AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు-amaravati ap pensions distribution ec orders ap govt dbt to pensioner accounts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Apr 27, 2024 02:34 PM IST

AP Pensions Distribution : ఏపీలో పింఛన్ల పంపిణీకి సమయం దగ్గర పడుతోంది. దీంతో ఈసీ..ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి చేయాలని లేనిపక్షంలో డీబీటీ విధానం గురించి ఆలోచన చేయాలని సీఎస్ ను ఆదేశించింది.

పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు (HT)

AP Pensions Distribution : ఏపీలో పింఛన్ల పంపిణీ(Pensions Distribution) పెద్ద ఉదంతంగా మారుతుంది. వాలంటీర్ల(Volunteers)పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో...గత నెలలో పింఛన్ల పంపిణీలో హైడ్రామా నడిచింది. ఈ వ్యవహారంలో తాజాగా ఈసీ(EC) ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీ(DBT) రూపంలో నేరుగా పింఛనుదారులకు చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. అయితే ఇంటింటి పెన్షన్ల పంపిణీకి సరిపడా సిబ్బంది లేరని, ఏప్రిల్‌లో చేపట్టినట్లు చేస్తామని సీఎస్ ఈసీకి తెలిపారు. దీంతో ఈసీ...డీబీటీ(DBT) విధానంలో పంపిణీ చేయలని ఆదేశించింది. పింఛన్లు సహా నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను ఈసీ గుర్తు చేసింది.

ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ

గత నెలలో జారీ చేసిన మార్గదర్శకాలను ఈసారి పాటించాలని ఈసీ(EC)...సీఎస్ కు తెలిపింది. వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల పంపిణీ(AP Pensions Distribution) చేపట్టాలని సీఎస్‌(CS)‌ను ఆదేశించింది. పింఛన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. ఎక్కడా వాలంటీర్లను వినియోగించవద్దని తెలిపింది. వాలంటీర్ల(Volunteers) స్థానంలో ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోవాలని ఈసీ సూచించింది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్లు, వితంతువు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా... వారికి ఇంటి వద్దే పింఛన్లు అందించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ఈసీ.. సీఎస్ కు తేల్చి చెప్పింది.

ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు

ఏపీలో ఎన్నికల పోలింగ్(Polling) కు సమయం దగ్గర పడుతోంది. అయితే ఈసీ(EC) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి(Election Duty) తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల పోలింగ్ విధుల్లో సిబ్బంది కొరత కారణంగా అంగన్వాడీలు(Anganwadis), కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓ(OPO)లుగా నియమించాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot)సదుపాయం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఫారం-12డి జారీ గడువును మే 1 వరకు పొడిగించింది. ఈ మేరకు సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏపీలో ఇప్పటికే నామినేషన్ల (Nominations)ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం