Pallavi Prashanth Prize Money: బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో కోత.. పల్లవి ప్రశాంత్‌కు వచ్చిందికి ఎంతంటే?-bigg boss 7 telugu winner pallavi prashanth prize money is rs 62 lakh approximately ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pallavi Prashanth Prize Money: బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో కోత.. పల్లవి ప్రశాంత్‌కు వచ్చిందికి ఎంతంటే?

Pallavi Prashanth Prize Money: బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో కోత.. పల్లవి ప్రశాంత్‌కు వచ్చిందికి ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu

Bigg Boss 7 Telugu Winner Prize Money: బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా గెలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు వచ్చిన ప్రైజ్ మనీలో కోత పడింది. బిగ్ బాస్ ప్రైజ్ మనీలో పల్లవి ప్రశాంత్ గెలుచుకుంది ఎంతనే వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో కోత.. పల్లవి ప్రశాంత్‌కు వచ్చిందికి ఎంతంటే?

Bigg Boss Pallavi Prashanth Prize Money: బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే ముగిసింది. డిసెంబర్ 17న బిగ్ బాస్ ఏడో సీజన్ యాత్ర ముగిసింది. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్‌ కు వచ్చిన ప్రైజ్ మనీ ఎంతనేది హాట్ టాపిక్ మారింది. అయితే, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. కానీ, అందులో కోత విధించడం జరిగింది.

బిగ్ బాస్ 7 తెలుగు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు అయినప్పటికీ వాటిలో నుంచి ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు టాప్ 4 కంటెస్టెంట్ గా తీసుకెళ్లిపోయాడు. దీంతో ప్రైజ్ మనీ రూ. 35 లక్షలకు తగ్గింది. అలాగే జోయాలుకాస్ వారు ఇచ్చే నగల విలువ రూ. 15 లక్షలు. వీటితోపాటు బ్రీజా కారు విలువ సుమారు రూ. 12 లక్షలు అని సమాచారం. ఇవన్ని కలుపుకుంటే పల్లవి ప్రశాంత్‌కు వచ్చింది రూ. 62 లక్షలు.

ఇప్పటివరకు బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్‌కు రూ. 80 లక్షలు వస్తుందని టాక్ నడిచింది. కానీ, విజేతగా నిలిచిన ప్రశాంత్‌కు రూ. 62 లక్షలు రానున్నాయి. వాటిలో రూ. 35 లక్షలను ప్రశాంత్ ఇది వరకు చెప్పినట్లుగానే పేద రైతులకు అందించనున్నట్లు స్టేజీపై చెప్పాడు. ఇక కారును తండ్రికి, జోయాలుకాస్ నగలను తల్లికి ఇస్తున్నట్లు తెలిపాడు బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్.