Bigg Boss Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ 5 లక్షలు- గెలుచుకుంది ఇంతే- జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్, రోహిణి ఎంట్రీ!-bigg boss telugu 8 prize money till now announced and 6 celebrities wild card entry bigg boss 8 telugu day 12 highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ 5 లక్షలు- గెలుచుకుంది ఇంతే- జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్, రోహిణి ఎంట్రీ!

Bigg Boss Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ 5 లక్షలు- గెలుచుకుంది ఇంతే- జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్, రోహిణి ఎంట్రీ!

Sanjiv Kumar HT Telugu
Sep 14, 2024 10:50 AM IST

Bigg Boss Telugu 8 Prize Money: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఇప్పటివరకు సంపాదించుకున్న ప్రైజ్ మనీ ఎంతో బిగ్ బాస్ తెలిపాడు. అలాగే బిగ్ బాస్ 8 తెలుగులోకి కొత్తగా ఆరుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

బిగ్ బాస్ ప్రైజ్ మనీ 5 లక్షలు- గెలుచుకుంది ఇంతే- జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్, రోహిణి ఎంట్రీ!
బిగ్ బాస్ ప్రైజ్ మనీ 5 లక్షలు- గెలుచుకుంది ఇంతే- జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్, రోహిణి ఎంట్రీ!

Bigg Boss Telugu 8 September 13th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 డే 12 ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా కలిసి ఇప్పటివరకు సంపాదించుకున్న ప్రైజ్ మనీ ఎంతో రివీల్ చేశారు. సాధారణంగా ప్రతి సీజన్‌లో గెలిచిన విన్నర్‌కు ఒక నిర్ధిష్టమైన బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఉంటుంది. అది సుమారుగా రూ. 50 లక్షల వరకు ఉంటుంది.

జీరో నుంచి స్టార్ట్

అలాగే, ఆ ప్రైజ్ మనీతోపాటు కొన్ని స్పెషల్ అసెట్స్‌ను కూడా విజేత సంపాదించుకునే అవకాశం ఉండేది. ఉదాహరణకు ఇళ్ల స్థలం, కారు వంటివి బిగ్ బాస్ ప్రైజ్ మనీతోపాటు హౌజ్‌లో గెలుచుకునేవారు. అయితే, ఈ బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో మాత్రం జీరో ప్రైజ్ మనీ అని చెప్పారు. అంటే, ఆ ప్రైజ్ మనీ జీరో నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది.

హౌజ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిహేవియర్, ఆడే టాస్క్‌లను బట్టి వారు ప్రైజ్ మనీని పెంచుకోవచ్చు. అలా మొదటి వారం అప్పుడు హౌజ్‌లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ రూ. 5 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. కంటెస్టెంట్స్ చేసిన పర్ఫామెన్స్‌కు నాగార్జున రూ. 5 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు. కానీ, అందులో ఎంత ఇవ్వాలనేది బిగ్ బాస్ నిర్ణయించాడు.

పోగొట్టుకున్న 2 లక్షలు

నాగార్జున అనౌన్స్ చేసిన ప్రైజ్ మనీలో నుంచి రూ. 2 లక్షలు కట్ చేసి మూడు లక్షలు మాత్రమే ప్రైజ్ మనీగా ఫిక్స్ చేశాడు బిగ్ బాస్. ఇక ఈ రెండోవారంలో నామినేషన్స్ తర్వాత పోగొట్టుకున్న రూ. 2 లక్షలను కూడా సంపాదించుకునేందుకు టాస్క్‍‌లు పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్కుల్లో మూడు క్లాన్స్ పాల్గొని బిగ్ బాస్ ప్రైజ్ మనీని పెంచుకున్నాయి.

టాస్క్‌లు ఆడి నైనిక క్లాన్ రూ. 75 వేలు సంపాదించుకుంటే.. అతిపెద్ద క్లాన్ అయిన యశ్మీ టీమ్ రూ. 1,25000 సాధించుకుంది. కేవలం ఒక్క నాగ మణికంఠ మాత్రమే ఉన్న అతి చిన్న క్లాన్ అయిన నిఖిల్ అందరికంటే ఎక్కువగా రూ. 2 లక్షల 45 వేలు రాబట్టారు. అందరికంటే ఎక్కువ అమౌంట్ ఏది ఉంటుందో అది విన్నర్ ప్రైజ్ మనీలోకి జత చేస్తారని టాస్క్‌లకు ముందే బిగ్ బాస్ ప్రకటించాడు.

ప్రైజ్ మనీ 5 లక్షల 45 వేలు

దాంతో రూ. 2,45000ను ప్రైజ్ మనీలోకి యాడ్ చేయడంతో ఇదివరకు ఉన్న 3 లక్షలను కలిపి మొత్తంగా బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 5 లక్షల 45 వేలు అయింది. ఈ అమౌంట్‌ను బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విజేతకు అందిస్తారు. ఈ ప్రైజ్ మనీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే మధ్యలో హౌజ్ మేట్స్ చేసే పనుల కారణంగా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, వైల్డ్ కార్డ్ ద్వారా కొత్తగా మరో ఆరుగురు సెలబ్రిటీలు హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. అది కూడా మూడో వారంలో వచ్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఈ ఆరుగురిలో ఎక్కువగా జబర్దస్త్ అవినాష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అతను ఇదివరకు రెండుసార్లు బిగ్ బాస్ హౌజ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు వస్తే మూడోసారి అవుతుంది.

జబర్దస్త్ రోహిణి కూడా

జబర్దస్త్ అవినాష్‌ను కామెడీ పరంగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అతనిపాటు జబర్దస్త్ రోహిణి కూడా బిగ్ బాస్ 8 తెలుగులోకి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టనుందని టాక్ వస్తోంది. మరి వైల్డ్ కార్డ్‌తో ఎవరెవరు వస్తారో చూడాలి.