TS SSC Results 2024 Updates : ఆ తేదీనే తెలంగాణ పదో తరగతి ఫలితాలు..! సింగిల్ క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోవచ్చు
- Telangana SSC Results 2024 Updates : తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS SSC Results 2024) రాబోతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రిజల్ట్స్ ను HT తెలుగు వెబ్ సైట్ తో పాటు SSC బోర్డు వెబ్ సైట్ లోనూ చెక్ చేసుకోవచ్చు.
- Telangana SSC Results 2024 Updates : తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS SSC Results 2024) రాబోతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రిజల్ట్స్ ను HT తెలుగు వెబ్ సైట్ తో పాటు SSC బోర్డు వెబ్ సైట్ లోనూ చెక్ చేసుకోవచ్చు.
(1 / 7)
ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.
(2 / 7)
ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు…. పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ఫలితాలను ప్రటించిన విద్యాశాఖ… తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల కోసం అంతా సిద్ధం చేశారు.
(3 / 7)
ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాథమికంగా తేదీని ఖరారు చేసినప్పటికీ… అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
(Photo Source From unsplash.com)(4 / 7)
తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (TS SSC Spot Valuation 2024) ఏప్రిల్ 13 నాటికి ప్రక్రియ పూర్తైంది. స్పాట్ వాల్యూయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో నిర్వహించారు.
(5 / 7)
https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024 లింక్ పై చేసి HT తెలుగులో క్షణాల్లోనే ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.
(Photo Source From unsplash.com)(6 / 7)
మరోవైపు తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లోకి వెళ్లి కూడా ఫలితాలను చూసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.
(Photo Source From unsplash.com)(7 / 7)
మరోవైపు తొలిసారిగా తెలంగాణలో పదో తరగతి మెమోలపై పెన్ (Permanent Education Number) నెంబర్ ను ముద్రించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది.ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (PEN)ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధాానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన ‘పెన్’ నంబర్‌ను ముద్రించనుంది. పెన్ నెంబర్(Permanent Education Number) సెక్యూరిటీ ఫీచర్లతో కూడినదిగా ఉంటుంది.
(photo source from https://unsplash.com/)ఇతర గ్యాలరీలు