Bigg Boss - 6 Live Updates: చివరి కంటెస్టెంట్‌గా సింగర్ రేవంత్
Bigg Boss - 6 Live Updates: బిగ్‌బాస్ సీజన్ సిక్స్ సందడి మొదలైంది. హౌజ్‌లోకి మొత్తం ఇరవై మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. హోస్ట్‌గా మరోమారు వ్యవహరిస్తున్న నాగార్జున ఒక్కో హౌజ్‌మేట్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానిస్తూ ప్రేక్షకులకు పరిచయం చేశారు. మొదటగా హౌజ్‌లోకి కీర్తిభట్ అడుగుపెట్టింది. ఆమె తర్వాత సుదీప, శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చలాకీ చంటి, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, రోహిత్ మరీనా, బాలాదిత్య, వాసంతి, షానీ సల్మాన్, ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు. చివరగా సింగర్ రేవంత్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. మొత్తం వంద రోజుల పాటు బిగ్‌బాస్ సీజన్ 6 కొనసాగుతుందని నాగార్జున చెప్పాడు.
Sun, 04 Sep 202204:15 PM IST
కంటెస్టెంట్స్ ఎంట్రీ పూర్తి...
బిగ్‌బాస్ హౌజ్‌లోకి మొత్తం ఇరవై మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. మొదటగా హౌజ్‌లోకి కీర్తిభట్ అడుగుపెట్టింది. ఆమె తర్వాత సుదీప, శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చలాకీ చంటి, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, రోహిత్ మరీనా, బాలాదిత్య, వాసంతి, షానీ సల్మాన్, ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి ఒక్కొక్కరుగా అడుగుపెట్టారు. చివరగా సింగర్ రేవంత్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చాడు.
Sun, 04 Sep 202204:07 PM IST
బిగ్‌బాస్ సీజన్ 6 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే...
బిగ్‌బాస్ హౌజ్‌లోకి మొత్తం ఇరవై మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. కీర్తి భట్, సుదీప, శ్రీహాన్, నేహా, చలాకీ చంటి, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, రోహిత్ మరీనా, బాలాదిత్య, వాసంతి, షానీ సల్మాన్, ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి, రేవంత్ మొత్తం ఇరవై మంది నాగార్జున ప్రేక్షకులకు పరిచయం చేశారు. బిగ్‌బాస్ హౌజ్‌కు లాక్ చేసిన నాగార్జున గేమ్ మొదలైనట్లు ప్రకటించాడు.
Sun, 04 Sep 202204:00 PM IST
బిగ్‌బాస్‌లోకి చివరి కంటెస్టెంట్‌గా రేవంత్ వచ్చాడు
బిగ్‌బాస్ సీజన్ 6 చివరి కంటెస్టెంట్ గా స్టేజ్‌పైకి వచ్చిన రేవంత్ తాను వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తానని హమీ ఇచ్చాడు. తాను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, షార్ట్ టెంపర్ పర్సన్‌ను అని రేవంత్ చెప్పాడు. నువ్వు మంచి పాటగాడివే కాకుండా ప్లేబాయ్ అని విన్నానని అతడితో నాగార్జున అన్నాడు. నాలుగు కళ్లు చూపించి బాగా తెలిసిన కళ్లను గుర్తుపట్టాలని టాస్క్ ఇచ్చాడు. అందులో నుంచి ఒక కళ్లను సెలెక్ట్ చేసుకున్న రేవంత్ తన భార్య కన్నులని చెప్పాడు. రేవంత్‌ను సర్‌ప్రైజ్ చేసిన నాగార్జున...అతడి భార్య అన్వితను స్టేజ్‌పైకి పిలిచాడు.
Sun, 04 Sep 202203:51 PM IST
బిగ్‌బాస్ లోకి పంతొమ్మిదవ కంటెస్టెంట్‌గా ఆరోహి
బిగ్‌బాస్‌లోకి 19వ కంటెస్టెంట్‌గా ఆరోహి అడుగుపెట్టింది. తన అసలు పేరు అంజలి అని చెప్పింది. హైదరాబాద్‌లో బతకడానికి ఆరోహిగా తన పేరు మార్చుకున్నట్లు తెలిపింది. తానంటే ఏమిటో బిగ్‌బాస్‌తో నిరూపిస్తానని చెప్పింది.
Sun, 04 Sep 202203:45 PM IST
బిగ్‌బాస్‌లోకి ఆదిరెడ్డి, రాజశేఖర్ ఎంట్రీ.
బిగ్‌బాస్‌లోకి కామన్ మ్యాన్‌గా ఆదిరెడ్డి ఎంట్రీ ఇచ్చాడు.అతడితో పాటుగా రాజశేఖర్ వచ్చాడు.
Sun, 04 Sep 202203:28 PM IST
బిగ్‌బాస్‌లోకి జబర్ధస్త్ ఫైమా
బిగ్‌బాస్ హౌజ్‌లోకి 16వ కంటెస్టెంట్‌గా జబర్ధస్త్ ఫైమా అడుగుపెట్టింది. నాగార్జునను చూడగానే ఆమె ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకున్నది. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో తగ్గేదేలే అంటూ ఫైమా పేర్కొన్నది. బిగ్‌బాస్ షోలో ఛాన్స్ రావడమే హ్యాపీగా ఉందని తెలిపింది. తన జీవితంలో స్పెషల్ పర్సన్ ప్రవీణ్ అని ఫైమా చెప్పింది.
Sun, 04 Sep 202203:18 PM IST
బిగ్‌బాస్‌లోకి ఆర్జే సూర్య
15వ కంటెస్టెంట్‌గా ఆర్జే సూర్య బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. మిమిక్రీ వాయిస్‌తో ఆర్జే సూర్య చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నది. మిమిక్రీలో తాను గోల్డ్ మెడలిస్ట్ అని సూర్య చెప్పాడు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రకాష్‌రాజ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వాయిస్‌ను ఇమిటేట్ చేసి నాగార్జునను మెప్పించాడు సూర్య.
Sun, 04 Sep 202203:08 PM IST
14వ కంటెస్టెంట్‌గా ఇనాయా సుల్తానా
పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాటతో బిగ్‌బాస్ స్టేజ్‌పైకి అడుగుపెట్టింది ఇనాయా సుల్తానా. ఓ వీడియో తో తాను చాలు పాపులర్ అయినట్లు తెలిసింది. ఆ వీడియో విషయంలో తాను ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వచ్చినట్లు ఇనియా తెలిపింది. వాటిని పాజిటివ్‌గానే తీసుకొని ఈ స్థాయికి వచ్చినట్లు తెలిసింది. తండ్రి కలను నెరవేర్చడమే తన లక్ష్యమని చెప్పింది. ఈ రోజు మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారంటూ నాగార్జుకు కాంప్లిమెంట్ ఇచ్చింది ఇనాయా.
Sun, 04 Sep 202202:59 PM IST
బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన షానీ సాల్మన్
బిగ్‌బాస్ హౌస్‌లోకి షానీ సాల్మన్ పదమూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్స్‌లోని తొలి అక్షరాలను తీసుకొని షానీగా పేరుపెట్టుకున్నట్లుగా అతడు చెప్పాడు. సై సినిమాలో అవకాశం వచ్చిన రోజే తన తల్లి చనిపోయిందని జీవితంలో జరిగిన విషాదాన్ని షానీ ...నాగార్జునతో పంచుకున్నాడు. అతడికి మూడు టాస్క్ లు ఇచ్చాడు నాగార్జున.
Sun, 04 Sep 202202:50 PM IST
బిగ్‌బాస్ హౌజ్‌లోకి అల్లరి పిల్ల వాసంతి
బిగ్‌బాస్ హౌజ్‌లోకి అల్లరి పిల్లగా వాసంతి అడుగుపెట్టింది. ప్రజెంట్ తాను సింగిల్ అంటూ పేర్కొన్నది. వాసంతి కృష్ణన్ అనే పేరు చూసి అందరూ మ్యారీడ్ అనుకుంటున్నట్లు పేర్కొన్నది. ఆమెకు కిస్, పంచ్, హగ్ అంటూ మూడు బ్యాడ్జెస్ ఇచ్చాడు నాగార్జున. అవి హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌కు ఇవ్వాలని కండీషన్ పెట్టాడు.
Sun, 04 Sep 202202:42 PM IST
బాలాదిత్య వచ్చేశాడు
బిగ్ బాస్ హౌజ్ లోకి 11వ కంటెస్టెంట్ గా బాలాదిత్య ఎంట్రీ ఇచ్చాడు. అతడి ఏవీని స్టైలిష్ గా తీర్చిదిద్దారు. చిన్నతనంలో నాగార్జునతో కలిసి హలో బ్రదర్, వారసుడు సినిమాలు చేశానని గుర్తుచేశాడు బాలాదిత్య. అన్న సినిమాకు తొలిసారి నంది అవార్డు అందుకున్న సందర్భం తన కెరీర్ లో బెస్ట్ మూవ్ మెంట్ అని బాలాదిత్య తెలిపాడు.
Sun, 04 Sep 202202:35 PM IST
పదో కంటెస్టెంట్స్‌గా బ్యూటీఫుల్ కఫుల్ రోహిత్, మరీనా
పదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి రోహిత్, మరీనా జంటగా అడుగుపెట్టారు. వారి లవ్ స్టోరీ గురించి నాగార్జున అడిగారు. ఓ సినిమాలో తమ మధ్య పరిచయం ఏర్పడిందని మరీనా చెప్పింది. తాను ఇంట్రోవర్ట్ అని రోహిత్ చెప్పగా మరీనా మాత్రం ఎక్రోవర్ట్ అని బదులిచ్చింది. వారిని జంటగా కొన్ని ప్రశ్నలు అడిగారు నాగార్జున.మీలో బెస్ట్ కిస్సర్ ఎవరూ అడగ్గా రోహిత్... మరీనా పేరు చెప్పాడు. ఎక్కువ ఐలవ్ యూ చెప్పేది ఎవరూ అని అడగ్గా మరోసారి రోహిత్... మరీనా పేరు చెప్పాడు.
Sun, 04 Sep 202202:23 PM IST
బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చిన అ అంటే అమలాపురం ఫేమ్ అభినయశ్రీ
బిగ్‌బాస్ హౌజ్‌లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా అభినయశ్రీని వేదికపైగా ఆహ్వానించాడు నాగార్జున. ఆ అంటే అమలాపురం పాటతో ఫేమ్ అయిన తాను ఆ తర్వాత ఎవరికి కనపడకుండా పోయానని చెప్పింది. లైఫ్‌లో మరోసారి బిగ్‌బాస్ రూపంలో సెకండ్ ఛాన్స్ వచ్చిందని అభినయశ్రీ తెలిపింది. యానిమల్ లవర్ అయిన తాను పులిని చూసిన భయపడనని, కానీ బల్లి అంటే భయమని చెప్పింది. బల్లి బొమ్మ చూపించి అభినయవ్రీని భయపెట్టాడు నాగార్జున
Sun, 04 Sep 202202:13 PM IST
ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ ఎంట్రీ
బిగ్‌బాస్ లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ అడుగుపెట్టింది. తన పేరు వెనకున్న సీక్రెట్ ను నాగార్జునతో పంచుకున్నది గీతు. వికాస్ తో తన పెళ్లి గురించి చెప్పింది. అందరూ అనుకుంటున్నట్లుగా తమది లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమేనని చెప్పింది. బేబీ వాయిస్‌లో అఖిల్ బావ అంటూ ఇష్టం అంటూ మిమిక్రీ చేసి నాగార్జునను మెప్పించింది. ఫోన్ లేకుండా బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండటం కష్టమేనని గీతూ చెప్పింది. తన ఇన్‌సెక్యూరిటీస్ నుంచి బయటపడటానికే బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చానని చెప్పింది గీతూ. గతంలో తనకు బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందని, కానీ బరువు ఎక్కువగా ఉన్నాననే అభద్రతా భావంతో తిరస్కరించానని చెప్పింది. నువ్వు చాలా అందంగా ఉన్నావని ఆమెకు నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చాడు.
Sun, 04 Sep 202202:00 PM IST
ఏడో కంటెస్టెంట్‌గా అర్జున్ కళ్యాణ్
బిగ్‌బాస్ సీజన్ 6లోకి ఏడో కంటెస్టెంట్‌గా నటుడు అర్జున్ కళ్యాణ్ వచ్చాడు. నటుడిగా రాణించాలనే టార్గెట్‌తో ప్రేక్షకులకు చేరువ కావాలనే బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చానని అర్జున్ అన్నాడు. రెండో టార్గెట్ కప్ గెలవడమే అని చెప్పాడు. అతడితో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాడు. రియల్‌లైఫ్‌లో ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని నాగార్జున అడిగిన ప్రశ్నకు ఎప్పుడూ లెక్కపెట్టలేదని అర్జున్ కళ్యాణ్ సమాధానం చెప్పాడు. అర్జున్ కళ్యాణ్ గురించి ఎవరికి తెలియని ఓ నిజం చెప్పాలని నాగార్జున అడగ్గా బ్రేకప్ అయ్యిందని విషయాన్ని బయటపెట్టాడు. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టిందని అర్జున్ కళ్యాణ్ అన్నాడు. అతడికి ఓ చాక్లెట్ ఇచ్చిన నాగార్జున ఒకవైపు తిని మరోవైపు హౌజ్‌లోని మరో కంటెస్టెంట్‌తో షేర్ చేసుకోమని కండీషన్ పెట్టాడు.
Sun, 04 Sep 202201:49 PM IST
ఆరో కంటెస్టెంట్‌గా శ్రీ సత్య ఎంట్రీ.
ఆరో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి శ్రీ సత్య డౌన్ డౌన్ డప్పా అనే ఐటెమ్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నది. డ్యాన్స్‌లో అదరగొట్టినట్లు నాగార్జున మెచ్చుకున్నాడు. నవ్వు సింగిల్ పెళ్లాయిందా అని నాగార్జున అమెను అడిగాడు. తాను సింగిల్ అంటూ సమాధానం చెప్పింది. జంక్ ఫుడ్ అంటే ఇష్టమని శ్రీసత్య చెప్పగా ఆమె కోసం కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తెప్పించాడు నాగార్జున. తనకు ఇష్టమైన చికెన్ ఫుడ్‌ను తనతో పాటే బిగ్‌బాస్ హౌజ్‌లోకి తీసుకెళ్లడానికి నాగార్జున అనుమతి ఇచ్చాడు. ఆ చికెన్‌ను ఒకరితో మాత్రమే పంచుకోవాలని నాగార్జున ఆమెకు కండీషన్ పెట్టాడు.
Sun, 04 Sep 202201:40 PM IST
బింబిసార గెటప్ లో చలాకీ చంటీ
బింబిసార గెటప్‌లో చంటిసార అంటూ చలాకీ చంటీ బిగ్‌బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టారు. నాగార్జునను చూడగానే గుండెదడ మొదలవుతుందని చంటి అనడంతో వెళ్లిపోనా అయితే అంటూ నాగార్జున చెప్పడం నవ్వులను పూయించింది. తన భార్యతో సువర్చలతో ప్రేమ, పెళ్లి గురించి నాగార్జునతో పంచుకున్నాడు చలాకీ చంటి.
Sun, 04 Sep 202201:24 PM IST
బిగ్‌బాస్ లో రణ్‌భీర్ - అలియా సందడి
బిగ్‌బాస్ లాంఛ్ ఈవెంట్‌లో స్టార్స్ సందడి చేయబోతున్నారంటూ రణ్‌భీర్‌కపూర్ - అలియా భట్‌లను స్టేజ్‌పైకి ఇన్వైట్ చేశారు నాగార్జున. స్టేజ్‌పై రణ్‌భీర్, అలియా తెలుగులో మాట్లాడి అలరించారు. కుంకుమలా పాటను తెలుగులో అద్భుతంగా పాడింది అలియా. ఆ తర్వాత రణ్‌భీర్ - అలియా కలిసి హిందీలో కేసరియా పాటను పాడారు.
Sun, 04 Sep 202201:17 PM IST
అమ్మాయిలదే మెజారిటీ
ఇప్పటివరకు బిగ్‌బాస్ హౌజ్‌లోకి నలుగురు కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. కీర్తిభట్, సుదీప్, నేహా తో శ్రీహాన్ వచ్చారు. ఇందులో ముగ్గురు అమ్మాయిలే ఉండటం గమనార్హం.
Sun, 04 Sep 202201:14 PM IST
నాలుగో కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అడుగుపెట్టిన నేహా
బిగ్‌బాస్ హౌజ్‌లోకి నాలుగో కంటెస్టెంట్‌గా నేహా అడుగుపెట్టింది. రక్కమ్మ పాటతో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి అయినా చేసుకో లేదంటే బిగ్‌బాస్ హౌజ్‌లో కైనా వెళ్లు అనే కండీషన్‌తో బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టినట్లు నేహా... నాగార్జునతో చెప్పింది. ఆమెకు సుదీప, కీర్తి, శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చాడు.
Sun, 04 Sep 202201:07 PM IST
మూడో కంటెస్టెంట్ గా శ్రీహాన్
బిగ్‌బాస్ 6లోకి మూడో కంటెస్టెంట్‌గా శ్రీహాన్ వచ్చాడు. శ్రీహాన్ స్టేజ్‌పైకి రాగానే సిరి సిరి అంటూ పేరు రిపీట్ చేశాడు. సిరి ఎలా ఉంది అని అడిగాడు. నాగార్జున ప్రశ్నకు సిరి బాగుందంటూ చెప్పింది. సిరిని వదిలిపెట్టి ఎలా వచ్చావు అని అడగ్గా...సిరి కోల్పోయిన దానిని గిఫ్ట్‌గా ఇవ్వడానికి బిగ్‌బాస్ హౌజ్‌కు వచ్చానని అన్నాడు. ఇంతందం దారి మళ్లిందా అనే పాట పాడిన శ్రీహాన్...ఆ సాంగ్‌ను సిరికి అంకితం ఇస్తున్నట్లుగా తెలిపాడు.
Sun, 04 Sep 202212:53 PM IST
రెండో కంటెస్టెంట్‌గా సుదీప
బిగ్‌బాస్ హౌజ్‌లోకి రెండో కంటెస్టెంట్‌గా నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ సుదీప్ అలియాస్ పింకీ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ అందరితో సినిమాలు చేశానని, కానీ నాగార్జునతో కలిసి పనిచేసే అవకాశం మాత్రం దక్కలేదని సుదీప చెప్పింది. స్టేజ్‌పై అడుగుపెట్టిన సుదీపకు డ్యాన్స్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. కొన్ని పదాలు ఇచ్చి వాటికి అనుగుణంగా ఆమెతో డ్యాన్స్‌లు చేయించాడు. మిమ్మల్ని గురువు గారు అంటూ పిలవవచ్చా అంటూ నాగార్జునను ఆమె కోరింది. మా స్టార్ అంటూ పిలవమని నాగార్జున సుదీపకు సూచించాడు.
Sun, 04 Sep 202212:49 PM IST
ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అడుగుపెట్టిన కీర్తిభట్
బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఇంట్యూషన్ కార్డ్ ఇచ్చారు నాగార్జున. బిగ్‌బాస్ హౌజ్ చూస్తుంటే స్వర్గం గుర్తొస్తుందని కీర్తి భట్ ఎమోషనల్ అయ్యింది.
Sun, 04 Sep 202212:39 PM IST
కలర్ ఫుల్‌గా బిగ్‌బాస్ హౌజ్ - పాటతో హౌజ్‌ను చూపించిన నాగ్
ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా ఫిక్స్ - ఇది బిగ్‌బాస్ సీజన్ 6 అంటూ బిగ్‌బాస్ హౌజ్‌ను నాగార్జున పరిచయం చేశారు. ఈ సారి స్లీపింగ్ రూమ్‌ను రౌండ్‌గా ఫిక్స్ చేశారు. బాల్కానీ తో కొత్తగా బిగ్‌బాస్ హౌజ్‌ను డిజైన్ చేశారు. కన్ఫేషన్ రూమ్, కిచెన్, గార్డెన్ ఏరియాను చూపించారు. వంద రోజులు ఈ షో ఉండబోతున్నట్లు పాటలో ప్రకటించారు.
Sun, 04 Sep 202212:34 PM IST
విక్రమ్ మ్యూజిక్‌తో బిగ్‌బాస్ వేదికపై ఎంట్రీ ఇచ్చిన నాగ్
ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేసే వారు ఎవరైనా ఉన్నారంటే అది నేనే అంటూ నాగార్జున స్టైలిష్‌గా బిగ్‌బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చాడు. బంగార్రాజు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు.
Sun, 04 Sep 202211:46 AM IST
కంటెస్టెంట్స్ వీళ్లేనా...
బిగ్‌బాస్ 6 లో పాల్గొననున్న కంటెస్టెంట్స్ ఎవరన్నది మరో గంటలో తేలిపోనుంది. ఇప్పటికే చలాకీ చంటి, రేవంత్ పేర్లు ఖరారు కాగా మిగిలిన వారు వీరే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీహాన్, బాలాదిత్య, అభినయశ్రీ, తన్మయ్, ఫైమా, నేహా చౌదరి, ఆర్‌జే సూర్య, శ్రీసత్య, సుదీప, గీతు రాయల్, వాసంతి క్రిష్ణన్, అరోహి రావ్ తో పాటు మరినా అబ్రహం, రోహిత్ సాహ్ని జోడీ తో పాటు మరికొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
Sun, 04 Sep 202210:48 AM IST
ప్లేబాయ్ సింగర్ ఎవరు?
బిగ్‌బాస్ 6 తాలూకు సంబంధించి కంటెస్టెంట్స్ ఫేస్ లు చూపించకుండా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటుంది.రిలేషన్ షిప్ మీద నీ ఒపినియన్ ఎంటీ అంటూ ఓ లేడీ కంటెస్టెంట్ ను నాగార్జున ప్రశ్న అడిగారు.మిమ్మల్ని చూస్తేనే సగం మర్చిపోతున్నా అంటూ ఆమె సమాధానం చెప్పడం... అయితే వెళ్లిపోనా అయితే అంటూ నాగార్జున పంచ్ వేయడం నవ్వులను పూయిస్తోంది. మంచి పాట గాడివే కాదు ప్లేబాయ్ అని కూడా అంటున్నారు నిజమేనా అని మరో కంటెస్టెంట్ ను నాగార్జున ప్రశ్న అడిగాడు. అతడి ప్రశ్నకు ఎందుకు సార్ మా ఆవిడ షో చూస్తుంటుంది అంటూ ఆ కంటెస్టెంట్స్ సమాధానం చెప్పడం ఆకట్టుకుంటోంది. బింబిసార గెటప్ లో చలాకీ చంటీ ఈ ప్రోమోలో కనిపించాడు. లోపల ఎవరెవరిని చూపించబోతున్నావని చంటిని నాగార్జున అడిగాడు. లోపల వేరే అంతా సుర్రు సుమ్మైపోతుంది అంటూ నాగ్ డైలాగ్ చెప్పి చంటి ఆకట్టుకున్నాడు. ఈ ప్రోమోలో రేవంత్, చలాకీ చంటీ వాయిస్ లు మాత్రమే గుర్తుపెట్టేలా ఉన్నాయి. మిగిలిన వారు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
Sun, 04 Sep 202210:19 AM IST
చలాకీ చంటి కన్ఫార్మ్
బిగ్‌బాస్ 6లో సంబంధించిన తాజా ప్రోమోలో కొందరు కంటెస్టెంట్స్‌ను రివీల్ చేశారు నాగార్జున. ఈ ప్రోమోలో చలాకీ చంటి కనిపించాడు. అతడిపై పాటు ఫైమా, తన్మయి వాయిస్‌లు వినిపించాయి. వారు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టనున్నది ఖరారైంది.