Skin & Hair Care | స్కిన్ కేర్ కోసం రకరకాల క్రీములు వేస్ట్.. కొబ్బరినూనె బెస్ట్-skin and health benefits with coconut oil ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Skin And Health Benefits With Coconut Oil

Skin & Hair Care | స్కిన్ కేర్ కోసం రకరకాల క్రీములు వేస్ట్.. కొబ్బరినూనె బెస్ట్

HT Telugu Desk HT Telugu
May 11, 2022 03:21 PM IST

మనకి బాగా తెలిసిన నూనె కొబ్బరి నూనె. ఇది తెలియని వారు ఎవరూ ఉండరు. కొందరు దీనిని వంటకు ఉపయోగిస్తారు. మరికొందరు జుట్టుకు మసాజ్​ చేయడానికి, చర్మ పోషణకు వాడతారు. అయితే స్కిన్​ కేర్​కి, హెయిర్​ కేర్​కి ప్రొడెక్ట్స్ కోసం డబ్బులు ఖర్చు చేసుకోవడం ఎందుకు? కొబ్బరి నూనెను వాడండి చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నూనె వల్ల ఉపయోగాలు
కొబ్బరి నూనె వల్ల ఉపయోగాలు

Coconut Oil Benefits | మీకో విషయం తెలుసా? కొబ్బరి నూనె చర్మానికి, ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తుందని అధ్యయనాలు కూడా ప్రూవ్ చేశాయి. ఇది చర్మ, జుట్టు పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి చర్మం వృద్ధాప్య సంకేతాలు రాకుండా పోరాడుతుంది. సమర్థవంతమైన మాయిశ్చరైజర్‌గా ఉంటుంది.

చర్మానికి తేమ, పోషణ కోసం..

కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది లిప్ బామ్‌గా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి మేకప్ పైన కొద్ది మొత్తంలో కొబ్బరి నూనెను హైలైటర్‌గా కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెతో గోర్లు మసాజ్ చేయడం వల్ల అవి పొడిగా, పెళుసుగా ఉండకుండా ఆరోగ్యంగా మారుతాయి.

క్లెన్సర్‌గా కూడా..

మేకప్ తొలగించడానికి, చర్మాన్ని సున్నితంగా శుభ్రపరచడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు.. మొటిమల బారిన పడే చర్మానికి మంచి ఎంపిక. అయితే ముఖంపై కొబ్బరి నూనెను ఉపయోగించిన తర్వాత.. రెండుసార్లు ముఖాన్ని శుభ్రపరచాలని గుర్తుంచుకోండి. ఎటువంటి అదనపు రసాయనాలు లేని సహజ కొబ్బరి నూనె సున్నితమైన చర్మానికి సురక్షితం. శిశువులకు మసాజ్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.

చుండ్రును తగ్గిస్తుంది

పొడి స్కాల్ప్ తరచుగా చుండ్రుకు దారితీస్తుంది. కాబట్టి మీరు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే దానిని నివారించవచ్చు. మీరు తలస్నానం చేయడానికి కనీసం ఒక గంట ముందు మీ తలను నూనెతో మసాజ్ చేయండి.

ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు.

కొబ్బరి నూనె స్కాల్ప్ సోరియాసిస్ లక్షణాలను తగ్గించి.. స్కాల్ప్ ఇరిటేషన్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

జుట్టుకు పోషణనిస్తుంది

కొబ్బరి నూనె మీ జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. అంతేకాకుండా కండిషన్ చేస్తుంది. పోషణ, తేమతో కూడిన జుట్టు చిట్లిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి పొడి, పెళుసు జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. మీ జుట్టుకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. బాక్టీరియా, చికాకు కలిగించే వాటి నుంచి కొబ్బరి నూనె మీ స్కాల్ప్, జుట్టును రక్షిస్తుంది. కొబ్బరినూనెను ఫ్రిజీ ఫైటింగ్ సీరమ్​ల కూడా ఉపయోగించవచ్చు. నూనెను అప్లై చేసిన తర్వాత మీ జుట్టుకు ఎలాంటి హీటింగ్ టూల్స్ ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

WhatsApp channel

టాపిక్