IRCTC Hyd Konark Tour: కోణార్క్ ఫెస్టివల్ టూర్ - ఈ స్పెషల్ ప్యాకేజీని చూడండి…
konark dance and sand art festival tour: ప్రతి ఏడాది డిసెంబర్ లో కోణార్క్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం వెళ్లేందుకు టూరిస్టులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇక్కడికి వెళ్లేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
irctc tourism konark tour from hyderabad: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ప్రతీ ఏటా జరిగే కోణార్క్ డ్యాన్స్ అండ్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ చూసేందుకు వెళ్లేవారికోసం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'Konark Dance and Sand Art Festival' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, చిలికా లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.
3 రోజులు 2 రాత్రులు....
డిసెంబర్ 1, 2, 3, 4, 5 తేదీల్లో ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్లి పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు
Day - 1 : ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కుతారు. ఉదయం 8.10 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పూరి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత లంచ్ చేస్తారు. ఆ తర్వాత కోణార్క్ వెళ్తారు. చంద్రభాగ బీచ్‌కి వెళ్తారు. అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్, కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ చూడొచ్చు. ఆ తర్వాత తిరిగి పూరికి బయల్దేరాలి. రాత్రికి పూరీలోనే బస చేస్తారు.
Day - 2 : పూరీలో జగన్నాథ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత చిలికా లేక్ సందర్శనకు వెళ్తారు. బోట్ రైడ్ చేస్తారు. ఐల్యాండ్, ఐరావడ్డీ డాల్ఫిన్ సైట్ చూడొచ్చు. చిలికాలో లంచ్ తర్వాత తిరిగి పూరీకి బయల్దేరుతారు. దారిలో అల్లార్‌నాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం పూరీ చేరుకుంటారు. రాత్రికి పూరీలో బస చేయాలి.
Day - 3: మూడో రోజు భువనేశ్వర్ బయల్దేరుతారు. దౌళి స్తూపం, లింగరాజ ఆలయం, ముక్తేశ్వర ఆలయం సందర్శించవచ్చు. ఉదయగిరి, ఖందగిరి గుహల్ని చూడొచ్చు. సాయంత్రం 5.55 గంటలకు భువనేశ్వర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7.35 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధరలివే....
irctc tourism konark tour cost: ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,955, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.22,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,325 ఉంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, సైట్‌సీయింగ్, ఎంట్రెన్స్ ఛార్జీలు, కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ఎంట్రీ టికెట్స్, చిలికా లేక్‌లో బోట్ ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
NOTE:
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‍సైట్‌లో తెలుసుకోవచ్చు.