తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Thailand Tour : ఫ్లైట్ లో 'థాయ్ లాండ్' ట్రిప్ .. ఐల్యాండ్ విజిటింగ్, పట్టాయాలో సఫారీ - ఈ టూర్ ప్యాకేజీ చూడండి
- IRCTC Hyderabad Thailand Tour Package : థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… బ్యాంకాక్, పట్టాయా వంటి టూరిజం స్పాట్ లను చూస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
- IRCTC Hyderabad Thailand Tour Package : థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… బ్యాంకాక్, పట్టాయా వంటి టూరిజం స్పాట్ లను చూస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
(1 / 7)
ఈ హాట్ సమ్మర్ లో థాయ్ లాండ్ కు వెళ్లి రిలాక్స్ అయ్యే ప్లాన్ ఉందా..? ఇందుకోసం తక్కువ బడ్జెట్ లో అందించే టూరిజం ప్యాకేజీల కోసం చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ టూరిజం(Irctc Tourism) అనేక రకాల ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా…. హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ కు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. (photo source from unsplash.com)
(2 / 7)
TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC 'టూరిజం. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.(photo source from unsplash.com)
(3 / 7)
ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మే 09, 2024 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ పూర్తి అయితే… మరో తేదీని ప్రకటిస్తారు. అందుకు తగ్గట్టుగా ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.(photo source from unsplash.com)
(4 / 7)
ఫస్ట్ రోజు థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని(Thailand Tour Package) ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. తొలి రోజు రాత్రి 09 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. ముందుగా పట్టాయాకు చేరుకుంటారు. పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రికి పట్టాయాలోనే ఉంటారు.(photo source from unsplash.com)
(5 / 7)
రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…ఇండియన్ లాంచ్ లో ఐల్యాండ్ కు వెళ్తారు.ఆ తర్వాత నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ కు వెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం ఉంటుంది. రాత్రి కూడా పట్టాయాలోనే బస ఉంటుంది. మూడో రోజు పట్టాయాలోనే సఫారీకి వెళ్తారు.మెరైన్ పార్క్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత బ్యాంకాక్ కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను చూస్తారు.(photo source from unsplash.com)
(6 / 7)
ఇక నాల్గోవ రోజు బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. పలు ఆలయాలను కూడా సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.(photo source from unsplash.com)
(7 / 7)
హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ(Thailand Tour Package)ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 57415గా ఉంది. డబుల్ షేరింగ్ కు 49040గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 49040గా ప్రకటించారు.www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే… 040-27702407 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.(photo source from unsplash.com)
ఇతర గ్యాలరీలు