Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతా బెనర్జీ; స్వల్ప గాయం
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి హెలీకాప్టర్ ఎక్కుతుండగా కాలు స్లిప్ అయి కింద పడ్డారు. దాంతో, ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో ఆమె నిలదొక్కుకున్నారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకి స్వల్ప గాయం (ANI)
Mamata Banerjee injured: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్ లో హెలికాప్టర్ ఎక్కి సీట్లో కూర్చోబోతుండగా జారి పడిపోయారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ కి స్వల్ప గాయం అయింది. పూర్తిగా కింద పడకుండా ఆమెను ఆమె భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు సమాచారం. స్వల్ప గాయమే కావడంతో, ప్రథమ చికిత్స అనంతరం మమత బెనర్జీ ఎన్నికల ప్రచారం కోసం అసన్సోల్ కు తన ప్రయాణాన్ని కొనసాగించారు.
