HanuMan OTT: మూడో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానున్న హనుమాన్ సినిమా.. డేట్ ఖరారు: వివరాలివే..-hanuman movie tamil malayalam kannada versions set to stream on disneyplus hotstar third ott platform for this film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Ott: మూడో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానున్న హనుమాన్ సినిమా.. డేట్ ఖరారు: వివరాలివే..

HanuMan OTT: మూడో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానున్న హనుమాన్ సినిమా.. డేట్ ఖరారు: వివరాలివే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 25, 2024 11:35 PM IST

HanuMan Movie OTT: హనుమాన్ సినిమా మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన మూడు భాషల వెర్షన్‍లకు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఖరారయ్యాయి.

HanuMan: మూడో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానున్న హనుమాన్ సినిమా.. డేట్ ఖరారు: వివరాలివే..
HanuMan: మూడో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానున్న హనుమాన్ సినిమా.. డేట్ ఖరారు: వివరాలివే..

HanuMan OTT: హనుమాన్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొన్ని ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ముందుగా హనుమాన్ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో రూపొందిన ఈ చిత్రం ముందుగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍కు రావడం ఆశ్చర్యపరిచింది. అయితే, దానికి ఒక్క రోజు తర్వాత మార్చి 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హనుమాన్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‍ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ భాషల వెర్షన్‍లలో మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హనుమాన్ అందుబాటులోకి రానుంది.

మరో ప్లాట్‍ఫామ్ ఇదే..

హనుమాన్ సినిమా తమిళం, మలయాళం, కన్నడ భాషల వెర్షన్లు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనున్నాయి. ఆ మూడు భాషల్లో ఏప్రిల్ 5వ తేదీన హాట్‍స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‍స్టార్ నేడు (మార్చి 25) అధికారికంగా ప్రకటించింది.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమా తమిళ వెర్షన్ ఏప్రిల్ 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని హాట్‍స్టార్ నేడు వెల్లడించింది. అలాగే, మలయాళం, కన్నడ, వెర్షన్‍లలోనూ రానుందని కన్ఫర్మ్ చేసింది.

మూడు ఓటీటీల్లో..

ఒక చిత్రం మూడు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవడం అరుదు. అయితే, హనుమాన్ విషయంలో ఇదే జరుగుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ ‘జియోసినిమా’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో ఏప్రిల్ 5న డిస్నీ+ హాట్‍స్టార్‌లోకి రానుంది. ఇలా.. ఏకంగా మూడు ప్లాట్‍ఫామ్‍ల్లో హనుమాన్ స్ట్రీమింగ్‍కు ఉండనుంది.

హనుమాన్ సినిమా సంక్రాంతి సీజన్‍లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లో భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలను పొందింది. రెండు నెలల నిరీక్షణ తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ట్రెండింగ్‍లో టాప్

జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హనుమాన్ సినిమా తెలుగు వెర్షన్ వారం రోజులుగా టాప్‍లో ట్రెండ్ అవుతోంది. నేషనల్ వైడ్‍గా అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రం 5 రోజుల్లోనే 207 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసి రికార్డులు సృష్టించిందని జీ5 ఓటీటీ కూడా ప్రకటించింది. జియోసినిమా ఓటీటీలో హనుమాన్ హిందీ వెర్షన్ కూడా టాప్‍లోనూ దూసుకెళుతోంది. థియేటర్లలో బంపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీల్లోనూ దుమ్మురేపుతోంది.

హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా.. తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ మూవీలో విజువల్స్, సూపర్ హీరో ఎలిమెంట్స్, కథనం, హనుమంతుడిని చూపించిన విధానం.. ఇలా చాలా విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సుమారు రూ.40కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‍కుమార్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు.

Whats_app_banner