HanuMan OTT Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన హనుమాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..-hanuman movie telugu ott release teja sajja prasanth varma super hero film streaming started on zee5 platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Ott Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన హనుమాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

HanuMan OTT Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన హనుమాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 17, 2024 11:56 AM IST

HanuMan OTT Telugu Release: హనుమాన్ సినిమా తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. దీంతో ఎట్టకేలకు ప్రేక్షకుల నిరీక్షణ ముగిసింది. హనుమాన్ చిత్రాన్ని తెలుగులో ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

HanuMan OTT Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన హనుమాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
HanuMan OTT Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన హనుమాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

Hanu-Man OTT Telugu Streaming: ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. హనుమాన్ సినిమా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషించిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ తెలుగు సూపర్ హీరో మూవీ జనవరి 12వ తేదీన రిలీజై సూపర్ హిట్ అయింది. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. సుమారు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురుస్తున్నారు. అయితే, ముందుగా హిందీలో వచ్చింది. కాగా, ఎట్టకేలకు నేడు (మార్చి 17) హనుమాన్ సినిమా తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

తెలుగులో స్ట్రీమింగ్

హనుమాన్ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (మార్చి 17) తెలుగులో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో త్వరలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు.. తెలుగులో ‘జీ5’ ఓటీటీలో హనుమాన్ సినిమాను చూసేయవచ్చు.

జియో సినిమాలో హిందీలో..

హనుమాన్ సినిమా శనివారమే (మార్చి 16) జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హిందీ భాషలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కలర్స్ సినీ ప్లెక్స్ టీవీ ఛానెల్‍లోనూ ప్రసారమైంది. దీంతో తెలుగులో ఓటీటీలోకి ఎప్పుడు అంటూ జీ5 ప్లాట్‍ఫామ్‍పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఎట్టకేలకు హనుమాన్‍ను తెలుగులో నేడు స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది జీ5 ఓటీటీ.

రెండు నెలల తర్వాత..

హనుమాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు అమితంగా ఎదురుచూశారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై కొన్ని రోజుల చాలా మంది నెటిజన్లు పోస్టులు చేస్తూ వచ్చారు. దీంతో ఓ దశలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా స్పందించి త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు. కాగా, మార్చి 16న ముందుగా హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. అయితే, తెలుగులో ముందుగా తీసుకురాకుండా హిందీలో ఎలా అంటూ కొందరు ఆగ్రహం చెందారు. తెలుగు హక్కులను దక్కించుకున్న జీ5 ఓటీటీపై అసహనం చెందారు. అయితే, ఎట్టకేలకు నేడు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగులో హనుమాన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో రిలీజైన 66 రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.

హనుమాన్ సినిమాలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ కీరోల్స్ చేశారు. ఈ సూపర్ హీరో మూవీలో విజువల్స్, గ్రాఫిక్స్, హనుమంతుడిని చూపించిన తీరు.. ఇలా చాలా విషయాలు ప్రేక్షకులకు చాలా మెప్పించాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సంక్రాంతికి రిలీజై అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రంగా టాలీవుడ్‍లో హనుమాన్ చరిత్ర సృష్టించింది. ప్రైమ్‍షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు నిరంజన్ రెడ్డి. సుమారు రూ.40కోట్లతో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.