Bigg Boss 7 Telugu Winner: రైతుబిడ్డే బిగ్ బాస్ విన్నర్.. టిక్ టాక్ నుంచి విజేత వరకు! రన్నరప్‌గా అమర్-bigg boss 7 telugu winner pallavi prashanth and runner up amardeep ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu Winner: రైతుబిడ్డే బిగ్ బాస్ విన్నర్.. టిక్ టాక్ నుంచి విజేత వరకు! రన్నరప్‌గా అమర్

Bigg Boss 7 Telugu Winner: రైతుబిడ్డే బిగ్ బాస్ విన్నర్.. టిక్ టాక్ నుంచి విజేత వరకు! రన్నరప్‌గా అమర్

Sanjiv Kumar HT Telugu
Dec 17, 2023 10:03 PM IST

Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth: బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్‌గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే రన్నరప్‌గా అమర్ దీప్ నిలిచాడు.

రైతుబిడ్డే బిగ్ బాస్ విన్నర్.. టిక్ టాక్ నుంచి విజేత వరకు! రన్నరప్‌గా అమర్
రైతుబిడ్డే బిగ్ బాస్ విన్నర్.. టిక్ టాక్ నుంచి విజేత వరకు! రన్నరప్‌గా అమర్

Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఎట్టకేలకు ముగిసిపోయింది. ఫైనల్‌గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్‌ అయి చరిత్ర సృష్టించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇందాకే పూర్తి కాగా అధికారికంగా విజేతను సుమారు 10 గంటల సమయంలో ప్రకటించనున్నారు.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా నిలవగా.. బీటెక్ బాబుగా అలరించిన అమర్ దీప్ చౌదరి రన్నరప్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ మొదట్లో టిక్ టాక్‌లో వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. విచిత్రమైన ప్రవర్తనతో, పిచ్చోడిలా, వివిధ రకాలుగా వీడియోలు చేసేవాడు. కంటెంట్ కోసం ఎలాంటి వీడియో అయిన చేసేవాడు.

టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో వీడియోలు పోస్ట్ చేయాలనుకున్నాడు. కానీ, అందులో వీడియోలు పెట్టాలంటే చాలా కష్టమైన పని అని, వీడియోలు ఎడిట్ చేసి పోస్ట్ చేయాలని, అది చాలా పెద్ద పని అని, అందుకు మంచి ఫోన్ కావాలనుకున్నాడు. ఓ ఖరీదైన ఫోన్ కోసం చిట్టీ రూపంలో వచ్చిన డబ్బుని ఫ్రెండ్‌కు ఇచ్చాడు ప్రశాంత్. కానీ, ఆ ఫ్రెండ్ మోసం చేయడంతో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు.

కొడుకుపై ఆశలు పెట్టుకున్న ప్రశాంత్ తండ్రి తన కోరిక తీరుస్తా అనడంతో మానుకున్నాడు. కొడుకుపై నమ్మకంతో లక్షలు పెట్టి ఐఫోన్ కొనిచ్చాడు ప్రశాంత్ తండ్రి. దాంతో ప్రశాంత్ కెరీర్ మారిపోయింది. ఓవైపు పొలం పనులు చేసుకుంటూ మరోవైపు వాటినే వీడియోలుగా చేసి పోస్ట్ చేసేవాడు. అలా లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకున్నాడు ప్రశాంత్.

జీవితంలో ఏదైనా సాధించాలి, అందుకు బిగ్ బాస్ మంచి వేదిక అనుకున్న ప్రశాంత్.. తనను బిగ్ బాస్‌కు పంపించాలని వివిధ రకాలుగా వీడియోలు చేశాడు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వీడియోలలో చెప్పించాడు. అది చూసి చాలా మంది నవ్వుకున్నారు. నువ్ ఏంటీ, బిగ్ బాస్ ఏంటీ అని ఎగతాళిగా నవ్వారు. ఏదో ఒక రోజు నవ్వుతున్న మీ నోళ్లు మూతపడతాయని గట్టిగా ప్రయత్నించాడు ప్రశాంత్. తాను అనుకున్నట్లుగానే బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లోకి అడుగు పెట్టే అవకాశం అందుకున్నాడు రైతుబిడ్డ.

రైతుబిడ్డగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ హీరో శివాజీ కంట పడ్డాడు. తనకు నచ్చడంతో, మిగతా వారు చిన్నచూపు చూస్తున్నారని కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రశాంత్‌ను అక్కున చేర్చుకున్నాడు శివాజీ. తనకు ఎప్పుడూ గైడెన్స్ ఇస్తూ, తప్పొప్పులు చెబుతూ శివాజీ ఎంకరేజ్ చేశాడు. ఎంత ఎంకరేజ్ చేసిన టాస్క్‌లు మాత్రం స్వయంగా ఆడి గెలిచాడు.

బిగ్ బాస్ చరిత్రలోనే వేగంగా టాస్క్‌లు ఆడి అత్యంత ఫాస్టెట్ గేమర్‌గా రికార్డుకెక్కాడు ప్రశాంత్. ఫైనల్‌గా బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా నిలిచి తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు గెలుచుకున్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.

Whats_app_banner