(1 / 7)
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రజాగళం సభ నిర్వహించాయి. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొ్న్నారు.
(2 / 7)
తణుకు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ... తనకు అనుభవం ఉంది, పవన్ కల్యాణ్ కు పవర్ ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ప్రజా గళానికి వారాహి తోడైంది, అహంకారాన్ని బూడిద చేస్తుందని చంద్రబాబు అన్నారు.
(3 / 7)
రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన వ్యక్తి, చేసి చూపించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని చంద్రబాబు అన్నారు. 2014లో NDA కూటమి పశ్చిమ గోదావరి జిల్లాలో 15/15 సీట్లు గెలవడానికి కారణం పవన్ కల్యాణ్ అని అన్నారు. ఇప్పుడు మళ్లీ NDA కూటమిగా కలిసి వచ్చాం, వైసీపీకి డిపాజిట్లు కూడా రాకూడదని చంద్రబాబు అన్నారు.
(4 / 7)
రాష్ట్రానికి 10 పాయింట్స్ ఫార్ములాతో ప్రజల్లోకి వస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. చిట్టచివరి పొలానికి కూడా నీరు అందాలి, ప్రతీ ఒక్కరికీ న్యాయం జరగాలి, రాష్ట్రం అభివృద్ది జరగాలి అనేదే మా లక్ష్యమని తణుకు ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ అన్నారు.
(5 / 7)
సగటు మనిషి ఆవేదన జనసేన అని పవన్ అన్నారు. తణుకులో ఉన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు వైసీపీ నాయకులు చేస్తున్న దోపిడీ అందరికీ తెలుసు, కలుగులో ఎలకల్లా దాకున్న వారిని బయటకు లాగుదామన్నారు.
(6 / 7)
సీపీఎస్ ఎంత క్లిష్టమైన అంశం అయినప్పటికీ అసెంబ్లీకి రాగానే దీనిపై మాట్లాడతాను, అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు దానిని పరిష్కరించాలని కూటమి భాగస్వాములకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
(7 / 7)
తాను చాలా తగ్గాను, ప్రజలు బాగుపడాలని జనసేన అభ్యర్థులను కూడా వెనక్కి తీసుకున్నాను, కేవలం ప్రజల బాగు కోసమే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా నాకు తెలిసిన పవన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు అయిందా? అని మంత్రి అంబటిని అడిగితే డ్యాన్సులు చేస్తారు, ఓలమ్మి తిక్కరేగిందా అంటాడు, పునరావాసం గురించి అడిగితే అబ్బనీ తియ్యని దెబ్బ అంటారని మంత్రిపై విమర్శలు చేశారు.
ఇతర గ్యాలరీలు