TSRTC Buses : విజయవాడ వెళ్లేవారికి గుడ్ న్యూస్ - ప్రతి 10 నిమిషాలకో TSRTC బస్సు, డిస్కౌంట్ ఆఫర్ కూడా..!-tsrtc buses available every 10 minutes for passengers traveling on hyderabad vijayawada route ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Buses : విజయవాడ వెళ్లేవారికి గుడ్ న్యూస్ - ప్రతి 10 నిమిషాలకో Tsrtc బస్సు, డిస్కౌంట్ ఆఫర్ కూడా..!

TSRTC Buses : విజయవాడ వెళ్లేవారికి గుడ్ న్యూస్ - ప్రతి 10 నిమిషాలకో TSRTC బస్సు, డిస్కౌంట్ ఆఫర్ కూడా..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 27, 2024 11:49 AM IST

TSRTC Hyderabad to Vijayawada Buses: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ(TSRTC). హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులో ఉంచినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.

విజయవాడకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు
విజయవాడకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు (TSRTC Twitter)

Hyderabad to Vijayawada TSRTC Buses : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ(Hyderabad to Vijayawada) రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులో ఉంచినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతున్నట్లు తెలిపింది. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయని వివరించారు.

10 శాతం డిస్కౌంట్ కూడా…

ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని సజ్జనార్ వెల్లడించారు. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని సూచించారు.

ఈ రూట్ లో కూడా ఆఫర్స్…

బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయణంపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ(TSRTC) కల్పిస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు ఈ 10 శాతం రాయితీని వినియోగించుకుని… టీఎస్‌ఆర్టీసీ (TSRTC)బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోందని చెప్పారు.

శ్రీశైలానికి TSRTC ప్రత్యేక బస్సులు

TSRTC Srisailam Buses 2024: శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ(TSRTC). భక్తుల సౌకర్యార్థం శ్రీశైల(Srisailam) పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను నడుపుతోందని తెలిపింది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సుల్లోజేబీఎస్ నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర ఉందని తెలిపారు. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించామని తెలిపారు. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతుందని పేర్కొన్నారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించవచ్చని సూచించారు.

ఆవకాయ పచ్చడి ప్రియులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ(TSRTC). రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు TSRTC ద్వారా సులువుగా పంపించుకోవచ్చని తెలిపింది. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోందని ఎండీ సజ్జనార్ ఇటీవలే తెలిపారు. తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోంది. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు.

IPL_Entry_Point