Tharun Bhaskar: మన జాబ్ ప్రమాదంలో ఉందన్న తరుణ్ భాస్కర్.. ఎస్పీ చరణ్‌తో వివాదంపై కామెంట్స్-tharun bhaskar clarity about issue with sp charan on sp balu ai voice in tulasivanam trailer launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tharun Bhaskar: మన జాబ్ ప్రమాదంలో ఉందన్న తరుణ్ భాస్కర్.. ఎస్పీ చరణ్‌తో వివాదంపై కామెంట్స్

Tharun Bhaskar: మన జాబ్ ప్రమాదంలో ఉందన్న తరుణ్ భాస్కర్.. ఎస్పీ చరణ్‌తో వివాదంపై కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 17, 2024 07:52 AM IST

Tharun Bhaskar About Controversy With SP Charan: ఇవాళ, రేపు మన జాబ్ ప్రమాదంలో ఉందని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు సింగర్ ఎస్పీ చరణ్‌కు సంబంధించిన వివాదంపై రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేశారు తరుణ్ భాస్కర్.

మన జాబ్ ప్రమాదంలో ఉందన్న తరుణ్ భాస్కర్.. ఎస్పీ చరణ్‌తో వివాదంపై కామెంట్స్
మన జాబ్ ప్రమాదంలో ఉందన్న తరుణ్ భాస్కర్.. ఎస్పీ చరణ్‌తో వివాదంపై కామెంట్స్

Tharun Bhaskar SP Charan SP Balu: పాపులర్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ మధ్య కాంట్రవర్సీ ఎదుర్కున్న విషయం తెలిసిందే. లెజండరీ సింగర్, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) గొంతును (ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో రీ క్రియేట్ చేసినందుకుగాను విమర్శల పాలయ్యారు తరుణ్ భాస్కర్. కీడా కోలా మూవీలో ఏస్పీబీ (SPB) గొంతును వాడినందుకు మ్యూజిక్ డైరెక్ట్ వివేక్ సాగర్‌తోపాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, సింగర్ ఎస్పీ చరణ్ (SP Charan) నోటీసులు పంపారు.

తరుణ్ భాస్కర్ కామెంట్స్

ఎస్పీబీ వాయిస్‌ను అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం కూడా ఇవ్వలాంటూ డిమాండ్ చేశారు ఎస్పీ చరణ్. ఈ కీడా కోలా సినిమాకు డైరెక్టర్ అయిన తరుణ్ భాస్కర్ ఈ వివాదంపై తాజాగా స్పందించారు. తులసీవనం అనే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమాధానం ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అవమానించాలని కాదు

"మాకు ఎస్పీ చరణ్ సార్‌కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ సమస్య వచ్చింది. అది మా సైడ్ నుంచి.. ఎస్పీ చరణ్ సార్ సైడ్ నుంచి కూడా. ఎవరైనా సరే ఏదైనా సమ్‌థింగ్, ఎగ్జైటింగ్ కొత్తగా చేయాలని అనుకుంటారు. అలాగే మన సినీ లెజండరీలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఎవరినీ అవమానించాలన్న ఉద్దేశం మాకు ేదు. మీరు చూస్తున్నారు.. నేను చేసేది ఏ సినిమా అయినా పెద్ద స్టార్స్‌తో కాదు. కమర్షియల్ సినిమాలు కాదు" అని తరుణ్ భాస్కర్ అన్నారు.

ప్రయోగాలు చేయాల్సిందే

"ఏదైనా కమర్షియల్‌గా చేయాలని అనుకోవట్లేదు. కమర్షియల్ మెంటాలీతో చేయలేదు. మా వరకు ఏదో ఒకటి కొత్తగా చేయాలనే ప్రయత్నం అంతే. ఏఐ వచ్చినా కూడా దానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఇవాళ నా జాబ్ గానీ, మీ జాబ్ గానీ ప్రమాదంలో ఉంది. రేపు ఏం అవుతుందో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం అందరినీ గౌరవించాలి, ప్రయోగాలు చేయాల్సిందే. ఎందుకంటే ఇవాళ నేను చేసినా, ఇంకెవరు చేసినా చేయకపోయినా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కొన్ని విషయాల్లో కొన్ని కమ్యూనేషన్ అయి ఉండొచ్చు కానీ, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. ఏ సమస్య లేదు" అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

స్వాతిలో ముత్యమంతా సాంగ్

తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్స్ వల్ల సింగర్ ఎస్పీ చరణ్‌తో గొడవ సద్దుమణిగిందని స్పష్టమైపోయింది. ఇదిలా ఉంటే, తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన కీడా కోలా సినిమా గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ ఫోన్‌లో ఒకరిని బూతులు తిట్టే సన్నివేశంలో మరొక కమెడియన్ పాటలు వింటుంటాడు. అప్పుడు ఫుల్ వాల్యూమ్‌తో ఆ పాట ప్లే చేసి బూతులను మ్యూట్ చేయించినట్లుగా చూపించారు. అప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో స్వాతిలో ముత్యమంత అనే పాట వినొస్తుంది.

పెళ్లి చూపులు మూవీతో

ఆ పాటను బాలసుబ్రహ్మణ్యం గొంతును ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రీ క్రియేట్ చేశారు. ఈ విషయంపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆ టాపిక్ కాంట్రవర్సీగా మారింది. ఇకపోతే షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన అనుభవంతో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన మొదటి సినిమా పెళ్లి చూపులు సూపర్ హిట్ అయింది. దాంతో తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Whats_app_banner