Bigg Boss Telugu 8: ఆదిరెడ్డి రివ్యూలు బిగ్ స్కామ్.. హీరో శివాజీని కావాలనే టార్గెట్ చేశాడు.. జబర్దస్త్ మహిధర్ కామెంట్స్
Jabardasth Mahidhar About Adireddy Reviews: బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్, రివ్యూవర్ ఆదిరెడ్డి పెద్ద స్కామర్ అని మరో రివ్యూవర్, కమెడియన్ జబర్దస్త్ మహిధర్ ఆరోపణలు చేశాడు. ఆపరేషన్ ఆదిరెడ్డి పేరు మీద వీడియోలు పెడుతూ తన రివ్యూలు బిగ్ స్కామ్ అని చెబుతున్నాడు మహిధర్.
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్స్ అంతా పోటా పోటీగా గొడవ పడటం స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ హౌజ్ సభ్యుల మధ్య గొడవలు, పోటీ సహజమే. కానీ, తాజాగా బిగ్ బాస్ షోపై రివ్యూలు చెప్పేవారు కూడా పోటీ పడుతున్నారు.
బిగ్ బాస్ రివ్యూవర్‌గా మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పాపులర్ అయిన విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో బిగ్ బాస్‌పై రివ్యూలు ఇచ్చి ఆఖరుకు కామన్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ తనకు తాను పెట్టుకుని బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొన్నాడు. ఆ షోలో గీతూ రాయల్ వెళ్లిపోయిన తర్వాత ఆమె కంటే ఎక్కువ రచ్చ చేసి నెగెటివిటీ తెచ్చుకున్నాడు.
పక్క దారి పట్టాయి
అయితే, ఆదిరెడ్డి రివ్యూలకు ఒకప్పుడు మంచి విశ్వనీయత ఉండేది. చాలామంది అతని రివ్యూలు వీక్షించేవారు. కానీ, బిగ్ బాస్‌లో ఆదిరెడ్డి యాంగిల్ మారింది. ఆ తర్వాత ఆదిరెడ్డి రివ్యూలు పక్క దారి పట్టాయి. హౌజ్‌లోకి వెళ్లేముందు కంటెస్టెంట్స్ ఈ రివ్యూవర్స్ దగ్గరకు వెళ్లడం, సపోర్ట్ చేయమని బేరాలు ఆడటం, ఒప్పందాలు కుదుర్చుకోవడం మాములు విషయాలే.
అయితే, తాజాగా ఆదిరెడ్డి రివ్యూలు పెద్ద స్కామ్ అంటూ మరో రివ్యూవర్, జబర్దస్త్ కమెడియన్ మహిధర్ షాకింగ్ వీడియో బయటపెట్టాడు. "ఆపరేషన్ ఆదిరెడ్డి" పేరుతో జెన్యూన్ కంటెస్టెంట్స్‌కి నష్టం జరగకుండా చేస్తానని తను వదిలిన వీడియోలో చెబుతున్నాడు మహిధర్.
"ఆదిరెడ్డి బిగ్ స్కామ్ అని ఎందుకు అంటున్నానంటే అతని ఎఫెక్ట్ చాలా ఉంది కాబట్టి. అతను కచ్చితంగా స్కామ్ చేస్తున్నాడు. ఆదిరెడ్డి ఒక ఫెయిల్ట్ రివ్యూవర్. హీరో శివాజీని కావాలనే నెగెటివ్ చేశాడు. ఆయన గెలవకుండా చేసి పల్లవి ప్రశాంత్‌ను గెలిచేసిన చేసిన వ్యక్తి ఆదిరెడ్డి" అని మహిధర్ అన్నాడు.
కనపడిందే చెప్పి
"ఆదిరెడ్డి రివ్యూ ఇచ్చే సమయంలో నేను కూడా లైవ్‌కు వెళ్లాను. సీజన్ 7లో అమర్ దీప్‌ను పల్లవి ప్రశాంత్ కెప్టెన్‌ను చేస్తానని అన్నాడు. ఆ తర్వాతి వారంలో కెప్టెన్ చేస్తాని చెప్పి మాట తప్పాడన్న కారణంతో పల్లవి ప్రశాంత్‌ను శోభ, అమర్ దీప్‌లు నామినేట్ చేశారు. లైవ్‌లో జరిగింది మొత్తం తాను చూశానని ఆదిరెడ్డి చెప్పాడు. జరిగిన విషయం చెప్పకుండా కనపడిందే చెప్పి అమర్ దీప్‌దే తప్పు అన్నట్లుగా చూపించాడు ఆదిరెడ్డి" అని మహిధర్ తెలిపాడు.
"నేను అదే విషయంపై మాట్లాడితే ప్రతిదానికి బ్యాక్ స్టోరీలు చెప్పలేం అన్నాడు. చెప్పలేం అన్నప్పుడు అతను రివ్యూలు చెప్పడం ఎందుకు. అతని రివ్యూలు స్కామ్ కదా. ఈ విషయంలో అతను రివ్యూవర్‌గా ఫెయిల్ అయ్యాడు. సీజన్ 5 సమయంలో యాంకర్ రవి కూడా అతని తప్పుడు రివ్యూలపై కంప్లైంట్ ఇచ్చాడు. ఆ సమయంలో నా రివ్యూలు ఎంతమంది చూస్తారులే అని అన్నాడు. కానీ, నూటికి 25 శాతం జనాలు ఇతని రివ్యూలు చూసి ప్రభావితం అవుతున్నారు" అని మహిధర్ వెల్లడించాడు.
"ఇలాంటి వాళ్లను చూస్తూ వదిలేయలేం. ఇతను బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టే ఎక్కువమంది ఇతని రివ్యూలు చూస్తున్నారు. కానీ, ఇతను మాత్రం ఒక సాధారణ రివ్యూవర్ మాదిరే రివ్యూలు ఇస్తున్నాడు. న్యూట్రల్ అన్న ముసుగులో పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్ చేశాడు. శివాజీని కావాలని ఓడిపోయేటట్టు చేయడం, సీజన్ మొత్తం పబ్లిక్‌గానే పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్ చేశాడు. ప్రశాంత్ టీమ్ అంతా అతనికి టచ్‌లో ఉన్నారు. ప్రశాంత్ జైలుకు వెళ్లిన తర్వాత కూడా సపోర్ట్ చేశాడు" అని మహిధర్ అన్నాడు.
ఇద్దరూ దొందూ దొందే
సీజన్ 6 ఫ్లాప్ అయిందంటే ఆదిరెడ్డి, గీతూలే కారణం. సీజన్ ప్లాప్ కావడానికి కారణమైన వ్యక్తి వాళ్లు ఇలా ఆడాలి.. అలా ఆడాలి అంటి రివ్యూలు ఎలా చేస్తాడు. ఆదిరెడ్డి చెప్పిందే నిజమని నమ్మేయొద్దు. ఇతని రివ్యూల వల్ల ఒక కంటెస్టెంట్ లైఫ్ నాశనం అవుతుంది. కాబట్టి, ఆదిరెడ్డి రివ్యూలకు నా రీ రివ్యూ ఉంటుంది. ఆపరేషన్ ఆదిరెడ్డి పేరుతో నేను రివ్యూలు చేస్తాను" అని మహిధర్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే, ఆదిరెడ్డి చేసింది తప్పే.. మరి నువ్వేం చేస్తున్నావ్. బిందు మాధవిని తొక్కాలని చూశావ్, బిందు మాధవిపై పడి ఏడ్చావ్, సీజన్ 6లో ఇనయాపై పడి మొత్తుకున్నావ్, 7వ సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌పై పడి ఏడ్చావ్. అమర్ దీప్‌ని లేపాలని చూశావ్. మీరిద్దరు దొందూ దొందే అని ఇద్దరిపై సెటైర్లు, కౌంటర్స్ వేస్తున్నారు ఆడియెన్స్, బిగ్ బాస్ లవర్స్.
టాపిక్