IRCTC Shirdi Tour : 3 రోజుల షిర్డీ ట్రిప్ - నాసిక్ కూడా వెళ్లొచ్చు, ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలివే-irctc tourism operate 4 days nashik and shirdi tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Shirdi Tour : 3 రోజుల షిర్డీ ట్రిప్ - నాసిక్ కూడా వెళ్లొచ్చు, ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Shirdi Tour : 3 రోజుల షిర్డీ ట్రిప్ - నాసిక్ కూడా వెళ్లొచ్చు, ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 27, 2024 09:13 AM IST

IRCTC Shirdi Nashik Tour Package: షిర్డీ, నాసిక్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. 4 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి…….

నాసిక్ షిర్డీ టూర్ ప్యాకేజీ
నాసిక్ షిర్డీ టూర్ ప్యాకేజీ

IRCTC Shirdi Nashik Tour Package 2024: సాయిబాబా భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను ప్రకటించగా.. తాజాగా SAI SHIVAM పేరుతో మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. 4 రోజుల పాటు ఈ ప్యాకేజీ ఉంటుంది. ఒక్క షిర్డీనే కాకుండా… నాసిక్ లోని పలు ప్రముఖ ఆలయాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మే 03, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ పూర్తి అయితే… మరో తేదీని కూడా ప్రకటిస్తారు.

షిర్డీ, నాసిక్ టూర్ ప్యాకేజీ వివరాలు:

  • షిర్డీ, నాసిక్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.
  • సాయి శివమ్ పేకుతో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది.
  • 4 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మే 03, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
  • మొదటి రోజు - సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 06:40 గంటలకు ట్రైన్ ఉంటుంది. Train No. 17064 (Ajanta Express) అజంతా ఎక్స్ ప్రెస్ లో వెళ్లాలి. రాత్రి మొత్తం జర్నీలోనే ఉంటారు.
  • రెండో ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి షిర్డీలోనే ఉంటారు.
  • మూడో షిర్డీ నుంచి నాసిక్ వెళ్తారు. త్రయంబకేశ్వర్(Triambakeshwar), పంచవతి(Panchavati) దర్శనం ఉంటుంది. సాయంత్రం నాగర్‌సోల్ స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • ఇక నాల్గో రోజు ఉదయం 0:45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
  • హైదరాబాద్ నుంచి ఈ శివ టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6270, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6250చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 7635గా ఉంది.
  • ఇక Comfort క్లాస్ లో టికెట్లు బుక్ చేసుకుంటే… డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7960, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7940 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 9320గా ఉంది.
  • టూర్ ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రయాణ ప్రణాళిక ప్రకారం అన్ని సందర్శనా స్థలాలు కవర్ అవుతాయి. ఏదైనా కావాలంటే వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాలి.
  • https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
  • 04027702407, 9701360701 ఈ ఫోన్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.

IPL_Entry_Point