Thulasivanam OTT: ఓటీటీలోకి సరికొత్త రొమాంటింక్ కామెడీ క్రికెట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?-thulasivanam web series ott streaming on etv win from march 21 tulasivanam trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Thulasivanam Web Series Ott Streaming On Etv Win From March 21 Tulasivanam Trailer Released

Thulasivanam OTT: ఓటీటీలోకి సరికొత్త రొమాంటింక్ కామెడీ క్రికెట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 17, 2024 08:31 AM IST

Thulasivanam OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ రానుంది. క్రికెట్ నేపథ్యంలో లవ్, రొమాంటిక్ కామెడీ సిరీస్‌గా వస్తున్న తులసీవనం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పిస్తున్న తులసీవనం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు చూద్దాం.

ఓటీటీలోకి సరికొత్త రొమాంటింక్ కామెడీ క్రికెట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటింక్ కామెడీ క్రికెట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Thulasivanam OTT Release: క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ తులసీవనం. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు అనిల్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా తలసీవనం ట్రైలర్ లాంచ్ ఏర్పాటు చేసి ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో లవ్ రొమాంటిక్ కామెడీతోపాటు క్రికెట్ నేపథ్యం ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

''జనరల్‌గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా.. అవి ఇట్ల అనగానే అట్ల జరిగిపోతాయి' అంటూ తులసి ( అక్షయ్) డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, లవ్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్ చాలా ఫ్రెష్‌గా నేచురల్‌గా అలరించాయి. స్ట్రీట్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచాయి. అక్షయ్, ఐశ్వర్య, విష్ణు తమ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బానవ్వించారు.

దర్శకుడు అనిల్ రెడ్డి న్యూ ఏజ్ కంటెంట్‌ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. స్మరన్ నేపథ్య సంగీతం ఫన్‌ని మరింత ఎలివేట్ చేయగా, ప్రేమ్ సాగర్ కెమెరా పనితనం బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ గ్రిప్పింగ్‌గా ఉంది. మొత్తానికి ట్రైలర్ తులసీవనంపై చాలా క్యురియాసిటీని పెంచింది. ఇక ట్రైలర్ చివర్లో "చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినవారా.. అది ఆర్సీబీపై.. సాలా కప్ నమ్ దే" అని చెప్పై డైలాగ్ ఆకట్టుకుంది.

రొమాంటిక్ కామెడీ జోనర్‌లో వస్తోన్న తులసీవనం వెబ్ సిరీస్‌ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవ్ విన్‌లో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే తులసీవనం ఓటీటీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో సిరీస్‌ను సమర్పిస్తున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పీచ్ ఇచ్చారు.

"అనిల్, తులసి పెళ్లి చూపులు నుంచి నాకు సహాయ దర్శకులుగా ఉన్నారు. మాది విడదీయలేని ఓ అనుబంధం(నవ్వుతూ). తులసి అనే పేరు పెట్టాడు. కానీ ఇది అనిల్ పిక్చరే. చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కి సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్ దృష్ట్యా కొన్ని భయాలు ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వెనుక అందరి కృషి ఉంది. క్లారిటీ థీం అనేది చాలా ముఖ్యం. తులసీవనంలో ఆ క్లారిటీ ఉంటుంది" అని తరుణ్ భాస్కర్ అన్నారు.

"అనిల్ నిజాయితీ తీయడం ఒక ఎత్తయితే దానిని ఈటీవీ విన్ ప్రోత్సహించడం మరో గొప్ప విషయం. ఇది వారితో నా మొదటి అసోషియేషన్. వేరే భాషల నుంచి సినిమాలు వస్తున్నపడు తెలుగులో కూడా టికెట్లు తెగుతున్నాయి. కథలు బాగా చెబుతున్నారనే బ్రాండ్ ఆ పరిశ్రమలకు క్రియేట్ అయ్యింది. తెలుగులో దాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలనేది నా కోరిక. ఇందులో ఈటీవీ విన్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నాను. దీని కోసమే తులసీవనం తప్పకుండా చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

IPL_Entry_Point