IRCTC Vizag Thailand Tour Package 2024: వైజాగ్ నుంచి డైరెక్ట్ గా థాయ్ లాండ్ వెళ్లాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను తీసుకొచ్చిన ఐఆర్ సీటీసీ… అతి తక్కువ ధరలోనే వాటిని ఆపరేట్ చేస్తోంది. ఇందులో ట్రైన్ తో పాటు ఫ్లైట్ టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అయితే థాయ్ లాండ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాకేజీ మాత్రం.. ప్రస్తుతం అందుబాటులో లేదు. సెప్టెంబర్ 7, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఇందుకు సంంబధించిన వివరాలను ఇక్కడ చూద్దాం….
మరోవైపు TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో హైదరాబాద్ నుంచి కూడా థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు. ఈ టూర్ ప్యాకేజీ మాత్రం… మే 09, 2024 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ పూర్తి అయితే… మరో తేదీని ప్రకటిస్తారు. అందుకు తగ్గట్టుగా ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ(Thailand Tour Package)ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 57415గా ఉంది. డబుల్ షేరింగ్ కు 49040గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 49040గా ప్రకటించారు.www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే… 040-27702407 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.