HanuMan Telugu Telecast: టీఆర్పీలోనూ హనుమాన్ మూవీ దుమ్మురేపుతుందా?-hanuman set to telecast on zee telugu tv channel can this teja sajja prasanth varma superhero movie get huge rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Telugu Telecast: టీఆర్పీలోనూ హనుమాన్ మూవీ దుమ్మురేపుతుందా?

HanuMan Telugu Telecast: టీఆర్పీలోనూ హనుమాన్ మూవీ దుమ్మురేపుతుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 27, 2024 02:37 PM IST

HanuMan Telugu Telecast: హనుమాన్ సినిమా టీవీ ప్రీమియర్‌కు రెడీ అయింది. థియేటర్లు, ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం టీఆర్పీలోనూ దుమ్మురేపుతుందనే అంచనాలు ఉన్నాయి. వివరాలివే..

HanuMan Telugu Telecast: టీఆర్పీలోనూ హనుమాన్ రికార్డులను బద్దలుకొడుతుందా?
HanuMan Telugu Telecast: టీఆర్పీలోనూ హనుమాన్ రికార్డులను బద్దలుకొడుతుందా?

HanuMan Telugu Telecast: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ సూపర్ హీరో చిత్రం అంచనాలను మించి సుమారు రూ.330 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. థియేటర్లలో లాంగ్ రన్ సాధించి దుమ్మురేపింది. ఓటీటీల్లోనూ హనుమాన్ చిత్రం హవా చూపించింది. వారాల పాటు ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచి రికార్డుస్థాయి వ్యూస్ సాధించింది. ఇప్పుడు హనుమాన్ తెలుగులో టీవీలోకి వస్తోంది. దీంతో ఈ చిత్రం టీఆర్పీ విషయంలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.

ఏ టీవీ ఛానెల్‍లో.. ఎప్పుడు?

హనుమాన్ సినిమా టెలికాస్ట్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో రేపు (ఏప్రిల్ 28) సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. హనుమాన్ టెలికాస్ట్ కోసం జీ తెలుగు ఛానెల్‍ కూడా బాగా ప్రచారం చేస్తోంది.

టీఆర్పీల్లో రికార్డు సృష్టిస్తుందా..

హనుమాన్ చిత్రానికి భారీ క్రేజ్ ఉంది. అందుకే జీ తెలుగు ఛానెల్‍ల్లోనూ ఈ మూవీకి భారీ వ్యూవర్ షిప్ దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి రీవాచ్ వాల్యూ బాగుందని ఇప్పటికే నిరూపితమైంది. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాను చూడని వారితో పాటు.. థియేటర్లలో, ఓటీటీలో ఇప్పటికే చూసిన వారు కూడా మళ్లీ టీవీ ఛానెల్‍లోనూ మళ్లీ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో హనుమాన్‍కు భారీ స్థాయిలో టీఆర్పీ వచ్చే ఛాన్స్ ఉంది.

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక రేటింగ్ సాధించిన లిస్టులో అలవైకుంఠపురములో మూవీ 29.4 టీఆర్పీతో అగ్రస్థానంలో ఉంది. సరిలేరు నీకెవ్వరు (23.5), బాహుబలి 2 (22.7) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఓటీటీల హవా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీవీ ఛానెల్‍లో చిత్రాలకు ఆస్థాయిలో రేటింగ్ రావడం కష్టమే. ఇటీవలే గుంటూరు కారం సినిమాకు 9.23 రేటింగ్ వచ్చింది. హనుమాన్ చిత్రం సుమారు 13 నుంచి 15 మధ్య టీఆర్పీ రేటింగ్ సాధిస్తే టీవీల్లోనూ సూపర్ హిట్ అయినట్టే. ఒకవేళ 15కు మించి వస్తే మాత్రం అద్భుతమని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆల్ టైమ్ హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధించడం మాత్రం ప్రస్తుత కాలంలో కష్టమే. అయితే, మరి హనుమాన్ జీ తెలుగులో ఏ స్థాయిలో టీఆర్పీ రాబడుతుందో చూడాలి.

హనుమాన్ మూవీ ప్రస్తుతం తెలుగులో జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో జియోసినిమాలో, తమిళం, మలయాళం, కన్నడలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

హనుమాన్ మూవీలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటించారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సూపర్ హీరో మూవీని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ నిర్మించింది. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సముద్రఖని కీరోల్స్ చేశారు. ఈ మూవీ ఇటీవలే 25 థియేటర్లలో 100 రోజులను కూడా పూర్తి చేసుకుంది. థియేటరల్లో సినిమాలు 100 రోజులు ఆడడం అరుదుగా జరిగే ఈ కాలంలో.. తమ మూవీ ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ కూడా చేశారు.

IPL_Entry_Point