Coconut Oil Sugar Scrub | మీ ముఖానికి కొబ్బరినూనె రాస్తే అబ్బురపరిచే నిగారింపు!
కొబ్బరినూనెతో మెరిసే ప్రకాశవంతమైన ముఖాన్ని పొందవచ్చు. అవును మీరు విన్నది నిజమే. కొబ్బరినూనె, పంచదార కలిపి స్క్రబ్బర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
అందమైన, ఆరోగ్యకరమైన కురుల కోసం మనం కొబ్బరినూనెను తలకు రాసుకుంటాం, ఇది అందరికీ తెలిసిందే. కానీ కొబ్బరినూనె ముఖానికి కూడా రాసుకోవచ్చని తెలుసా? ఎలాంటి బ్యూటీ ప్రొడక్టులు, మేకప్ లు ఇవ్వలేని నిగారింపును కొబ్బరినూనె మీ ముఖానికి అందిస్తుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కొబ్బరి నూనెలో విటమిన్ ఎ, విటమిన్ కె ఇంక ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ-మైక్రోబయల్ ప్రాపర్టీ చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మృత కణాలను తొలగించి చర్మ సంబంధిత అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తాయి.
ఇంట్లోనే కొబ్బరి నూనె షుగర్ స్క్రబ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
2 కప్పుల ముడిలో చక్కెర
1/2 కప్పు చక్కెర
ఆప్షనల్ గా ఈ కింది మూడు పదార్థాలను కలుపుకోవచ్చు.
3 టేబుల్ స్పూన్ల విటమిన్ ఇ (ఐచ్ఛికం)
మరేదైనా ఎసెన్సిషయల్ నూనె (ఐచ్ఛికం) 4 చుక్కలు
నిమ్మరసం (ఐచ్ఛికం)
Home-Made Coconut Sugar Scrub తయారీ విధానం
- ఒక గిన్నెలో రెండు చక్కెరలను కలపండి ఇందులో కొబ్బరి నూనె, విటమిన్ ఇ వేసి కలపండి.
- దీనిని గాలి చొరబడని కూజాలో నిల్వ చేసి ఉంచుకోవాలి. అంతే, ఇదే కొకనట్ షుగర్ స్క్రబ్.
- ఉపయోగించే ముందు బాగా ఊపి అప్లై చేసుకోవాలి. షేక్ వెల్ బిఫోర్ యూజ్!
ఎలా వాడుకోవచ్చు
కొబ్బరినూనె షుగర్ స్క్రబ్ ను చర్మం, చేతులు, పాదాలకు అప్లై చేసి 5 నిమిషాల పాటు తేలికగా చేతులతో మర్ధన చేయండి.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీ చర్మం మునుపటి కంటే చాలా మృదువుగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
కొకొనట్ షుగర్ స్క్రబ్ ఉపయోగించటం వలన కలిగే ప్రయోజనాలు
- ఈ స్క్రబ్ చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పొడి చర్మం, మృతకణాలను తొలగించి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. . చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
- కొబ్బరి నూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ గుణాలు చర్మ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తాయి.
- కొబ్బరి నూనె, పంచదారతో తయారైన ఈ స్క్రబ్ మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది మీ చర్మ రంధ్రాల లోపలికి వెళ్లడం ద్వారా మేకప్ పూర్తిగా బయటకు రావడానికి సహాయపడుతుంది. అదే సమయంలో, ఇది చర్మంపై ఉన్న దుమ్ము, ధూళిని కూడా బాగా శుభ్రపరుస్తుంది.
- కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది, అలాగే చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుతుంది. తద్వారా అకాల వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు.
కొబ్బరి చక్కెర స్క్రబ్ మీ చర్మంపై ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఇది పూర్తిగా సహజమైనది . ఏ రకమైన అలెర్జీ, ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశాలు చాలా తక్కువ. రేజర్ లేదా వాక్సింగ్ ఉపయోగించిన తర్వాత కూడా, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారానికి కనీసం 3 సార్లు అప్లై చేసుకోండి.
సంబంధిత కథనం