Mohammed Shami: షమీకి కరోనా - ఆస్ట్రేలియా సిరీస్ కు దూరం
Mohammed Shami: కరోనా బారిన పడటంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్ కు పేస్ బౌలర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. షమీ స్థానంలో వెటర్ పేసర్ ఉమేష్ యాదవ్ ఎంపికయ్యాడు
Mohammed Shami: ఇండియా పేసర్ మహమ్మద్ షమీ కరోనా బారిన పడ్డారు. షమీ కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. షమీ స్థానంలో వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ ను ఎంపికచేశారు. ఆస్ట్రేలియా సిరీస్ తో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమ్ ఇండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు ఉమేష్ యాదవ్. ఐపీఎల్ 2022లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన ఉమేష్ 16 వికెట్లతో రాణించాడు. కౌంటీ క్రికెట్ లో మిడిల్ సెక్స్ కు ప్రాతినిథ్యం వహించిన ఉమేష్ టాప్ వికెట్ టేకర్స్ లో ఒకరిగా నిలిచాడు.
ఈ నెల 20 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మొదలుకానుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్ తో పాటు పలువురు ఆటగాళ్లు మొహాలీ చేరుకున్నారు. కాగా ఈ సిరీస్ తోనే షమీ 20ల్లోకి ఏడాది తర్వాత రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా కుదరలేదు.
గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన వరల్డ్ కప్ తర్వాత టీ20 మ్యాచ్ లు ఆడలేదు షమీ. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్ లకు అతడికి జట్టులో చోటు లభించింది. కానీ కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ కు దూరమయ్యాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో షమీని కేవలం స్టాండ్ బై ప్లేయర్ గానే ఎంపిక చేశారు.