Bigg Boss Telugu 8 Voting: బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో వాళ్లిద్దరే టాప్! రెండో వారం కిర్రాక్ సీత ఎలిమినేట్?
Bigg Boss Telugu 8 Second Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్ ఓటింగ్‌లో సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ టాప్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ వారం సోనియా ఎంతగానో మాటలతో అవమానించిన విష్ణుప్రియ కూడా టాప్‌లో దూసుకుపోతోంది. అలాగే, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందంటే..
Bigg Boss Telugu 8 Voting: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం నామినేషన్స్ కూడా తగ్గాఫర్ గొడవలతో బాగానే సాగాయి. రెండు రోజుల పాటు ఈ నామినేషన్స్ ప్రక్రియ సాగింది. ఈ నామినేషన్స్ ప్రాసెస్‌లో మొదటి రోజు రెచ్చిపోయిన కంటెస్టెంట్స్ రెండో రోజు పెద్దగా గొడవలు లేకుండా మమా అనిపించారు.
డిఫెండ్ చేసుకోలేదు
చాలా వరకు సిల్లీ కారణాలతో నామినేషన్స్ చేశారు. అలాగే వారిని ఏ పాయింట్ దొరక్కపోవడంతోనే, ఎవరినో ఒకరిని నామినేట్ చేయడం ఒక టాస్క్‌గా అనుకున్నట్లు భావించారు. దాంతో తమను నామినేట్ చేసిన పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు. అయితే, ఈ క్రమంలో తనను సిల్లీ రీజన్‌తో నామినేట్ చేశాడని నిఖిల్‌పై పృథ్వీ కాస్తా అలిగాడు.
వీళ్ల విషయం పక్కన పెడితే.. రెండో వారం నామినేషన్స్‌లో ఎక్కువగా వైరల్ అయింది సోనియా ఆకుల మాటలు. యాంకర్ విష్ణుప్రియపై దారుణంగా పర్సనల్ అటాక్ చేసింది సోనియా. నామినేషన్స్ డే నుంచి సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్ వరకు విష్ణుప్రియపై కక్ష సాధించేలా ఏదో ఒక మాట వదులుతూనే ఉంది.
8 మంది నామినేట్
ఇదిలా ఉంటే, సోమవారం నాడు ప్రారంభమైన రెండో వారం నామినేషన్స్ మంగళవారం నాడు ముగిశాయి. దాంతో ఆరోజు రాత్రి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. తమకు నచ్చిన కంటెస్టెంట్ ఒక్కరికే ఓట్ చేసే అవకాశం కల్పించారు నిర్వాహకులు. గత సీజన్ 7 నుంచి కేవలం ఒక్క ఓటును మాత్రమే పరిగణిస్తుంది బీబీ టీమ్. ఇక బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో అత్యధిక ఓట్లతో మొదటి ప్లేసులో దూసుకుపోతున్నాడు సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్. నిఖిల్‌కు 22.84 శాతం (4,702 ఓట్లు) ఓటింగ్ రాగా విష్ణుప్రియ 19.92 శాతం (4,101 ఓట్లు) ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొదటి వారం నామినేషన్స్‌లో విష్ణు మొదటి ప్లేసులో కొనసాగగా.. ఈసారి నిఖిల్‌కు తొలి స్థానం సంపాదించాడు.
చివరిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్
ఇక వరుసగా నాగ మణికంఠ 12.14 శాతం (2500 ఓట్లు)తో మూడో స్థానం, పృథ్వీరాజ్ 9.56 శాతంతో (1968 ఓట్లు) నాలుగో స్థానం, నైనిక 9.18 శాతం (1891 ఓట్లు) ఐదో స్థానం, 9.06 శాతం (1866 ఓట్లు)తో ఆదిత్యం ఓం ఆరో స్థానం, 8.75 శాతం (1801 ఓట్లు)తో ఏడో స్థానంలో శేఖర్ బాషా నిలిచారు. ఇక అట్టడుగున అందరికంటే చివరిలో 8 స్థానంలో కిర్రాక్ సీత ఉంది.
పాయింట్ టు పాయింట్ కరెక్ట్‌గా మాట్లాడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సీత ఇలా చివరి స్థానంలో నిలవడం చాలా వరకు ఆశ్చర్యం కలిగించే విషయం. పెద్దగా పీఆర్ టీమ్ లేని సీతకు ఓటింగ్ ఇలాగే కొనసాగితే.. రెండో వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ శుక్రవారం వరకు ఓటింగ్‌లో మార్పులు జరిగి తనకు ఓట్ బ్యాంక్ పెరిగితినే సీత సేవ్ అవుతుంది.
టాపిక్