Ponnam Prabhakar : బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేకి, మేనిఫెస్టోపై మంత్రి పొన్నం ఫైర్
Ponnam Prabhakar : బీజేపీ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే బలహీన వర్గాల పక్షం ఎవరో తెలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ 14 అంశాల మేనిఫెస్టోలో బలహీన వర్గాలకు సంబంధించి ఒక్క అంశం పెట్టలేదని విమర్శించారు.

Ponnam Prabhakar : బీజేపీ(BJP) బలహీన వర్గాల వ్యతిరేకి..వారి మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ (Paanch Nyay)లో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చామన్నారు. బలహీన వర్గాలు ఆలోచించాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలబడాలన్నారు. బీజేపీ లోక్ సభ ఎన్నికలకు(Lok Sabha Elections) కోసం 14 అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించిందని, బలహీన వర్గాల ప్రధాన మంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోదీ...మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయమన్నారు. ఇది దేశంలో ఉన్న బలహీన వర్గాలంతా గమనించాలని కోరుతున్నానన్నారు. దాంతో పాటుగా 10 సంవత్సరాలు ప్రధాని ఉన్న వ్యక్తి మిగతా వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని, కానీ బలహీన వర్గాలకు(Weaker Sections) సంబంధించి ఒక్క సంక్షేమ కార్యక్రమం, లబ్ది జరిగే నిర్ణయం తీసుకోలేదని ఆరోపిచారు.
బీజేపీ వ్యాపార వర్గాల పార్టీ
కుల గణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే ..దానికి సంబంధించి పాంచ్ న్యాయ్ లో ఒక అంశంగా పెట్టిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలోనే ఆ అంశాలను వ్యతిరేకించిన బీజేపీ సుప్రీంకోర్టు అఫిడవిట్ లో కుల గణనకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలలో ఎంత ధనిక వర్గాలు ఉన్నారో తెలిస్తే వాళ్లకి పేదలకు అంత న్యాయం చేయవచ్చని సామాజిక స్పృహతో కాంగ్రెస్ పార్టీ ఉంటే, పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto)ని..కాంగ్రెస్ మేనిఫెస్టోని(Congress Manifesto) బీసీలు చదివి నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
తెలంగాణలో కులగణన
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కుల గణన సర్వే (Caste Census)చేస్తుందని మంత్రి పొన్నం (Ponnam Prabhakar)తెలిపారు. అనేక కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్ లో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా పోరాడతామన్నారు. ఎన్నికల్లో బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టోని చదివి..బలహీన వర్గాల పట్ల వారికి ఉన్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలని కోరుతున్నానన్నారు.
సంబంధిత కథనం