Hanuman OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి.. కానీ!-hanuman hindi version ott streaming on jiocinema without subscription hanuman ott release zee5 teja sajja ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Ott Streaming: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి.. కానీ!

Hanuman OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి.. కానీ!

Sanjiv Kumar HT Telugu
Mar 17, 2024 10:21 AM IST

Hanuman OTT Streaming Free: ఎప్పుడెప్పుడా అని ఆడియెన్స్ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు హనుమాన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సాధారణంగా ఓటీటీల్లో సినిమాలు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ కావాలి. కానీ, ఎలాంటి ఛార్జ్ లేకుండా ఇందులో హనుమాన్‌ను ఫ్రీగా చూసేయండి.

ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి.. కానీ!
ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి.. కానీ!

Hanuman OTT Release: క్రియేటివ్ అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించి అద్భుతమైన విజువల్ వండర్ హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేసింది. తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా వచ్చిన హనుమాన్‌లో పవర్‌ఫుల్ విలన్‌గా వినయ్ రాయ్ నటించాడు. ఇక కీలక పాత్రలో కోలీవుడ్ హీరోయిన్, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అలరించింది.

40 కోట్ల బడ్జెట్‌

ఈ ఏడాది జనవరి 12న నలుగురు స్టార్ హీరోలతో పోటీ పడుతూ విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దాదాపుగా రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ సినిమా సుమారు రూ. 300 కోట్లుకుపైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 150 థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుని మరో రికార్డ్ అందుకుంది. ప్రేక్షకులను థియేటర్లవైపు బారులు తీరేలా చేసిన హనుమాన్ సినిమా ఓటీటీ కోసం ఎంతగానో ఎదురుచూశారు.

హనుమాన్ హిందీ వెర్షన్ ఓటీటీ

మొత్తానికి ప్రేక్షకులు ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు ఓటీటీలోకి హనుమాన్ సినిమా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో (JioCinema OTT) హనుమాన్ హిందీ వెర్షన్ రాత్రి (మార్చి 16 అర్ధరాత్రి) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇదివరకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లే హనుమాన్ సినిమాను చూసేందుకు వీలుంటుందని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమా ఓటీటీలో హనుమాన్ మూవీని వీక్షించవచ్చు.

హనుమాన్ తెలుగు వెర్షన్ కోసం

అయితే, హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రమే ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు ఆడియెన్స్‌ను కాస్తా నిరాశపరిచే విషయం అని చెప్పుకోవచ్చు. హనుమాన్ సినిమాను తెలుగులో కాకుండా ముందుగా హిందీలో ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. ఇక హనుమాన్ తెలుగు వెర్షన్ కోసం ఇంకొంత కాలం ఆగాల్సిందే అని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్‌పై త్వరలో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు హనుమాన్‌ను చూడాలనుకునేవారు హిందీ వెర్షన్‌లో సబ్ టైటిల్స్‌తో వీక్షించవచ్చు.

ఓటీటీ ఆలస్యంపై

అలాగే కలర్స్ సినీ ప్లెక్స్ ఛానెల్‌లో కూడా హనుమాన్ హిందీ వెర్షన్ ప్రసారం చేయనున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ ఓటీటీ ఆలస్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ఆలస్యంపై హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రియాక్ట్ కూడా అయ్యారు.

సపోర్ట్ చేయండి

"హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయలేదు. చిత్రాన్ని వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము అహర్నిశలు శ్రమిస్తున్నాం. కొన్ని విషయాల పట్ల దృష్టి సారించాం. ఎప్పుడూ మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే మా ఉద్దేశం తప్పా ఇంకేం లేదు. దయచేసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. అలాగే మమ్మల్ని ఎప్పటిలాగే సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు" అని ట్విట్టర్‌లో ప్రశాంత్ వర్మ తెలిపాడు.

అతి త్వరలో

ఇక, హనుమాన్ తెలుగు ఓటీటీ వెర్షన్‌పై జీ5 సంస్థ కూడా ఓ ప్రకటన చేసింది. సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. కానీ, స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. ఇప్పుడు హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో అతి త్వరలో తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point