడవచ్చు. ఈ శీతాకాలంలో కొబ్బరినూనెను పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇది చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది.
ఇదే కాక, వంటలకు ఇతర నూనెలకు బదులు కొబ్బరినూనె (Edible cold pressed Coconut Oil) ఉపయోగిస్తే, అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఫంక్షనల్ న్యూట్రిషనల్ థెరపీ ప్రాక్టీషనర్ మెగ్ లాంగ్‌స్టన్ పేర్కొన్నారు.
Coconut Oil 5 Health Benefits
ప్రతిరోజూ కొబ్బరినూనె తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఐదు ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. మెగ్ లాంగ్‌స్టన్ ప్రకారం, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
1. వైద్యం కోసం ప్రయోజనకరమైనది
అసంతృప్త కొవ్వుల వలె కాకుండా, కొబ్బరి నూనె అనేది శరీరంలో వైద్యానికి సహాయపడే ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వు. కొబ్బరి నూనెలో 80% పైగా సంతృప్త కొవ్వు ఉంటుంది.
2. ఫ్యాట్ బర్నింగ్‌ను ప్రోత్సహిస్తుంది
కొబ్బరినూనె యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడం వల్ల థైరాయిడ్/జీవక్రియ పనితీరును నెమ్మదింపజేయడానికి దోహదపడుతుంది. ఇంకా యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
3. రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుంది
కొబ్బరి నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT) మంచి మోతాదులో ఉంటాయి. ఇవి గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఈ MCT లు జీర్ణాశయం నుండి నేరుగా కాలేయంలోకి వెళతాయి, వీటిని విచ్ఛిన్నం చేయడానికి వ్యవస్త్థకు శ్రమ అవసరం లేదు. అవి ఇతర రకాల కొవ్వుల వలె శరీరంలో నిల్వ అవకుండా నేరు శక్తి కోసం వినియోగం జరుగుతాయి.
4. ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతుంది
కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది మరియు శరీరం లారిక్ యాసిడ్‌ను మోనోలారిన్‌గా మారుస్తుంది, ఇది యాంటీమైక్రోబయల్ గుణాన్ని కలిగి ఉంటుంది, శరీరంలో వృద్ధి చెందే బాక్టీరియాను ఇది చంపివేస్తుంది.
5. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
కొబ్బరి నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ను ప్రెగ్నెనోలోన్, ప్రొజెస్టెరాన్‌గా మార్చుతుంది. ఈ క్రమంలో అధిక కొలెస్ట్రాల్‌ను సాధారణ స్థాయికి తగ్గిస్తుంది.
సంబంధిత కథనం