Bigg Boss Telugu 8: లేడి చీఫ్స్‌కు బిగ్ బాస్ నయా ఛాలెంజ్- కన్నడ కంటెస్టెంట్స్ నిఖిల్, యశ్మీకి ఫైట్- అడ్డ దిడ్డంగా!-bigg boss telugu 8 day 5 promo loop the hoop challenge for contestants yashmi gowda nikhil fight in bigg boss 8 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: లేడి చీఫ్స్‌కు బిగ్ బాస్ నయా ఛాలెంజ్- కన్నడ కంటెస్టెంట్స్ నిఖిల్, యశ్మీకి ఫైట్- అడ్డ దిడ్డంగా!

Bigg Boss Telugu 8: లేడి చీఫ్స్‌కు బిగ్ బాస్ నయా ఛాలెంజ్- కన్నడ కంటెస్టెంట్స్ నిఖిల్, యశ్మీకి ఫైట్- అడ్డ దిడ్డంగా!

Sanjiv Kumar HT Telugu
Sep 06, 2024 12:17 PM IST

Bigg Boss 8 Telugu Day 5 Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కెప్టెన్స్‌కు బదులు చీఫ్స్‌ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు చీఫ్స్ మధ్య ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ముగిసిన తర్వాత కర్ణాటకకు చెందిన నిఖిల్ మలియక్కల్, యశ్మీ గౌడ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

లేడి చీఫ్స్‌కు బిగ్ బాస్ నయా ఛాలెంజ్- కన్నడ కంటెస్టెంట్స్ నిఖిల్, యశ్మీకి ఫైట్- అడ్డ దిడ్డంగా!
లేడి చీఫ్స్‌కు బిగ్ బాస్ నయా ఛాలెంజ్- కన్నడ కంటెస్టెంట్స్ నిఖిల్, యశ్మీకి ఫైట్- అడ్డ దిడ్డంగా!

Bigg Boss Telugu 8 Day 5 Promo: బిగ్ బాస్ తెలుగు 8 డే 5 ఎపిసోడ్ ప్రోమో నయా టాస్క్‌తో ప్రారంభం అయింది. సాధారణంగా గత సీజన్స్‌లో ఇంటి సభ్యులను క్రమశిక్షణతో ఉంచేందుకు హౌజ్ కెప్టెన్స్ ఉండేవారు. కానీ, బిగ్ బాస్ 8 తెలుగులో మాత్రం కెప్టెన్స్‌కు బదులు చీఫ్స్‌ను పెట్టాడు బిగ్ బాస్.

యశ్మీ టీమ్ గెలిచి

ఇదివరకే యశ్మీ గౌడ, నిఖిల్ మలియక్కల్, నైనిక ముగ్గురు చీఫ్స్‌గా సెలెక్ట్ అయ్యారు. ఇక సెప్టెంబర్ 5వ తేది ఎపిసోడ్‌లో వాళ్లను తమ క్లాన్స్‌గా ఇంటి సభ్యులను సాధించుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. అలా ఎవరి టీమ్‌ను వారు ఏర్పర్చుకున్నారు. అనంతరం పెట్టిన క్లాన్ టాస్క్‌లో యశ్మీ టీమ్ గెలిచి నిఖిల్ టీమ్ నుంచి ఒక క్లాన్‌ను తీసేసుకుంది.

ఇక తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్ ప్రోమోలో సమానంగా ఉన్న ఇద్దరు చీఫ్స్ యశ్మీ గౌడ, నైనిక మధ్య లూప్ ది హూప్ అనే కొత్త ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. టీమ్ అంతా చేతులు పట్టుకుని ఒక్కటిగా ఉండి.. రింగ్స్‌ను బాడీ ద్వారా మరొకరికి చేరవేస్తూ చివరి మెంబర్ వరకు పాస్ చేయాలి. అలా బజర్ మోగేంతవరకు ఇచ్చిన టైమ్‌లో ఎక్కువ రింగ్స్ పాస్ చేసిన వారు గెలిచినట్లు.

ఫుల్ బాడీ అనలేదు

అయితే, ఈ టాస్క్‌లో నైనిక గెలిచినట్లు అనిపిస్తోంది. కానీ, చివరిలో తన టీమ్ క్లాన్ నబీల్ హెడ్ నుంచి కాళ్లతో రింగ్‌ను పక్కకు పడేయకుండా డైరెక్ట్ తలతోనే కిందపడేసాడు. దాన్ని యశ్మీ టీమ్ ఖండించింది. నబీల్ చేసిన విషయాన్ని అభయ్ చెప్పాడు. అది మా స్ట్రాటజీ అని నైనిక చెప్పింది. ఫుల్ బాడీ అని చెప్పలేదు. పాస్ చేయాలన్నారు అని సీత, నైనిక అన్నారు.

చేయి వదలకూడదని అన్నారు. వదల్లేదు అని విష్ణుప్రియ అరిచింది. శరీరం నుంచి తీసుకెళ్లాలని అన్నారు అని సంచాలక్‌గా ఉన్న నిఖిల్ వివరణ ఇస్తుండగా.. శరీరం అంటే తలొక్కటే కాదు మామ అని అభయ్ అన్నాడు. అదే సమయంలో తమకు ఫేవర్‌గా చెప్పేలా యశ్మీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇన్ఫ్యూయెన్స్ చేద్దామనుకుంది. కానీ, అది వర్కౌట్ కానట్టుంది.

అడ్డంగా.. దిడ్డంగా

మీరు ఫుల్ బాడీ అనుకుని చేశారు అని నిఖిల్ అన్నాడు. బాడీ అనుకున్నాం.. అంటే.. ఫుల్ బాడీనేగా అని పృథ్వీ అన్నాడు. అడ్డంగా.. దిడ్డంగా.. వెళ్లడానికి మాకు లేదు. రూల్స్ ఫాలో అవుతున్నాం అని యశ్మీ చెప్పింది. తర్వాత కట్ చేస్తే.. నేను చెబుతుండగా మధ్యలో కట్ చేశారు అని నిఖిల్ అంటుంటే.. ఓకే ఓకే అంటూ చప్పట్లు కొట్టింది యశ్మీ గౌడ.

మరోవైపు వేరే వాళ్లు గెలిస్తే క్లాప్ చేసినప్పుడు ఇతరులు గెలిచినప్పుడు కూడా చేయాలి అని బేబక్కతో సీత చెబుతుండగా.. నేను చేశాను అని యశ్మీ దూరింది. దాంతో నేను అనలేదు. అక్కతోని మాట్లాడుతున్న యశ్మీ అని సీత చెప్పింది. తర్వాత మళ్లీ బాడీ పాసింగ్ గురించి యశ్మీ, నిఖిల్ గొడవ పడ్డారు. సంచాలక్‌గా ఉన్నప్పుడు నువ్ ఆలోచించలేదా అని తలకు వేలు పెట్టుకుంటూ యశ్మీ చెప్పింది.

ఇద్దరు కన్నడీయులే

దాంతో ఆగు అన్నట్లుగా నిఖిల్ చేయి చూపించాడు. ఇలా యశ్మీ, నిఖిల్ మధ్య మంచి ఫైటే జరిగినట్లు తెలుస్తోంది. కాగా యశ్మీ, నిఖిల్ ఇద్దరు కర్ణాటకు చెందినవారు. ఇద్దరు తెలుగు సీరియళ్లలో పలు పాత్రలతో ప్రేక్షకుల వద్ద మంచి ఆదరణ సాధించుకున్నారు.