YSRCP Manifesto 2024 : 2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల - అమ్మఒడి, రైతు భరోసా నగదు పెంపు, ఈసారి జగన్ ఇచ్చిన హామీలివే!-cm ys jagan released ysrcp manifesto for ap elections 2024 highlights are here ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ysrcp Manifesto 2024 : 2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల - అమ్మఒడి, రైతు భరోసా నగదు పెంపు, ఈసారి జగన్ ఇచ్చిన హామీలివే!

YSRCP Manifesto 2024 : 2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల - అమ్మఒడి, రైతు భరోసా నగదు పెంపు, ఈసారి జగన్ ఇచ్చిన హామీలివే!

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 27, 2024 12:58 PM IST

YSRCP Manifesto 2024 Updates : వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా కింద నగదును పెంచుతున్నట్లు ప్రకటించారు. మూడు రాజధానులపై జగన్ కీలక ప్రకటన చేశారు.

వైసీపీ మేనిఫెస్టో విడుదల
వైసీపీ మేనిఫెస్టో విడుదల

YSRCP Manifesto 2024 : మేనిఫెస్టో(Manifesto) అంటే పవిత్రమైన గ్రంథమని అన్నారు వైసీపీ అధినేత జగన్(YS Jagan). 2019లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని గుర్తు చేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన.... మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో సమానంగా చూసి అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోకు కావాల్సిన గుర్తింపును ఇచ్చామని చెప్పారు. నవరత్నాల పాలనకు మేనిఫెస్టో అద్దంపట్టిందన్నారు. నవరత్నాల కింద 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను డీబీటీల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇది ఒక చరిత్ర అని జగన్ చెప్పుకొచ్చారు.

2019లో(YSRCP Manifesto 2019) ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా...గడిచిన 58 నెలల కాలంలో అమలు చేశామని చెప్పారు. చేయగలిగివే చెప్పి చేసి చూపించామన్నారు. అవి అమలు చేసే ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నామని ఉద్ఘింటించారు. సమస్యలకు పరిష్కారం చూపుతూ 58 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన జరిగిందని చెప్పారు. కొవిడ్ లాంటి సమస్యలు వచ్చినా... సాకులు చూపలేదన్నారు.

YSRCP Manifesto -వైసీపీ మేనిఫెస్టో -2024 వివరాలు:

  • 2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను(YSRCP Manifesto 2024) విడుదల చేసింది.
  • విద్య, వైద్యం,వ్యవసాయానికి ప్రాధ్యానత ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన
  • - మహిళలు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద గతంలో రూ. 75 వేలుగా ఉండేది. ఈసారి కూడా ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తామని జగన్ తెలిపారు.
  • వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మరో నాలుగు ధపాల కింద డబ్బులు ఇస్తాం.
  • - వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మూడు దఫాలు ఇచ్చాం. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తాం.
  • జగనన్న అమ్మఒడి కింద రూ. 15 వేలు ఉండేది. ఈసారి రూ. 17 వేలకు పెంచుతామని ప్రకటన
  • సున్నా వడ్డీ కింద రుణాల మాఫీ స్కీమ్ కొనసాగుతుంది.
  • -వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ ముబారక్ స్కీమ్ ను కొనసాగిస్తామని జగన్ తెలిపారు.
  • వైఎస్సార్‌ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేల పెంపు, వైఎస్సార్‌ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంచుతామని జగన్ ప్రకటించారు.
  •  పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ స్కీమ్ కొనసాగింపు ఉంటుంది.
  • లారీడ్రైవర్లకు కూడా వాహనమిత్ర - రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.
  • వైఎస్ఆర్ లా నేస్తం కొనసాగింపు ఉంటుంది.
  • వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 16వేలకు పెంపు.
  • వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేస్తామని జగన్ ప్రకటన.
  • రాష్ట్రంలో తలపెట్టిన 12 కొత్త మెడికల్ కాలేజీలను వేగంగా పూర్తి చేస్తాం.
  • కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తాం.
  • దళితుల జనాభా 500కి పైగా ఉంటే ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటన.
  • దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధులు.
  • అప్కో బకాయిలను ఈ దఫా కూడా కొనసాగిస్తాం.
  • కాపు సంక్షేమం కోసం వైసీపీ పాలనలో రూ. 34వేల కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో మరింత సంక్షేమం చేస్తాం.
  • ఔట్ సోర్సింగ్ కింద రూ. 25వేల వరకు జీతం పొందే ఉద్యోగులకు విద్య, వైద్యానికి సంబంధించిన నవరత్నాల స్కీమ్ లను వర్తింపజేస్తారు.
  • వైఎస్ఆర్ బీమా స్కీమ్ కింద ఆన్ లైన్ లో పుడ్ ఆర్డర్స్ ను సప్లయ్ చేసే వారికి వర్తింపజేస్తారు.
  • బోగాపురం పోర్టు పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని జగన్ ప్రకటన.
  • వచ్చే ఐదేళ్లలో సురక్షితమైన తాగు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం.
  • వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే… విశాఖపట్నం నుంచి పాలన ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని జగన్ కీలక ప్రకటన చేశారు.
  • వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.

WhatsApp channel