Study Australia Road Show : హైదరాబాద్‌లో స్టడీ ఆస్ట్రేలియా రోడ్‌షో-study australia road show organized in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Study Australia Road Show : హైదరాబాద్‌లో స్టడీ ఆస్ట్రేలియా రోడ్‌షో

Study Australia Road Show : హైదరాబాద్‌లో స్టడీ ఆస్ట్రేలియా రోడ్‌షో

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 07:47 PM IST

Study In Australia : ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ స్టడీ ఆస్ట్రేలియా రోడ్‌షోను నిర్వహించింది. 26కి పైగా ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడేందుకు అవకాశం కల్పించింది.

స్టడీ ఆస్ట్రేలియా రోడ్ షో
స్టడీ ఆస్ట్రేలియా రోడ్ షో (unsplash)

స్డడీ ఆస్ట్రేలియా రోడ్ షో హైదరాబాద్ లో నిర్వహించారు. రోజంతా జరిగే ఈ కార్యక్రమం ఆస్ట్రేలియాలో విద్య ప్రమాణాలను, ప్రదర్శించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సలహాదారులు, సంస్థల అధిపతులు మాట్లాడుకునేందుకు అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియాలో చదువుకోవాలని నిర్ణయించుకునే ముందు విద్యార్థులు పరిగణించాల్సిన కీలక అంశాలను కార్యక్రమం కవర్ చేసింది.

విద్యార్థులు వీసా పొందే ప్రక్రియ నుంచి ఇమ్మిగ్రేషన్, గ్రాడ్యుయేట్ చేసే వరకు సమాధానాలను అందించారు. ఆస్ట్రేలియన్ ప్రభుత్వ ప్రతినిధులు దేశంలోని స్కాలర్‌షిప్‌లు, విద్యార్థుల జీవితం, భద్రత గురించి సమాచారాన్ని కూడా పంచుకున్నారు.

ఇటీవల, ఆస్ట్రేలియన్ యూనివర్శిటీల్లోని ప్రస్తుత భారతీయ విద్యార్థుల కోసం ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ 'ది స్టడీ ఆస్ట్రేలియా ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్ (SAIEP)' ప్రారంభించింది. మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ www.studyaustralia.gov.au చేయండి.

కొవిడ్ 19 తర్వాత.. ఆస్ట్రేలియా దేశం తన సరిహద్దులను తెరిచిన వెంటనే 2.60 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు చేరుకున్నారని ఓ అధికారి తెలిపారు. ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారతీయ విద్యార్థుల కోసం స్టడీ ఆస్ట్రేలియా ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్‌ను ఆస్ట్రేలియా ఆవిష్కరించిందని ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్, సౌత్ ఏషియా, అబ్దుల్ అక్రమ్ తెలిపారు.

ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ (ఆస్ట్రేడ్) ఆస్ట్రేలియాలో చదువుకోవడం, యూనివర్సిటీ ప్రతినిధులతో ఇంటరాక్ట్ చేయడం, విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న వీసాలు, స్కాలర్‌షిప్‌ల గురించి సమాచారాన్ని అందించడానికి 'స్టడీ ఆస్ట్రేలియా'తో రోడ్ షోలు నిర్వహిస్తుంది

'ఆస్ట్రేలియాలో చదివే భారతీయ విద్యార్థులు ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి మేం వారితో కలిసి పని చేస్తాం. స్టడీ ఆస్ట్రేలియా రోడ్‌షో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇన్‌స్టిట్యూట్‌ల అధిపతులకు నమ్మకమైన సంబంధిత సమాచారాన్ని అందించింది.' అని అక్రమ్ ఉటంకించారు.

IPL_Entry_Point