Nallamala Saleshwaram : తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర - నల్లమల లోయలోని ‘సళేశ్వరుడి’ని చూసొద్దామా..!
Nallamala Saleshwaram Yatra: నల్లమలలోని దట్టమైన అడవుల్లో సళేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని దర్శించుకోవాలంటే…. సాహస యాత్రకు సిద్ధం కావాల్సిందే..!
Nallamala Saleshwaram Yatra 2024: నల్లమల సలేశ్వరం(Nallamala Saleshwaram)... తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరు గాించింది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోనే…. ఈ సలేశ్వరం ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన సళేశ్వరుడిని దర్శించుకోవాలంటే… కర్రల సాయంతో వెళ్లాల్సిందే. లోయలోకి నడుచుకుంటా వెళ్లి…. దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి అందాలకు కేరాఫ్ గా ఉండే నల్లమలలోని ఈ సళేశ్వరం స్పాట్ మంచి టూరిస్ట్ స్పాట్ గా కూడా మారింది. చాలా రాష్ట్రాల నుంచి ఈ ప్లేస్ ను చూసేందుకు వస్తుంటారు.
సళేశ్వరం టూర్ (Saleshwaram)ప్లాన్ చేస్తే… నల్లమలలోని అనేక ప్రాంతాలను చూడొచ్చు. పక్కన ఉండే శ్రీశైలం బ్యాక్ వాటర్ అందాలను కూడా వీక్షించవచ్చు. నల్లమల ఫారెస్ట్ లో తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ల ద్వారా…. ప్రకృతి అందాలను సరికొత్త కోణంలో చూసే అవకాశం ఉంటుంది. ఇక జంగల్ సఫారీ చేసే అవకాశం కూడా తెలంగాణ టూరిజం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి టికెట్ ధరలు చెల్లించి… ఫారెస్ట్ లో సఫారీ చేసే అవకాశం ఉంటుంది. సళేశ్వరం వెళ్లేందుకు టూరిజం ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణానికి మరోవైపు వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్యాకేజీలను అమలు చేస్తోంది.
సళేశ్వరం ఎలా వెళ్లాలంటే…?
నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవులలో సలేశ్వరం ఉంటుంది. శ్రీశైలం – హైదరాబాద్ రహదారిలో గుంటా ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రధాన రహదారి నుంచి 30 కి.మీకుపైగా లోపలకి వెళ్లాలి. ఆ తర్వాత… 5 కిమీ వరకు నడవాల్సి ఉంటుంది. అలా అయితేనే లోయల ఉన్న సళేశ్వరుడి దర్శనం దక్కుతుంది. ఈ ప్రాంతమాతం రాళ్లు, రప్పలు ఉంటాయి. కర్రల సాయంతోనే నడవాల్సి ఉంటుంది. ఇదే ప్రాంతంలో నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది. సళేశ్వరుడి కొలువుదీరిన ప్రాంతంలో…. పైనుంచి నీటి దార ప్రవహిస్తూ ఉంటుంది. చాలా ఎత్తైన ప్రాంతం నుంచి ఈ జలాలు వస్తాయి. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి… సళేశ్వరుడిని దర్శించుకుంటారు.
భక్తులు లోయలోకి వెళ్లేటప్పుడు… వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్యో అంటూ వెళ్తారు. ఇక దర్శనం పూర్తి అయిన తర్వాత… బయటికి వచ్చేటప్పుడు పోతున్నాం.. పోతున్నం లింగమయ్యో అని భజన చేస్తూ వెళ్తారు. సలేశ్వరం లోయ దాదాపు రెండు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ప్రకృతిలో గడపాలని అనుకునే వారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ వెళ్లాలి.
ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది. మూడు రోజుల పాటు సాగే యాత్ర… ఏప్రిల్ 25వ తేదీతో ముగిసింది. గతంతో పోల్చితే…ఈసారి యాత్రికుల సంఖ్య తగ్గింది. ఇందుకు కారణం ఉంది. గతంలో కేవలం మూడు రోజులు మాత్రమే… ఇక్కడికి వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఏడాది పొడవునా ఇక్కడికి వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. దఫాల వారీగా ఇక్కడికి యాత్రికులు వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా ఈసారి జరిగిన జాతరకు యాత్రికుల సంఖ్య కొంతమేర తగ్గింది.
మేలో వెళ్లొచ్చు…
ఒక వేళ మీరు కూడా ఈ సళేశ్వరం వెళ్లాలని అనుకుంటే…. వచ్చే మేలో వెళ్లే అవకాశం ఉంటుంది. సఫారీ టూర్ ప్యాకేజీలో భాగంగా…. ప్రతిరోజూ కూడా ఈ సళేశ్వరం లింగమయ్యను చూడొచ్చు. ఇందుకోసం ముందుగానే టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం